ఏకంగా 18 సార్లు 100 కోట్లు కొల్లగొట్టిన ఏకైక హీరో.. వాటిలో ప్లాఫ్స్ కూడా.. సోలో హీరోగానే రికార్డ్.. ప్రభాస్ మాత్రం కాదు!
బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల కలెక్షన్స్ చేరుకోవడం ఎంతో కష్టం. అలాంటిది ఏకంగా 18 సార్లు వరుసగా రూ. 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఏకైక ఇండియన్ హీరో ఒకరున్నారు. ఆ సినిమాల్లో ప్లాఫ్స్ కూడా ఉన్నాయి. ఎలాంటి మల్టీస్టారర్ లేకుండా సోలో హీరోగానే ఈ కలెక్షన్స్ రాబట్టి చరిత్రలో ఒకే ఒక్కడుగా నిలిచాడు.
ఒక హీరో స్టార్‌డమ్ ఎంత ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టడం చాలా కష్టం. ఎంత పెద్ద హీరో అయిన కథ, కథనాలు సరిగా లేకుంటే ఆడియెన్స్‌తోపాటు అభిమానులు కూడా థియేటర్లలో సరిగా సినిమాలను చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే, థియేటర్లలో కాకుండే ఓటీటీల్లో ఎంచక్కా వీక్షించే అవకాశం ఉంది కాబట్టి.

18 సినిమాల్లో ఫ్లాప్స్ కూడా
ఇదిలా ఉంటే, సినిమా ఎలా ఉన్నా రూ. 100 కోట్లు రాబట్టగలిగే హీరోలు ఇండియాలో చాలా మందే ఉన్నారు. అయితే, ఏకంగా 18 సార్లు వరుసగా వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టిన హీరో మాత్రం ఒకే ఒక్కరు ఉన్నారు. అది కూడా సోలో హీరోగా నటించి, ఆ 18 సినిమాలో ప్లాఫ్స్ కూడా ఉన్నప్పటికీ వాటిని వంద కోట్ల క్లబ్ వైపుకు నడిపించి ఏకైక ఇండియన్ హీరోగా చరిత్రలో ఒక్కడిగా పేరు తెచ్చుకున్నాడు.
ఈ మాటలు వింటే మనకు టక్కున గుర్తుకు వచ్చేది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. డార్లింగ్ ప్రభాస్ సినిమాలు వరుసగా రూ. 100 కోట్ల కలెక్ట్ చేస్తున్నాయి. కానీ, 18 సార్లు వంద కోట్ల క్లబ్‌లో చేరిన హీరో ప్రభాస్ మాత్రం కాదు. అది బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. అభిమానులు ముద్దుగా సల్లూ భాయ్ అని పిలుచుకుంటారు.
తొలి మూవీ అదే
అవును, సల్మాన్ ఖాన్ నటించిన 18 సినిమాలు రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి అతడి రేంజ్, స్టార్‌డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో నిరూపించాయి. అందులో డిజాస్టర్ సినిమాలు కూడా వంద కోట్లు రాబట్టి ఆశ్చర్యపరిచాయి. సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ తొలిసారిగా రూ. 100 కోట్లు రాబట్టింది.
ఆ తర్వాత రెడీ, బాడీగార్డ్, ఏక్ థా టైగర్, దబాంగ్ 2, జయహో, కిక్, భజరంగీ భాయిజాన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, సుల్తాన్, ట్యూబ్ లైట్, టైగర్ జిందా హై, రేస్ 3, భారత్, దబాంగ్ 3, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్, టైగర్ 3, సికందర్ సినిమాలు వరుసగా వంద కోట్లు రాబట్టాయి.
రష్మిక మందన్నాతో
రష్మిక మందన్నాతో సల్మాన్ ఖాన్ నటించిన చివరి చిత్రం సికందర్. ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సికందర్ సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు మొత్తంగా రూ. 177 కోట్ల కలెక్షన్స్ వరకు వచ్చాయి.
ఇలా ఏకంగా 18 సార్లు వరుసగా రూ. 100 కోట్ల మార్క్‌ను అందుకున్న ఏకైక హీరోగా సల్మాన్ ఖాన్ నిలిచాడు. దీంతో ఇండియన్ హీరోల్లో ఆల్ టైమ్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ 100 క్రోర్స్ మూవీస్ హీరోగా సంచలన హీరోగా సల్లూ భాయ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. అంతేకాకుండా ఈ సినిమాలలో మల్టీస్టారర్ కాకుండా సోలో హీరో మూవీసే ఎక్కువగా ఉండటం విశేషం.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



