Rashmika Mandanna: విజయ్ చేతిలో చేయి వేసి.. చాలా రోజుల తర్వాత రష్మిక ఇలా కెమెరా ముందుకు..

Rashmika Mandanna: రష్మిక మందన్న తన హిప్ ఇంజురీ తర్వాత తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు. ఓ రిసెప్షన్ వేడుకలో భర్త విజయ్ దేవరకొండతో కలిసి ఆమె చేతిలో చేయి వేసి వచ్చారు. అయితే ఆమె గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని ఈ వీడియోలు చూస్తే స్పష్టమవుతోంది.

Published on: Aug 24, 2026, 13:38:49 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Rashmika Mandanna: షూటింగ్ లో తీవ్రంగా గాయపడిన 'నేషనల్ క్రష్' రష్మిక మందన్న చాలా రోజుల తర్వాత మొదటిసారి బయటకు వచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రముఖ రాజకీయ నాయకుడు, నిర్మాత సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి కుమారుడి ఎంగేజ్‌మెంట్ వేడుకలో విజయ్ దేవరకొండ పక్కనే రష్మిక మెరిశారు. నడవడానికి ఇబ్బంది పడుతున్న రష్మిక చేయి పట్టుకుని విజయ్ దేవరకొండ వేడుకలోకి తీసుకెళ్లిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

Rashmika Mandanna: విజయ్ చేతిలో చేయి వేసి.. చాలా రోజుల తర్వాత రష్మిక ఇలా కెమెరా ముందుకు..
Rashmika Mandanna: విజయ్ చేతిలో చేయి వేసి.. చాలా రోజుల తర్వాత రష్మిక ఇలా కెమెరా ముందుకు..

బ్లాక్ ఔట్‌ఫిట్‌లో 'విరోష్' మ్యాజిక్

రాజకీయ నేత, లాయర్, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి తనయుడు సాహిల్ రెడ్డి నిశ్చితార్థ వేడుకకు టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న బ్లాక్ కలర్ మ్యాచింగ్ డ్రెస్‌లలో జంటగా రావడం విశేషం. రష్మిక బ్లాక్ అండ్ గోల్డ్ అనార్కలీ విత్ దుపట్టాలో ఎంతో క్యూట్‌గా కనిపించగా, విజయ్ దేవరకొండ బ్లాక్ బంద్ గాలా సూట్‌లో రాయల్ లుక్‌లో దర్శనమిచ్చారు.

వేదిక వద్దకు చేరుకున్న సమయంలో రష్మిక చేయిని విజయ్ చాలా జాగ్రత్తగా పట్టుకుని నడిపించారు. విజయ్ ఏదో జోక్ వేయగా రష్మిక నవ్వుతూ కనిపించిన వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విరోష్ చాలా రోజుల తర్వాత ఇలా పబ్లిగ్గా అనే క్యాప్షన్ తో ఈ వీడియోలను వైరల్ చేస్తున్నారు.

అసలు రష్మికకు ఏమైంది? 'మైసా' షూటింగ్‌లో దెబ్బ

ఇటీవల 'మైసా' (Mysaa) సినిమా షూటింగ్ లో తీవ్రమైన యాక్షన్ సీన్ షూట్ చేస్తున్న సమయంలో రష్మిక కుడి తొడ ఎముక దగ్గర చీలిక (Hip Tendon) ఏర్పడింది. ఈ విషయాన్ని ఆగస్టు మొదట్లోనే రష్మిక స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. వరుసగా మూడోసారి గాయపడటంతో తన శరీరాన్ని ఒక మెషిన్‌లా కాకుండా మనిషిలా చూసుకోవడం నేర్చుకోవాలని పోస్ట్ చేశారు.

'మైసా' తన కెరీర్‌లోనే అత్యంత ఇంటెన్స్, అగ్రెసివ్ ఫిల్మ్ అని, డాక్టర్లు ఫోర్స్‌డ్ హాలిడే ఇచ్చి బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారని ఆమె పేర్కొన్నారు. నిరంతరం షూటింగ్స్, ప్రమోషన్స్ అంటూ గడిపే తనకు ఈ గ్యాప్ కాస్త ఇబ్బందిగానే అనిపించినా, కోలుకోవడానికి ఈ రెస్ట్ తప్పనిసరి అయిందని చెప్పారు.

అభిమానుల ఆందోళన.. ఇంకా కాస్త కుంటుతూనే..

ఎంగేజ్‌మెంట్ ఈవెంట్‌లో రష్మికను చూసిన ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే వీడియోను నిశితంగా గమనించిన కొందరు నెటిజన్లు రష్మిక ఇంకా పూర్తిగా కోలుకోలేదని, నడిచేటప్పుడు కాస్త కుంటుతున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.

"రష్మిక చాలా ఫిట్‌గా, గ్లోయింగ్‌గా కనిపిస్తోంది కానీ, నడిచేటప్పుడు ఇంకా కొద్దిగా ఇబ్బంది పడుతోంది. పూర్తిగా రికవర్ అవ్వడానికి మరో రెండు మూడు వారాలు టైమ్ పడుతుంది" అని ఎక్స్ వేదికగా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఆమె భర్త విజయ్ దేవరకొండ పక్కనే ఉండి ఆమెను జాగ్రత్తగా చూసుకోవడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

క్యూలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్‌లు

రష్మిక ఇటీవల బాలీవుడ్ మల్టీస్టారర్ 'కాక్‌టెయిల్ 2' (Cocktail 2) తో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆమె చేతిలో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ 'మైసా'తో పాటు 'రణబాలి' (Ranabaali) సినిమాలు ఉన్నాయి. రణబాలిలో భర్త విజయ్ తోనే ఆమె నటిస్తోంది. ఇక యాక్షన్ ఓరియెంటెడ్ కథతో తెరకెక్కుతున్న మైసా కోసం రష్మిక చాలా కష్టపడ్డారు. ఆ క్రమంలోనే ఆమె గాయపడగా.. త్వరలోనే కోలుకొని మళ్లీ షూటింగ్ లో పాల్గొననున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More