ఓటీటీలో అరుదైన స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకున్న తెలుగు యాక్షన్ కామెడీ మూవీ.. థియేటర్లలో డిజాస్టర్ అయినా..
థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిన తెలుగు కామెడీ మూవీ ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోంది. తాజాగా మరో స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకుంది. నితిన్, శ్రీలీల నటించిన రాబిన్‌హుడ్.. డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై సత్తా చాటుతోంది.
ఈ మధ్య బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన సినిమాలు కూడా ఓటీటీలో ప్రేక్షకుల ఆదరణ సంపాదిస్తున్నాయి. తాజాగా నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్‌హుడ్ మూవీ కూడా ఓటీటీలో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా దారుణంగా బోల్తా పడింది. అయితే జీ5 ఓటీటీలోకి అడుగుపెట్టినప్పటి నుంచీ వరుసగా స్ట్రీమింగ్ మినట్స్ రికార్డులను తిరగరాస్తూ వెళ్తోంది.

రాబిన్హుడ్ ఓటీటీ స్ట్రీమింగ్
నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో వచ్చిన సినిమా రాబిన్హుడ్. భారీ అంచనాల మధ్య థియేటర్లలో రిలీజైనా.. అక్కడ పెద్దగా రెస్పాన్స్ రాలేదు. చివరికి ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ కూడా ఈ సినిమాను కాపాడలేకపోయింది.
అయితే ఈ యాక్షన్ కామెడీ మూవీ జీ5 ఓటీటీలోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమా 300 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకుంది. నిజానికి ఇది అరుదైన రికార్డే. ఓటీటీలోకి వచ్చిన అన్ని సినిమాలు ఈ స్థాయి స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకోలేవు.
రాబిన్‌హుడ్ మూవీ గురించి..
నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్‌హుడ్ మూవీ మార్చి 28న థియేటర్లలో రిలీజైంది. తనకు భీష్మలాంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుములకు నితిన్ మరో ఛాన్స్ ఇచ్చినా.. ఈ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. పుష్పలాంటి సినిమాను తెరకెక్కించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను కూడా నిర్మించింది. ఇందులో రామ్ అనే ఓ అనాథ పాత్రలో నితిన్ నటించాడు. రాబిన్‌హుడ్ పేరుతో దొంగతనాలు చేస్తుంటాడు.
రాబిన్‌హుడ్ అనే టైటిల్ వినగానే సినిమా ఏంటో దాదాపుగా ఓ ఐడియా వస్తుంది. ఒక మంచి కోసం హీరో దొంగతనాలు చేస్తుంటాడని తెలిసిపోతుంది. అలాగే రాబిన్‌హుడ్ మూవీ స్టోరీ కూడా ఉంటుంది. కోటీశ్వరుల దగ్గర దోచేసి లేనోడికి పెట్టేయ్ అనేది రాబిన్‌హుడ్ ఫిలాసఫీ. అలాగే దొంగతనాలు చేస్తుంటాడు. రొటీన్ కథ అయినా కామెడీతో నడిపించాలని ప్రయత్నించిన దర్శకుడు వెంకీ కుడుముల సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. ఈ సినిమాను మీరు ఇప్పటి వరకూ చూసి ఉండకపోతే వెంటనే జీ5 ఓటీటీలో చూసేయండి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper













