...
...
Next Story

పెద్ది మూవీ కోసం కండలు పెంచుతున్న రామ్ చరణ్.. లుక్ అదిరిపోయిందిగా.. ఫొటో వైరల్

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ కొత్త సినిమా కోసం కష్టపడుతున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న పెద్ది మూవీ కోసం కండలు పెంచుతున్నారు. తన కొత్త లుక్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు చరణ్. ఆ లుక్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

Published on: Jul 21, 2025, 09:55:16 IST
By ,
Prefer HTon Google
Advertisement

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా కోసం రంగంలోకి దిగారు. పెద్ది మూవీలోని రా అండ్ రస్టిక్ లుక్ కోసం కండలు పెంచేస్తున్నారు. స్టోరీకి తగ్గట్లుగా బాడీ షేప్ ను ఛేంజ్ చేస్తున్నారు. జిమ్ లో తెగ కష్టపడుతున్నారు. కండలు తిరిగిన బాడీతో, చెమటలు కక్కుతున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు రామ్ చరణ్. ఈ పిక్ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.

ఫొటో వైరల్

న్యూ లుక్ లో రామ్ చరణ్ (instagram-alwaysramcharan)
న్యూ లుక్ లో రామ్ చరణ్ (instagram-alwaysramcharan)

పెద్ది సినిమా కోసం లుక్ ను మార్చేందుకు కష్టపడుతున్న రామ్ చరణ్ లేటెస్ట్ ఫొటో వైరల్ గా మారింది. సోమవారం (జులై 21) ఇన్ స్టాగ్రామ్ లో రామ్ చరణ్ పోస్టు చేసిన పిక్ అదిరిపోయింది. సైడ్ లుక్ లో కండలను చూపిస్తున్నాడీ మెగా హీరో. ‘‘పెద్ది మూవీ కోసం మారే ప్రక్రియ మొదలైంది. స్వచ్ఛమైన ధైర్యం. నిజమైన ఆనందం’’ అని క్యాప్షన్ ఇచ్చారు రామ్ చరణ్. ఈ ఫొటోకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. లైక్ ల మీద లైక్ లు కొట్టేస్తున్నారు. కామెంట్లతో నింపేస్తున్నారు.

హిట్ కొట్టాలని

2018లో రంగస్థలం మూవీలో రూరల్ విలేజ్ స్టోరీలో మాస్ క్యారెక్టర్ లో కనిపించారు రామ్ చరణ్. ఇప్పుడు సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన డైరెక్షన్ లో వస్తున్న పెద్ది సినిమా కోసం మరోసారి అలాంటి అవతారమే ఎత్తనున్నారు. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ ఫిల్మ్ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ షాట్ అంటూ వచ్చిన గ్లింప్స్ అదిరిపోయింది. గ్రామంలో క్రికెట్ చుట్టూ తిరిగే కథ అని గ్లింప్స్ తో అర్థమైంది. ముఖ్యంగా అందులో రామ్ చరణ్ ఓ షాట్ కొట్టే సీన్ తెగ వైరలైంది.

పెద్ది సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ మూవీని 2026 మార్చి 27న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks