...
...
Next Story

ల‌క్కీస్టార్‌గా మారిన సాయికుమార్‌ - బైలింగ్వ‌ల్ మూవీ చౌకీదార్‌ నుంచి ఎమోష‌న‌ల్ సాంగ్ రిలీజ్‌!

సాయికుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చౌకీదార్ మూవీ నుంచి ఎమోష‌న‌ల్ సాంగ్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. తండ్రీకొడుకుల అనుబంధంతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో పృథ్వీ అంబర్, ధన్యా రమ్యకుమార్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

Published on: Jun 5, 2025, 08:22:35 IST
By
Prefer HTon Google
Advertisement

సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన కమిటీ కుర్రోళ్లు, లక్కీ భాస్కర్, సరిపోదా శనివారం, మెర్సీ కిల్లింగ్ తో పాటు మరికొన్ని సినిమాలు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన‌ గద్దర్ అవార్డుల్లో సత్తా చాటాయి. సాయికుమార్ నటించిన సినిమాలన్నీ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిలుస్తుండ‌టంతో ల‌క్కీస్టార్‌గా మారిపోయారు. ప్ర‌స్తుతం సాయికుమార్‌ తెలుగు,కన్నడ భాషల్లో ‘చౌకీదార్’ అనే సినిమాను చేస్తున్నారు. తండ్రీకొడుకుల అనుబంధంతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో పృథ్వీ అంబర్, ధన్యా రమ్యకుమార్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

ఎమోష‌న‌ల్ సాంగ్‌...

చౌకీదార్ మూవీ
చౌకీదార్ మూవీ

‘చౌకీదార్’ మూవీని వీఎస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ మీద డా. కల్లహల్లి చంద్ర శేఖర్ నిర్మిస్తుండగా.. చంద్రశేఖర్ బండియప్ప ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా చౌకీదార్ మూవీ నుంచి ఓ ఎమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. నాన్న గొప్పదనం చాటి చెప్పేలా హృద‌యాల‌ను క‌దిలించేలా ఈ పాట సాగింది. నాన్నా అంటూ సాగే ఈ పాటను సంతోష్ వెంకీ రచించగా.. విజయ్ ప్రకాష్ ఆలపించారు. సచిన్ బస్రూర్ మ్యూజిక్ అందించారు.

తండ్రి త్యాగాల‌ను...

తండ్రి త్యాగాల్ని, మోసే బాధ్యతల్ని, చూపించే ప్రేమను చాటిచెబుతూ ఈ పాట సాగింది. ఈ లిరిక‌ల్ వీడియో సాంగ్ యూట్యూబ్లో వైర‌ల్ అవుతోంది. ఈ మూవీలో సాయి కుమార్ తండ్రిగా మ‌రోమారు నాచుర‌ల్ యాక్టింగ్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించేందుకు రెడీ అవుతోన్నారు. . పృథ్వీ అంబర్, సాయి కుమార్ మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయ‌ని మేక‌ర్స్ చెబుతోన్నారు.

దియాతో ఫేమస్…

దియా మూవీతో క‌న్న‌డ‌లో ఫేమ‌స్ అయ్యాడు పృథ్వీ అంబ‌ర్‌. ఇటీవ‌ల రిలీజైన డియ‌ర్ ఉమ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో రాక్‌స్టార్‌గా క‌నిపించాడు. క‌న్న‌డ‌, తెలుగుతో పాటు త‌మిళం, తులు భాష‌ల్లో సినిమాలు చేస్తున్నాడు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks