రామ్ పోతినేని సినిమాకు ఓటీటీ డీల్.. ఏ ప్లాట్‍ఫామ్ తీసుకుందంటే..
ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రానికి ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్ అయింది. షూటింగ్ చివరి దశలో ఉండగానే ఓటీటీ డీల్ జరిగిపోయింది. థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోకి వస్తుంది. ఈ డీల్ వివరాలు ఇవే..
ఎనర్జిటిక్ స్టార్, యంగ్ హీరో రామ్ పోతినేనికి ఐదేళ్లుగా సరైన హిట్ లేదు. గత రెండు చిత్రాలు స్కంద, డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్ అయ్యాయి. వరుసగా చేసిన మాస్ యాక్షన్ చిత్రాలు నిరాశపరిచాయి. దీంతో మళ్లీ తన మార్క్ సినిమా చేస్తున్నారు. రామ్ ప్రస్తుతం ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో నటిస్తున్నారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ ఫేమ్ డైరెక్టర్ మహేశ్ బాబు.పి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం ఓటీటీ డీల్ చేసుకుంది.

ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఇదే
ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా ఓటీటీ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ తీసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ తుది దశలో ఉంది. మరికొన్ని రోజుల్లో చిత్రీకరణ పూర్తవుతుంది. ఈ తరుణంలో ఓటీటీ డీల్ జరిగింది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుంది.
వరుస ప్లాఫ్‍లు ఉన్నా..
ప్రస్తుతం చాలా సినిమాలకు ఓటీటీ డీల్స్ జరగడం కష్టంగా మారుతోంది. జాప్యం జరుగుతోంది. అలాంటిది వరుసగా ప్లాఫ్‍లు ఎదురైనా.. రామ్ నటిస్తున్న ఆంధ్రా కింగ్ తాలూకా మూవీకి మాత్రం షూటింగ్ పూర్తయ్యేందుకు ముందే ఓటీటీ ఒప్పందం జరిగింది. మంచి ధరకే నెట్ఫ్లిక్స్దక్కించుకున్నట్టు తెలుస్తోంది.
ఫస్ట్ పాటకు డేట్ ఖరారు
ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం నుంచి మొదటి పాట వచ్చేస్తోంది. జూలై 18వ తేదీన ఈ మూవీ నుంచి సాంగ్ రిలీజ్ కానుంది. ఇది మెలోడియస్‍గా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి వివేక్ - మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.
ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రంలో ఓ హీరోకు అభిమాని పాత్రలో రామ్నటిస్తున్నారు. బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ అనే ట్యాగ్‍లైన్‍తో ఈ చిత్రం వస్తోంది. ఈ సినిమాను డిఫరెంట్ బ్యాక్‍డ్రాప్‍లో దర్శకుడు మహేశ్ బాబు తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. స్టైలిష్ లుక్‍తో రామ్ కనిపిస్తున్నారు. ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాలో రామ్‍కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా ఓ కీలకపాత్ర చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేస్తున్నారు. త్వరలోనే ఈ షూటింగ్ పూర్తికానుంది. సినిమా విడుదల తేదీ ఖరారు కావాల్సి ఉంది.














