మరో ఓటీటీలోకి రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

తరుణం చిత్రం మరో ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇప్పటికే ఓ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రం మరో ప్లాట్‍ఫామ్‍లో అందుబాటులోకి రానుంది. ఆ వివరాలు ఇవే..

Published on: Jun 14, 2025, 08:16:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘తరుణం’ థియేట్రికల్ రిలీజ్‍లో మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీ ఈ ఏడాది జనవరి 31వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో కిషన్ దాస్, స్మృతి వెంకట్, రాజ్ అయ్యప్ప లీడ్ రోల్స్ చేయగా.. అరవింద్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఇప్పటికే ఓ ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు మరో ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయింది.

మరో ఓటీటీలోకి  రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
మరో ఓటీటీలోకి రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

స్ట్రీమింగ్ వివరాలు

తరుణం సినిమా ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జూన్ 20వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రం ఇప్పటికే టెంట్‍కొట్టా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చింది. ఇప్పుడు ఆహాతమిళ్‍లోనూ అడుగుపెట్టనుంది. రెండో ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది.

టెంట్‍కొట్టాలో స్ట్రీమింగ్ తర్వాత తరుణంమూవీకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలే వచ్చాయి. స్టోరీ పాయింట్ బాగున్నా.. సాగదీతగా అనిపించిందనే కామెంట్లను కొందరు నెటిజన్లు పోస్ట్ చేశారు. నటీనటుల పర్ఫార్మెన్స్ బాగుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆహా తమిళ్ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చాక ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

హత్యను దాచేందుకు..

తరుణం మూవీని లవ్ స్టోరీ, క్రైమ్ అంశాలతో డైరెక్టర్ అరవింద్ శ్రీనివాసన్ తెరకెక్కించారు. సీఆర్పీఎఫ్ ఆఫీసర్ అర్జున్ (కిషన్ దాస్), మీరా (స్మృతి వెంకట్) ప్రేమలో పడతారు. అయితే, మీరాను రోహిత్ (రాజ్ అయ్యప్ప) ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఓరోజు మీరాతో గొడవ తర్వాత ఆమె ఇంట్లో.. రోహిత్ చనిపోతాడు. ఈ విషయాన్ని అర్జున్‍‍తో మీరా చెబుతుంది. దీంతో ఆ హత్యను దాచేందుకు అర్జున్, మీరా నిర్ణయించుకుంటారు. ఆ హత్యతో మీరాకు ఏమైనా సంబంధం ఉందా? రోహిత్ మృతదేహాన్ని దాచేసి హత్యను కప్పిపుచ్చారా? చివరికి ఏం జరిగిందనేవి ఈ చిత్రంలో ఉంటాయి.

తరుణం మూవీలో కిషన్, స్మృతి, రాజ్‍తో పాటు బాాల శరవణన్, గీతా కైలాసం, శ్రీజా రవి, సుజాత బాబు కీలకపాత్రలు పోషించారు. జెన్ స్టూడియోస్ బ్యానర్‌పై పుగళ్, ఈడెన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.. దర్బుకా శివ, అశ్విన్ హేమంత్ సంగీతం అందించారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More