రానా నాయుడు 2 ట్రైలర్.. నాగా, రానా ఈజ్ బ్యాక్.. ఈసారి అదిరిపోయిన యాక్షన్

రానా నాయుడు సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది. బాబాయ్, అబ్బాయ్‌లు వెంకటేశ్, రానా మరో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వచ్చే వారం నెట్‌ఫ్లిక్స్ ‌లో స్ట్రీమింగ్ కానుండగా.. మంగళవారం (జూన్ 3) ట్రైలర్ రిలీజ్ చేశారు.

Published on: Jun 3, 2025, 13:15:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నెట్‌ఫ్లిక్స్‌లో రెండేళ్ల కిందట వచ్చిన వెబ్ సిరీస్ రానా నాయుడు. వెంకటేశ్, రానాలాంటి తెలుగు హీరోలు నటించిన ఈ సిరీస్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. బూతు డైలాగులు, మితిమీరిన శృంగార సీన్లతో షాక్‌కు గురి చేసింది. నిజ జీవితంలో బాబాయ్ అబ్బాయ్ అయిన వెంకీ, రానా తండ్రీకొడుకులుగా నటించిన ఈ రానా నాయుడు సీజన్ 2 ట్రైలర్ మంగళవారం (జూన్ 3) రిలీజైంది.

రానా నాయుడు 2 ట్రైలర్.. నాగా, రానా ఈజ్ బ్యాక్.. ఈసారి అదిరిపోయిన యాక్షన్
రానా నాయుడు 2 ట్రైలర్.. నాగా, రానా ఈజ్ బ్యాక్.. ఈసారి అదిరిపోయిన యాక్షన్

రానా నాయుడు సీజన్ 2 ట్రైలర్

రానా నాయుడు సీజన్ 2 జూన్ 13 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ట్రైలర్ రిలీజ్ చేశారు. తొలి సీజన్ కు మించి యాక్షన్ తో ఈ కొత్త సీజన్ రానున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇందులోనూ తండ్రీకొడుకులైన నాగా నాయుడు, రానా నాయుడు ముఖాముఖి తలపడబోతున్నారు. ఈ సీజన్ కూడా ఫుల్ యాక్షన్ ఉండబోతున్నట్లు ట్రైలర్ తోనే మేకర్స్ చెప్పారు.

కరణ్ అన్షుమన్, సుపర్ణ్ వర్మ, అభయ్ చోప్రా ఈ సిరీస్ ను డైరెక్ట్ చేశారు. ఇక రెండో సీజన్లో వెంకటేశ్, రానాతోపాటు అర్జున్ రాంపాల్, డీనో మోరియా, సుర్వీన్ చావ్లా, అభిషేక్ బెనర్జీ, కృతి కర్బందాలాంటి వాళ్లు నటించారు. జూన్ 13 నుంచి హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

రానా నాయుడు సీజన్ 1లో ఏం జరిగిందంటే?

రానా నాయుడు తొలి సీజన్ మార్చి, 2023లో వచ్చింది. బోల్డ్ కంటెంట్ ఉండటంతో కాస్త విమర్శలు కూడా ఎక్కువగానే వచ్చాయి. దీంతో రెండో సీజన్లో అలాంటి కంటెంట్ ఉండబోదని వెంకటేశ్కూడా హామీ ఇచ్చాడు. యాక్ష‌న్ అంశాల‌కు ఫ్యామిలీ ఎమోష‌న్స్ మేళ‌వించి తొలి సీజన్ రూపొందించారు. కంప్లీట్ మోడ్ర‌న్ సెట‌ప్‌లో క‌థ సాగుతుంది. అందుకు త‌గిన‌ట్లుగానే ఎక్కువ‌గా మ‌సాలా సీన్స్‌, డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్‌క‌నిపిస్తాయి.

తండ్రిని ద్వేషించే ఓ కొడుకు, అత‌డికి గుణ‌పాఠం చెప్పాల‌ని ప్ర‌య‌త్నించే తండ్రి సింపుల్‌గా ఈ రెండు క్యారెక్ట‌ర్స్ చూట్టే ఈ క‌థ సాగుతుంది. ఈ రెండు పాత్ర‌ల‌తో మిగిలిన క్యారెక్ట‌ర్స్‌ను లింక్ చేస్తూ ప‌ది ఎపిసోడ్స్‌తో ఈ సిరీస్‌ను తెర‌కెక్కించారు ద‌ర్శ‌క‌ద్వ‌యం క‌ర‌ణ్ అన్షుమ‌న్‌, సుపర్ణ్ వ‌ర్మ‌.

ఫ‌స్ట్ ఎపిసోడ్‌తోనే..

బాలీవుడ్ సెల‌బ్రిటీల‌కు వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే వ్య‌క్తిగా రానా పాత్ర ఎంట్రీ ఇచ్చే సీన్‌తోనే సిరీస్‌పై ఆస‌క్తిని రేకెత్తించారు ద‌ర్శ‌కులు. ఆ త‌ర్వాత జైలు నుంచి నాగ‌నాయుడు రిలీజ్ రిలీజ్ కావ‌డం, త‌న కొడుకుల‌ను క‌లుసుకునే సీన్స్‌తో ఫ‌స్ట్ ఎపిసోడ్ సాగుతుంది. ఈ ఎపిసోడ్ చివ‌ర‌లో వెంక‌టేష్‌, రానా ఎదురుప‌డే స‌న్నివేశం నుంచి అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది.

కొడుకు రానానే త‌న‌ను జైలు పాలు చేశాడ‌ని గ్ర‌హించిన నాగ అత‌డిని ఎదుర్కోన‌డానికి వేసే ఎత్తులు, తండ్రి వేసే స‌వాళ్ల‌ను చిత్తుచేస్తూనే సెల‌బ్రిటీ స‌మ‌స్య‌ల‌ను రానానాయుడు ఎలా చ‌క్క‌దిద్దాడ‌నే అంశాల చుట్టూ చివ‌రి వ‌ర‌కు సిరీస్ సాగుతుంది.

తండ్రి నాగ‌ను కొడుకు రానా నాయుడు ఎందుకు ద్వేషిస్తున్నాడో చివ‌రి ఎపిసోడ్‌లో చూపించారు. ఆ త‌ర్వాత కొడుకుకు ఎదుర‌య్యే స‌మ‌స్య‌ను నాగ ప‌రిష్క‌రించే సీన్‌తో సిరీస్‌ను ఎండ్ చేశారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More