ఆ మూవీ బడ్జెట్ రూ.4 వేల కోట్లు.. ఇండియాలోనే హైయ్యస్ట్.. రెండు పార్ట్ లుగా సినిమా.. ఎపిక్ కథతో బిగ్గెస్ట్ ఫిల్మ్

రెండు పార్ట్ లుగా తెరకెక్కున్న ఇండియన్ ఎపిక్ మూవీ బడ్జెట్ అక్షరాల నాలుగు వేల కోట్ల రూపాయాలు. అవును.. ఇదే నిజం. ఇండియాలోనే హైయ్యస్ట్ బడ్జెట్ తో సిద్ధమవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. 

Published on: Jul 15, 2025, 12:47:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అవతార్ కంటే ఎంతో ఎక్కువ

రామాయణ సినిమా బడ్జెట్అవతార్ పార్ట్ 1 కంటే ఎంతో ఎక్కువ. అవతార్ సినిమా కోసం కేవలం రూ.23.7 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. రామాయణ సినిమా కోసం ఏకంగా రూ.4 వేల కోట్లు స్పెండ్ చేస్తున్నారు. ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇదే. ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రెడీ అవుతున్న ఎస్ఎస్ఎంబీ 29 మూవీ బడ్జెట్ రూ.1000 కోట్లు.

రూ.4 వేల కోట్ల బడ్జెట్ తో సినిమా (x/The Ramayana)
రూ.4 వేల కోట్ల బడ్జెట్ తో సినిమా (x/The Ramayana)

వేర్వేరు భాషల్లో

నితేశ్ తివారీ డైరెక్షన్ లో రెడీ అవుతున్న రామాయణ సినిమాను ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇంగ్లీష్, జపనీస్, మాండరీన్, స్పానిష్ తదితర భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేయనుంది.

రామాయణ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. ఈ సినిమా పార్ట్ 1ను 2026 దీపావళికి, పార్ట్ 2ను 2027 దీపావళికి రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే పార్ట్ 1 సినిమా షూటింగ్ కంప్లీటైంది. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ లో విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయి.

బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్థాయి మాత్రమే కాదు ఏకంగా ఇండియన్ మూవీ రేంజ్ పెరిగిపోయింది. భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించేందుకు ప్రోడ్యూసర్లు ఏ మాత్రం వెనుకాడటం లేదు. అలవోకగా రూ.1000 కోట్ల వరకూ పెడుతున్నారు. కానీ ఈ ఎపిక్ సినిమా కోసం ఏకంగా రూ.4000 కోట్లు ఖర్చు చేస్తున్నారనే విషయం మతి పోగొట్టేదే. ఆ మూవీ.. ‘రామాయణ’. ఎపిక్ కథను సినిమాగా తీసుకురావడం కోసం రామాయణ మూవీ రెండు పార్టులపై ప్రొడ్యూసర్లు పెడుతున్న ఖర్చు ఏకంగా రూ.4 వేల కోట్లు.

బడ్జెట్ నిజమే

రామాయణసినిమా కోసం నిర్మాతలు ఏకంగా రూ.4 వేల కోట్ల బడ్జెట్ వెచ్చిస్తున్నారు. ఇది అబద్దం కాదు.. పచ్చి నిజం. ఈ విషయాన్ని ఆ మూవీ నిర్మాతల్లో ఒకరైన నమిత్ మల్హోత్రా ప్రకటించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామాయణ సినిమా బడ్జెట్ వివరాలు వెల్లడించారు.

‘‘పార్ట్ 1, 2 కలిపి మేం కంప్లీట్ చేసే సమయానికి బడ్జెట్ 500 మిలియన్ల అమెరికా డాలర్లకు చేరుకుంటుంది. అంటే సుమారు రూ.4 వేల కోట్లు. గ్రేటెస్ట్ స్టోరీతో ప్రపంచంలోనే లార్జెస్ట్ సినిమా చేస్తున్నాం. ఈ ఎపిక్ కథను ప్రపంచం చూడాలి. అయితే ఇప్పటికీ కొన్ని హాలీవుడ్ సినిమాల బడ్జెట్ కంటే ఇది తక్కువే. తక్కువ ఖర్చుతోనే పెద్ద సినిమా తీస్తున్నామని అనుకుంటున్నా. ఇది డబ్బుకు సంబంధించిన విషయం కాదు’’ అని నమిత్ పేర్కొన్నారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More