మళ్లీ దుబాయ్ శీను లాంటి ఫన్ చూడబోతున్నారు, ఆయన ఆస్ట్రేలియన్ క్రికెటర్‌లాగా కనిపిస్తారు.. హీరో రవితేజ కామెంట్స్
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్‌గా చేసిన ఈ సినిమా జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రవితేజ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా భర్తమహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమాలో రవితేజకు జోడీగా డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ ఇద్దరు హీరోయిన్స్ నటించారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు.

జనవరి 13న సంక్రాంతి కానుకగా
సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం జనవరి 13న సంక్రాంతి కానుకగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ భర్త మహాశయులక విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో రవితేజ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.
దాదాపు అన్నీ హిట్ అయ్యాయి
మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, నేను కలిసి 13 సినిమాలు చేశాం. మా సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యాయి. ఈ సినిమాలో మా హీరోయిన్స్ చాలా అందంగా కనిపిస్తారు. నన్ను కూడా చాలా అందంగా చూపించాడు డీవోపీ ప్రసాద్ మూరెళ్ల. తనతో తొమ్మిది సినిమాలు చేశాను" అని అన్నారు.
ఎక్కువ మాట్లాడరు
"కొరియోగ్రాఫర్స్ శేఖర్, భాను కంపోజ్ చేసిన పాటలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఫైట్ మాస్టర్ పృథ్వీ ఇందులో ఎంటర్‌టైనింగ్‌గా ఉండే ఫైట్లు కంపోజ్ చేశారు. ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఎక్కువ మాట్లాడరు. ఆస్ట్రేలియన్ క్రికెటర్‌లాగా కనిపిస్తారు. సినిమాని చాలా పాషన్‌తో చేశారు" అని రవితేజ తెలిపారు.
నెక్ట్స్ శివతో చేస్తున్నా
"ఇందులో సునీల్‌తో మళ్లీ దుబాయ్ శీను లాంటి ఫన్ చూడబోతున్నారు. సత్య, కిషోర్, మురళీధర్ గారు, గెటప్ శీను, సోని అందరు కూడా అద్భుతంగా చేశారు. వీళ్లతో కలిసి చాలా ఎంజాయ్ చేశాను. అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, బాబి, కిషోర్.. వీరి డైరెక్షన్‌లో నేను విపరీతంగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాను. నెక్ట్స్ శివ నిర్వాణతో చేస్తున్నాను. ఆ సినిమా గురించి తర్వాత మాట్లాడదాం" అని రవితేజ అన్నారు.
డైరెక్టర్ డ్యాన్స్ ఇరగదీసారు
"బీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సక్సెస్ మీట్‌లో తన గురించి మాట్లాడుతాను. మ్యూజిక్ ఇరగదీసాడు. హీరోయిన్స్ చాలా బ్రహ్మాండంగా నటించారు. మీరు అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. మా డైరెక్టర్ కిషోర్ తిరుమల ప్రమోషన్స్‌లో డాన్స్ ఇరగదీసారు" అని రవితేజ పేర్కొన్నారు.
పవన్ టైటిల్ ఇచ్చాడు
"ఈ సినిమాకి టైటిల్ మా పవన్ ఇచ్చాడు. డైరెక్టర్ కిషోర్ ఈ సినిమాతో చాలా అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ చేశారు. ఈ సినిమా ఫుల్ ఫన్‌గా ఉంటుంది. జనవరి 13న భర్త మహాశయులకు విజ్ఞప్తి థియేటర్స్‌లో కలుద్దాం" అని రవితేజ చెప్పుకొచ్చాడు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


