ORR Road Accident : హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై ఘోర ప్రమాదం - యువ హీరో భరత్ కాంత్, సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ దుర్మరణం
ORR Road accident Hyderabad : ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో యువ హీరో భరత్ కాంత్, సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ అక్కడికక్కడే మృతి చెందారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా వీరి కారును కంటైనర్ ఢీకొట్టింది.
హైదరాబాద్ నగరం శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం బొంగులూరు గేట్ సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో యువ హీరో భరత్ కాంత్, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ మృతి చెందారు. ఈ ప్రమాదం టాలీవుడ్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది.

బలంగా ఢీకొట్టిన కంటైనర్….
ప్రాథమిక వివరాల ప్రకారం.. హీరో భరత్ కాంత్, సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ కలిసి వ్యక్తిగత పని నిమిత్తం నెల్లూరు వెళ్లారు. పని ముగించుకుని తిరిగి హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు. వీరి కారు బొంగులూరు గేట్ సమీపంలోకి రాగానే, వేగంగా వచ్చిన ఒక కంటైనర్ వీరి వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే…. కారు నుజ్జునుజ్జు అయిపోయింది. కారులో ఉన్న భరత్ కాంత్, త్రిలోక్ ఇద్దరూ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతి చెందిన భరత్ కాంత్ ఇటీవలే విడుదలైన 'టాలెంట్' అనే సినిమా ద్వారా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం వెండితెరపైనే కాకుండా, పలు తెలుగు, హిందీ వెబ్ సిరీస్‌లలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. మరోవైపు…. త్రిలోక్ టాలీవుడ్‌లో పలు సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఎదుగుతున్న దశలోనే ఇద్దరు యువ కళాకారులు ఇలా అకాల మరణం చెందడం సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
ప్రమాద సమాచారం అందిన వెంటనే ఆదిభట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కంటైనర్ డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న కంటైనర్ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై అర్ధరాత్రి వేళల్లో భారీ వాహనాల వేగం ప్రాణాంతకంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

