యశ్ టాక్సిక్ మరో 100 రోజుల్లో.. కౌంట్‌డౌన్ మొదలుపెడుతూ అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసిన రాకింగ్ స్టార్
రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న టాక్సిక్ మూవీ మరో 100 రోజుల్లో రాబోతోంది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ మొదలుపెడుతూ యశ్ మంగళవారం (డిసెంబర్ 9) ఓ అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేశాడు.
కేజీఎఫ్ 2 తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న మూవీ టాక్సిక్. గీతూ మోహన్‌దాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ తేదీని మరోసారి కన్ఫమ్ చేస్తూ యశ్ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశాడు. ఇందులో అతని బ్యాక్ లుక్ చూడొచ్చు. అంతేకాదు ఈ సినిమా సరిగ్గా మరో 100 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

టాక్సిక్ రిలీజ్ డేట్ ఇదే..
టాక్సిక్ రిలీజ్ డేట్ పై గతంలోనే మేకర్స్ క్లారిటీ ఇవ్వగా.. తాజాగా యశ్ కూడా అభిమానులకు ఓ అదిరిపోయే పోస్టర్ తో అప్డేట్ ఇచ్చాడు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మార్చి 19, 2026న థియేటర్లలోకి రానుంది. నిర్మాతలు ఈ సినిమా కోసం చాలా తెలివైన విడుదల తేదీని ఎంచుకున్నారు. గుడి పడ్వా, ఉగాది, రంజాన్ పండుగలు కలిసి వస్తున్న సమయం అది. దీంతో వరుసగా నాలుగు రోజుల పాటు సెలవుల జాతర ఉండనుంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రణవీర్ సింగ్ నటిస్తున్న ‘ధురంధర్ 2’తో పోటీ పడాల్సి ఉంది.
కథలోనూ యశ్.. రచయితగా క్రెడిట్
తాజాగా టాక్సిక్ రిలీజ్ కు 100 రోజులు అంటూ యశ్ రిలీజ్ చేసిన పోస్టర్‌లో గమనించాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయం టెక్నీషియన్ల జాబితా. 'రచన: యశ్, గీతూ' అని ఉండటం అందరినీ ఆకర్షించింది. గతంలో ఒక ఇంటర్వ్యూలో యశ్ మాట్లాడుతూ.. గీతూ తన దగ్గరకు ఒక చిన్న ఐడియాతో వచ్చారని, దాన్ని తాము కలిసి ఇంత భారీ సినిమాగా అభివృద్ధి చేశామని చెప్పాడు. యశ్ ఈ సినిమాకు సహ-నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.
హాలీవుడ్ రేంజ్ యాక్షన్.. మ్యూజిక్ క్లారిటీ
ఈ సినిమాకు సంబంధించిన సాంకేతిక నిపుణుల విషయంలో ఉన్న సందిగ్ధతకు ఈ పోస్టర్ తెరదించింది. గతంలో చరణ్ రాజ్ లేదా అనిరుధ్ పేర్లు వినిపించినా చివరకు 'కేజీఎఫ్', 'సలార్' ఫేమ్ రవి బస్రూర్ ఈ ప్రాజెక్ట్‌కు సంగీతం అందిస్తున్నట్లు ఖరారైంది. ఇది పూర్తిగా బస్రూర్ షో కానుంది. జాతీయ అవార్డు గ్రహీత, దర్శకురాలు గీతూ భర్త రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'జాన్ విక్' (John Wick) ఫేమ్ యాక్షన్ డైరెక్టర్ జెజె పెర్రీ ఈ సినిమాలోని కీలక యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేస్తుండటం విశేషం. మిగిలిన యాక్షన్ పార్ట్‌ను మన భారతీయ ద్వయం అన్బరివ్ చూసుకుంటున్నాడు. ఈ సినిమాను ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా పలు భాషల్లో డబ్బింగ్ కానుంది. ఇందులో కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, సుదేవ్ నాయర్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు.
ఈ టాక్సిక్ మూవీ ప్రమోషన్లలో జనవరి నుంచే మొదలుపెట్టాలని మేకర్స్ భావిస్తున్నారు. గతంలోనే 140 రోజులు ఉండగా.. రిలీజ్ డేట్ మార్చి 19 అని ప్రొడ్యూసర్లు కన్ఫమ్ చేసిన విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


