దృశ్యం డైరెక్ట‌ర్ మ‌ల‌యాళం క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ - ఏ ఓటీటీలో...ఎప్ప‌టి నుంచి స్ట్రీమింగ్ అంటే?

దృశ్యం డైరెక్ట‌ర్ జీతూ జోసెఫ్ మ‌ల‌యాళంలో రోస్లిన్ సీక్రెట్ స్టోరీస్‌ పేరుతో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ సిరీస్ జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ వెబ్ సిరీస్‌కు జీతూ జోసెఫ్ షో ర‌న్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

Published on: May 31, 2025, 21:32:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దృశ్యం ఫేమ్‌, మ‌ల‌యాళ డైరెక్ట‌ర్‌ జీతూ జోసెఫ్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఫ‌స్ట్ టైమ్ ఓ వెబ్ సిరీస్ చేయ‌బోతున్నాడు. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈమలయాళవెబ్‌సిరీస్‌కు రోస్లిన్ సీక్రెట్ స్టోరీస్‌ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ వెబ్ సిరీస్‌కు షో ర‌న్న‌ర్‌గా మాత్ర‌మే జీతూ జోసెఫ్ వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు.

మ‌ల‌యాళం వెబ్ సిరీస్
మ‌ల‌యాళం వెబ్ సిరీస్

జియో హాట్ స్టార్‌లో...

రోస్లిన్ వెబ్ సిరీస్ జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. మ‌ల‌యాళంలో రూపొందుతోన్న ఈ వెబ్‌సిరీస్ తెలుగు, త‌మిళం, క‌న్న‌డ హిందీ భాష‌ల్లో రిలీజ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు. రోస్లిన్ సీక్రెట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌కు సుమేష్ నంద‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌తోనే డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇస్తోన్నాడు సుమేష్‌.

బ్యాచ్‌ల‌ర్ పార్టీ...

రోస్లిన్ వెబ్ సిరీస్‌లో సంజ‌న దీపు, హ‌కీమ్ షా లీడ్ రోల్స్‌లో న‌టిస్తున్నారు. అడ‌వి మ‌ధ్య‌లో ఉన్న రిసార్ట్‌లో బ్యాచ్‌ల‌ర్ పార్టీ చేసుకోవ‌డానికి కొంద‌రు ఫ్రెండ్స్ వ‌స్తారు. అక్క‌డ వారికి ఎలాంటి విచిత్ర‌మైన అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? ఆ రిసార్ట్ మిస్ట‌రీ ఏమిట‌న్న‌దే ఈ వెబ్‌సిరీస్ క‌థ‌.

జూన్‌లో రిలీజ్‌...

రోస్లిన్ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. జూన్ నెలాఖ‌రున ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లోస్ట్రీమింగ్కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ వెబ్‌సిరీస్ రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు.

దృశ్యంతో ఫేమ‌స్‌...

జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన దృశ్యం మూవీ మ‌ల‌యాళంలోనే ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే బెస్ట్ థ్రిల్ల‌ర్ మూవీస్‌లో ఒక‌టిగా నిలిచింది. మోహ‌న్‌లాల్ హీరోగా మూడున్న‌ర కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 65 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. మ‌ల‌యాళంలో యాభై కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఫ‌స్ట్ మూవీగా నిలిచింది. త‌మిళం, క‌న్న‌డ‌, హిందీతో పాటు కొరియ‌న్‌, జ‌పాన్ భాష‌ల్లోకి దృశ్యం మూవీ రీమేక్ అయ్యింది.

మూడో పార్ట్‌...

దృశ్యం సినిమాకు సీక్వెల్‌గా దృశ్యం 2ను తెర‌కెక్కించి పెద్ద‌ విజ‌యాన్ని అందుకున్నాడు జీతూ జోసెఫ్‌. ప్ర‌స్తుతం దృశ్యం ఫ్రాంచైజ్‌లో మూడో పార్ట్ రాబోతోంది. దృశ్యం 2 తెలుగు రీమేక్ ద్వారా ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు జీతూ జోసెఫ్‌.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More