Rashmika Mandanna: నరం కట్ అయి ఊడి వచ్చింది.. భరించలేనంత నొప్పేమీ లేదు.. బరువు పెరగాలనుకుంటున్నా : గాయంపై రష్మిక మందన్న

Rashmika Mandanna: రష్మిక మందన్న తనకు అయిన గాయంపై స్పందించింది. మైసా మూవీ షూటింగ్ సందర్భంగా తాను గాయపడ్డానని, భరించలేనంత నొప్పేమీ లేదని చెప్పింది. అనుకోకుండా వచ్చిన ఈ హాలిడేస్ లో కాస్త బరువు పెరగడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పడం విశేషం.

Published on: Aug 3, 2026, 20:18:11 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తీవ్ర గాయంతో ఆసుపత్రి పాలైనట్లు వస్తున్న వార్తలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేసింది. తన అప్‌కమింగ్ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీ 'మైసా' (Mysaa) డాన్స్ షూటింగ్‌లో రైట్ హిప్ (కుడి తొడ) దగ్గర ఒక నరం తెగిపోయినట్లు సంచలన విషయాలు వెల్లడించింది. కొద్దిరోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న రష్మిక.. తన హెల్త్ కండిషన్‌పై అభిమానుల్లో ఉన్న ఆందోళనకు తెరదించుతూ సుదీర్ఘమైన నోట్ షేర్ చేసింది.

Rashmika Mandanna: ఇది వరుసగా మూడో గాయం.. బరువు పెరగాలనుకుంటున్నా.. భరించలేనంత నొప్పేమీ లేదు: గాయంపై రష్మిక మందన్న
Rashmika Mandanna: ఇది వరుసగా మూడో గాయం.. బరువు పెరగాలనుకుంటున్నా.. భరించలేనంత నొప్పేమీ లేదు: గాయంపై రష్మిక మందన్న

"రైట్ హిప్‌లో నరం తెగిపోయింది!".. రష్మిక

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన రికవరీకి సంబంధించిన క్యూట్ ఫొటోలు, పజిల్స్ సాల్వ్ చేస్తున్న పిక్స్, పెట్ డాగ్స్‌తో ఉన్న పిక్చర్స్ షేర్ చేస్తూ రష్మిక ఓ సుదీర్ఘ పోస్ట్ చేసింది.

"గాయపడటం నిజంగా దారుణమైన ఎక్స్‌పీరియన్స్. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని అనుకున్నా.. కానీ నిజం దాచలేం కదా! నా కుడి తొడ భాగంలో కాలును తొడతో కలిపే నాలుగు ప్రధాన నరాల్లో ఒక నరం తెగిపోయి ఊడి వచ్చింది. అది మళ్లీ అతుక్కోవడానికి కాస్త టైమ్ పడుతుంది" అని పేర్కొంది.

ఇది తనకు వరుసగా మూడో గాయమని, ఇకపై తన శరీరాన్ని ఒక మిషన్‌లా కాకుండా మనిషిలా చూసుకోవడం నేర్చుకోవాలని రాసుకొచ్చింది.

“దేవుడు ఇచ్చిన బలవంతపు హాలిడే!”

ఈ నొప్పి భరించలేనిదేమీ కాదని, నాన్-స్టాప్ వర్క్ నుంచి కాస్త బ్రేక్ ఇవ్వడానికే దేవుడు ఇలా 'బలవంతపు హాలిడే' ఇచ్చాడని పాజిటివ్‌గా స్పందించింది రష్మిక. ఈ టైమ్‌లో జిమ్‌లో హెవీ వర్కవుట్స్ చేయడం, రన్నింగ్ చేయడం కుదరదని, అందుకే ఇంట్లోనే పజిల్స్ సాల్వ్ చేస్తూ సమయం గడుపుతున్నానని చెప్పింది.

వర్కవుట్స్ లేకపోవడంతో స్వీట్స్, డెసర్ట్స్ ఎక్కువగా తింటూ 'డెసర్ట్ మాన్స్టర్'గా మారిపోతున్నానని నవ్వుతూ కామెంట్ చేసింది.

'మైసా'లో యాక్షన్.. అండర్ వాటర్ స్టంట్స్

ఈ గాయం రష్మిక నటిస్తున్న పవర్ ప్యాక్డ్ యాక్షన్ డ్రామా 'మైసా' డాన్స్ షూట్‌లో జరిగింది. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. గిరిజన ప్రాంతాల నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌లో రష్మిక కెరీర్‌లోనే మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ అండ్ రోల్ చేస్తోంది.

ఇటీవలే ఈ సినిమా కోసం భారత్‌లోనే తొలిసారిగా ఒక హీరోయిన్ పై చిత్రీకరించిన భారీ 'అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్' షూట్ పూర్తి చేశారు. గతంలో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రష్మిక రక్తంతో తడిసి, ఆయుధం చేతిలో పట్టుకుని గట్టిగా అరుస్తున్న విజువల్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి.

'కాక్‌టెయిల్ 2' బిగ్ హిట్.. గ్లోబల్ వైడ్‌గా రూ.140 కోట్ల వసూళ్లు

ఇటీవలే రష్మిక బాలీవుడ్‌లో షాహిద్ కపూర్, కృతి సనన్‌లతో కలిసి నటించిన రోమాంటిక్ డ్రామా 'కాక్‌టెయిల్ 2' (Cocktail 2) బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. హోమి అదజానియా డైరెక్ట్ చేసిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా రూ. 140 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

ఒకవైపు 'పుష్ప 2' లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న రష్మిక, త్వరలోనే కోలుకుని 'మైసా' టీజర్‌తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా 2026 ద్వితీయార్థంలో థియేటర్లలోకి రానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More