యూట్యూబ్‌లో రిలీజైన‌ ర‌ష్మి గౌత‌మ్ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ - ఫ్రీ స్ట్రీమింగ్ - ఊహించ‌ని మ‌లుపుల‌తో

ర‌ష్మి గౌత‌మ్ హీరోయిన్‌గా న‌టించిన బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ యూట్యూబ్‌లో రిలీజైంది. ఫ్రీ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వ‌చ్చింది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో నందు హీరోగా న‌టించాడు.

Published on: May 27, 2025, 09:56:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

యాంక‌ర్ ర‌ష్మి గౌత‌మ్ హీరోయిన్‌గా న‌టించిన తెలుగు మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్ యూట్యూబ్‌లో రిలీజైంది. ఫ్రీ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వ‌చ్చింది. థియేట‌ర్ల‌లో రిలీజైన మూడేళ్ల త‌ర్వాత ఈ మూవీ యూట్యూబ్‌లో రిలీజ్ కావ‌డం గ‌మ‌నార్హం.

ర‌ష్మి గౌత‌మ్
ర‌ష్మి గౌత‌మ్

వెరైటీ ప్ర‌మోష‌న్స్‌...

నందు హీరోగా న‌టించిన ఈ మూవీకి రాజ్ విరాట్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 2022లో ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీలో కిరీటి దామ‌రాజు, ర‌ఘు కుంచే కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

ప్ర‌శాంత్ విహారి మ్యూజిక్ అందించాడు. ర‌ష్మి గౌత‌మ్‌కు బుల్లితెర‌పై ఉన్న క్రేజ్‌తో పాటు వెరైటీ ప్ర‌మోష‌న్స్‌తో ఈ చిన్న సినిమా ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ క‌లిగించింది. పాయింట్ కొత్త‌గా ఉన్న దానిని ఆస‌క్తిక‌రంగా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డ‌టంతో బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది.

పోతురాజు క‌థ‌...

పోతురాజు ఓ మ‌త్య్స‌కారుడు. చేప‌లు ప‌ట్టుకుంతూ బ‌తికే అత‌డు పూరి జ‌గ‌న్నాథ్‌కు వీరాభిమాని. ఎప్ప‌టికైనా పూరి జగన్నాథ్కు ఓ క‌థ చెప్పి సినిమా తీయాల‌ని క‌ల‌లు కంటుంటాడు. త‌మ ఊరికే చెందిన వాణిని ఇష్ట‌ప‌డ‌తాడు. ఎవ‌రైనా గొడ‌వ‌లు ప‌డుతుంటే చూసి ఆనంద‌ప‌డ‌టం వాణికి ఓ స‌ర‌దా. ఆమె కోస‌మే ఊరి వాళ్ల అంద‌రితో గొడ‌వ‌లు ప‌డుతుంటాడు పోతురాజు.

వాణిని ప్రేమ‌లో ప‌డేస్తాడు. పోతురాజు తండ్రి హ‌త్య‌కు గుర‌వుతాడు. తండ్రి మ‌ర్డ‌ర్ గురించి పోతురాజుకు ఓ షాకింగ్ నిజం తెలుస్తుంది? అదేమిటి? పూరి జ‌గ‌న్నాథ్ అభిమాని అయిన పోతురాజు, వాణిని ప్రేమించిన పోతురాజు ఒక్క‌రేనా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

హోస్ట్‌గా...

ప్ర‌స్తుతం జబర్ధస్థ్తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ జోడీ షోస్‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది ర‌ష్మి. బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో పాటు అంత‌కుమించి, అంతం, గుంటూర్ టాకీస్‌తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో హీరోయిన్గా న‌టించింది. 2023లో రిలీజైన బాయ్స్ హాస్ట్‌లో గెస్ట్ రోల్‌లో క‌నిపించింది. ఈ సినిమా త‌ర్వాత ర‌ష్మి మ‌ళ్లీ సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించ‌లేదు.

హీరోగా...క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా...

నందు హీరోగానే కాకుండా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా సుదీర్ఘ కాలంగా సినిమాలు చేస్తున్నాడు. కానీ స‌రైన హిట్టు మాత్రం ద‌క్క‌డం లేదు. స‌వారి, ఎందుకో ఏమో, ఇంత‌లో ఎన్నెన్ని వింతలోతో పాటు ప‌లు చిన్న సినిమాల్లో హీరోగా నందు క‌నిపించాడు. ప్ర‌స‌న్న‌వ‌ద‌నం, పెళ్లిచూపులు, జ‌య‌జాన‌కి నాయ‌క‌తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో డిఫ‌రెంట్ రోల్స్ చేశాడు. మాన్ష‌న్ 24, వ‌ధువు వెబ్‌సిరీస్‌ల‌లో న‌టించాడు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More