Ram Gopal Varma: 319 గ్యాంగ్‌స్ట‌ర్ల ఎన్‌కౌంట‌ర్‌.. డీ కంపెనీ కంటే డేంజ‌ర‌స్‌.. ఆర్జీవీ పోలీస్ కంపెనీ రిలీజ్ డేట్ ఇదే

Ram Gopal Varma: సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ్ అప్ కమింగ్ మూవీ ‘పోలీస్ కంపెనీ’ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయనుంది. ఈ మూవీతో ఒకప్పటి ఆర్జీవీ డైరెక్షన్ మళ్లీ కనిపిస్తుందనే అంచనాలున్నాయి.

Published on: Oct 21, 2026, 06:12:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Ram Gopal Varma: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) నుంచి మరో పవర్‌ఫుల్ క్రైమ్ డ్రామా రాబోతోంది. ముంబైకి చెందిన ప్రముఖ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ జీవిత విశేషాల ఆధారంగా వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘పోలీస్ కంపెనీ’. టాలెంటెడ్ యాక్టర్ హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించారు.

319 గ్యాంగ్‌స్ట‌ర్ల ఎన్‌కౌంట‌ర్‌.. డీ కంపెనీ కంటే డేంజ‌ర‌స్‌.. ఆర్జీవీ పోలీస్ కంపెనీ రిలీజ్ డేట్ ఇదే (x/RGVzoomin)
319 గ్యాంగ్‌స్ట‌ర్ల ఎన్‌కౌంట‌ర్‌.. డీ కంపెనీ కంటే డేంజ‌ర‌స్‌.. ఆర్జీవీ పోలీస్ కంపెనీ రిలీజ్ డేట్ ఇదే (x/RGVzoomin)

పోలీస్ కంపెనీ రిలీజ్ డేట్

చాలా రోజుల తర్వాత అదిరిపోయే కాన్సెప్ట్ తో రామ్ గోపాల్ వర్మ సినిమా రాబోతుంది. పోలీస్ స్టోరీతో మళ్లీ ఆర్జీవీ ఓ డైరెక్టర్ గా తన సత్తా ఏంటో చాటుతాడనే టాక్ వినిపిస్తోంది. ఈ పోలీస్ కంపెనీ మూవీని జూన్ 4, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఆర్జీవీ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు.

‘‘డీ కంపెనీ కంటే పోలీస్ కంపెనీ ఇంకా డేంజరస్. ఎందుకంటే, 1997 నుంచి 2004 వరకు 319 గ్యాంగ్‌స్ట‌ర్స్ ను చంపారు. వాళ్లు ప్రతి ఒక్కరినీ చంపడానికి వచ్చేస్తున్నారు. మూవీ జూన్ 4, 2027న రిలీజ్ అవుతుంది’’ అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు.

అగ్ర నిర్మాణ సంస్థలు

ఈ పోలీస్ కంపెనీ సినిమాలో హర్షవర్ధన్ రాణేతో పాటు ఫర్దీన్ ఖాన్, ఫాతిమా సనా షేక్, పరేష్ రావల్, సౌరభ్ శుక్లా, మకరంద్ దేశ్‌పాండే, అశ్విని కల్సేకర్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను గుల్షన్ కుమార్ సమర్పణలో టి-సిరీస్ ఫిలిమ్స్, ఆర్‌జివి కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

'కంపెనీ' ప్రపంచంలోకి మరోసారి

రామ్ గోపాల్ వర్మ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన క్లాసిక్ క్రైమ్ డ్రామా ‘కంపెనీ’ ప్రపంచాన్ని ఈ పోలీస్ కంపెనీ సినిమా మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేయనుంది. ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యం, దాన్ని అణచివేయడానికి పోలీసులు చేసిన వ్యూహాత్మక ఆపరేషన్ల చుట్టూ ఈ కథ నడుస్తుంది. వర్మ మార్క్ మేకింగ్‌తో ముంబై గ్యాంగ్‌స్టర్ల సామ్రాజ్యాన్ని కళ్లకు కట్టేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

యథార్థ సంఘటనల ఆధారంగా

'పోలీస్ కంపెనీ' చిత్రం పూర్తిగా నిజ జీవిత పాత్రలు, యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. నాటి ముంబై నేర సామ్రాజ్యంలో దాదాపు 300 మంది గ్యాంగ్‌స్టర్లను పోలీసులు ఏ పరిస్థితులలో ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చింది అనే ఆసక్తికరమైన అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు చిత్ర యూనిట్ ఒక ప్రకటనలో తెలిపింది. ముంబై అండర్‌వరల్డ్ హిస్టరీని ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా సరికొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More