బాయ్‌ఫ్రెండ్‌ను హగ్ చేసుకున్న సమంత.. రిలేషన్షిప్‌ను కన్ఫమ్ చేసినట్లేనా?
సమంత రూత్ ప్రభు తన బాయ్‌ఫ్రెండ్ రాజ్ నిడిమోరును హగ్ చేసుకున్న ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఫొటోను ఆమె శుక్రవారం (నవంబర్ 7) ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
నటి సమంత రూత్ ప్రభు, దర్శకుడు, నిర్మాత రాజ్ నిడిమోరు మధ్య డేటింగ్ పుకార్లు కొంతకాలంగా టాలీవుడ్, బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ తమ సంబంధాన్ని బహిరంగంగా ధృవీకరించకపోయినప్పటికీ, సమంత తాజాగా షేర్ చేసిన ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చింది. ఇందులో ఈ ఇద్దరూ హగ్ చేసుకొని కనిపించారు.

మైండ్ గేమా? రిలేషన్‌షిప్ రివీలా?
సమంత తన కొత్త పెర్ఫ్యూమ్ బ్రాండ్ 'సీక్రెట్ అల్కెమిస్ట్' ప్రారంభించిన సందర్భంగా జరిగిన ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఈ ఫోటోలలో దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక ఫొటో హైలైట్‌గా నిలిచింది.
ఒక ఫోటోలో సమంత.. రాజ్ నిడిమోరును కౌగిలించుకుని పోజు ఇవ్వగా, రాజ్ కూడా ఆమె నడుము చుట్టూ చేయి వేసి కనిపించాడు. ఈవెంట్‌లో ఉన్న పలువురితో కలిసి దిగిన మరో ఫోటోలో రాజ్ సమంత వెనుక నిలబడి కనిపించారు.
"స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఉన్నాను. గత ఏడాదిన్నరలో నేను నా కెరీర్‌లో అత్యంత సాహసోపేతమైన అడుగులు వేశాను. రిస్క్ తీసుకుంటూ, నా అంతరాత్మను నమ్ముతూ, నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాను. ఈ రోజు నేను చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకుంటున్నాను" అని సమంత క్యాప్షన్‌లో రాసుకొచ్చింది.
"నేను కలిసిన అత్యంత ప్రకాశవంతమైన, కష్టపడి పనిచేసే, నిజమైన వ్యక్తులతో పనిచేస్తున్నందుకు నేను చాలా కృతజ్ఞురాలిని. ఎంతో విశ్వాసంతో, ఇది కేవలం ఆరంభం మాత్రమే అని నాకు తెలుసు" అని రాజ్ తో తన ప్రొఫెషనల్ బంధాన్ని ప్రస్తావిస్తూ పోస్ట్ చేసింది.
సమంత, రాజ్ రిలేషన్షిప్
రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ పుకార్లు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ ఇద్దరూ కలిసి 'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ' సిరీస్‌లకు పనిచేశారు. కలిసి పని చేయడంతోపాటు వీరు కలిసి వెకేషన్లకు వెళ్లడం, జిమ్‌లు, పికిల్‌బాల్ ఈవెంట్‌లో తరచుగా జంటగా కనిపించడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది.
సమంత, రాజ్ అండ్ డీకే ద్వయంతో కలిసి ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతున్న 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్' వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.సమంత లేదా రాజ్ నిడిమోరు తమ సంబంధం గురించి ఎప్పుడూ బహిరంగంగా అంగీకరించలేదు లేదా ఖండించలేదు. గతంలో ఈ పుకార్లపై సమంత మేనేజర్ స్పందిస్తూ, ఆ వార్తల్లో నిజం లేదని ఖండించారు.
తాజా హగ్ ఫొటో, క్యాప్షన్‌లో "స్నేహితులు, కుటుంబం" అనే ప్రస్తావన ఉండటంతో ఆమె తన రిలేషన్షిప్ ను అధికారికంగా అనౌన్స్ చేసినట్లేనా అన్న చర్చ జరుగుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


