...
...
Next Story

స్కూల్ ముందు గోలీ సోడా దొరికే ప్లేస్‌లలోనే డ్రగ్స్ దొరకడం ఆందోళనకరం.. రైజింగ్ తెలంగాణకు మద్దతుగా నిలుద్దాం: రామ్ చరణ్

అంతర్జాతీయ డ్రగ్స్, అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈవెంట్లో రామ్ చరణ్ పాల్గొన్నాడు. ఒకప్పుడు స్కూల్ ముందు గోలీ సోడా దొరికే ప్లేస్ లలోనే ఇప్పుడు డ్రగ్స్ దొరకడం ఆందోళనకరమని అతడు అన్నాడు.

Published on: Jun 26, 2025 09:35 PM IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా డ్రగ్స్ కు వ్యతిరేకంగా గళమెత్తాడు. అంతర్జాతీయ డ్రగ్స్, అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన రైజింగ్ తెలంగాణ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి అతడు పాల్గొన్నాడు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా అందరం రైజింగ్ తెలంగాణకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చాడు.

గోలీ సోడా దొరికే చోట డ్రగ్స్

స్కూల్ ముందు గోలీ సోడా దొరికే ప్లేస్‌లలోనే డ్రగ్స్ దొరకడం ఆందోళనకరం.. రైజింగ్ తెలంగాణకు మద్దతుగా నిలుద్దాం: రామ్ చరణ్
స్కూల్ ముందు గోలీ సోడా దొరికే ప్లేస్‌లలోనే డ్రగ్స్ దొరకడం ఆందోళనకరం.. రైజింగ్ తెలంగాణకు మద్దతుగా నిలుద్దాం: రామ్ చరణ్

డ్రగ్స్కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం గురువారం (జూన్ 26) ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించింది. దీనికి రామ్ చరణ్ ప్రత్యేక అతిథిగా వచ్చాడు. అతనితోపాటు సీఎం రేవంత్ రెడ్డి, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, విజయ్ దేవరకొండ, ప్రొడ్యూసర్ దిల్ రాజులాంటి వాళ్లు కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో రామ్ చరణ్ మాట్లాడాడు.

“రైజింగ్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా ఇలాంటి అవగాహన కార్యక్రమం నిర్వహించినందుకు, దీనికి హాజరైనందుకు సీఎం రేవంత్ రెడ్డి, సోదరుడు విజయ్ దేవరకొండ, దిల్ రాజు, పుల్లెల గోపీచంద్ లకు కృతజ్ఞతలు. నా చిన్నతనంలో స్కూల్లో ఉన్నప్పుడు గోలీ సోడా, పాప్సికిల్స్ కొనుక్కొని తినేవాడిని. కానీ ఇప్పుడదే ప్లేస్ లలో డ్రగ్స్ దొరుకుతుండటం, తెలియక వాటిని చిన్నారులు వాడుతుండటం చూస్తుంటే ఆందోళనగా ఉంది. ఏదో తాత్కాలికంగా ఉండే ఆనందం కోసం ఇలాంటి ప్రమాదకర పదార్థాలు తీసుకోవడం సరికాదు” అని చరణ్ అన్నాడు.

కుటుంబాలతో గడపండి

ఈ సందర్భంగా నిజమైన ఆనందం ఎక్కడ ఉంటుందో కూడా చరణ్ చెప్పాడు. “నిజమైన ఆనందం కుటుంబంతో గడపడంలో ఉంటుంది. ఉదయాన్నే కసరత్తులు చేయడం, స్పోర్ట్స్ ఆడటం.. షూటింగ్ కు వెళ్లి రావడం, తర్వాత కుటుంబంతో విలువైన సమయం గడపడం, తర్వాత స్నానం చేసి పడుకొని మరుసటి రోజు కోసం సిద్ధం కావడం.. ఇంతకుమించిన ఆనందం ఏముంటుంది” అని చరణ్ అన్నాడు.

ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కాబోతోంది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe