...
...
Next Story

రామ్ పోతినేని సినిమాకు ఓటీటీ డీల్.. ఏ ప్లాట్‍ఫామ్ తీసుకుందంటే..

ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రానికి ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్ అయింది. షూటింగ్ చివరి దశలో ఉండగానే ఓటీటీ డీల్ జరిగిపోయింది. థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోకి వస్తుంది. ఈ డీల్ వివరాలు ఇవే..

Published on: Jul 15, 2025 11:11 AM IST
By
Prefer HTon Google
Advertisement

ఎనర్జిటిక్ స్టార్, యంగ్ హీరో రామ్ పోతినేనికి ఐదేళ్లుగా సరైన హిట్ లేదు. గత రెండు చిత్రాలు స్కంద, డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్ అయ్యాయి. వరుసగా చేసిన మాస్ యాక్షన్ చిత్రాలు నిరాశపరిచాయి. దీంతో మళ్లీ తన మార్క్ సినిమా చేస్తున్నారు. రామ్ ప్రస్తుతం ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో నటిస్తున్నారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ ఫేమ్ డైరెక్టర్ మహేశ్ బాబు.పి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం ఓటీటీ డీల్ చేసుకుంది.

ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఇదే

రామ్ పోతినేని సినిమాకు ఓటీటీ డీల్.. ఏ ప్లాట్‍ఫామ్ తీసుకుందంటే..
రామ్ పోతినేని సినిమాకు ఓటీటీ డీల్.. ఏ ప్లాట్‍ఫామ్ తీసుకుందంటే..

ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా ఓటీటీ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ తీసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ తుది దశలో ఉంది. మరికొన్ని రోజుల్లో చిత్రీకరణ పూర్తవుతుంది. ఈ తరుణంలో ఓటీటీ డీల్ జరిగింది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుంది.

వరుస ప్లాఫ్‍లు ఉన్నా..

ప్రస్తుతం చాలా సినిమాలకు ఓటీటీ డీల్స్ జరగడం కష్టంగా మారుతోంది. జాప్యం జరుగుతోంది. అలాంటిది వరుసగా ప్లాఫ్‍లు ఎదురైనా.. రామ్ నటిస్తున్న ఆంధ్రా కింగ్ తాలూకా మూవీకి మాత్రం షూటింగ్ పూర్తయ్యేందుకు ముందే ఓటీటీ ఒప్పందం జరిగింది. మంచి ధరకే నెట్ఫ్లిక్స్దక్కించుకున్నట్టు తెలుస్తోంది.

ఫస్ట్ పాటకు డేట్ ఖరారు

ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం నుంచి మొదటి పాట వచ్చేస్తోంది. జూలై 18వ తేదీన ఈ మూవీ నుంచి సాంగ్ రిలీజ్ కానుంది. ఇది మెలోడియస్‍గా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి వివేక్ - మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.

ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రంలో ఓ హీరోకు అభిమాని పాత్రలో రామ్నటిస్తున్నారు. బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ అనే ట్యాగ్‍లైన్‍తో ఈ చిత్రం వస్తోంది. ఈ సినిమాను డిఫరెంట్ బ్యాక్‍డ్రాప్‍లో దర్శకుడు మహేశ్ బాబు తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. స్టైలిష్ లుక్‍తో రామ్ కనిపిస్తున్నారు. ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe