Samantha: ఆపండి.. ఇక చాలు! మహిళా ఆర్టిస్టుల గురించి సమంత సంచలన వ్యాఖ్యలు.. మనసులో మాట బయటపెట్టిన స్టార్ హీరోయిన్

Samantha: మహిళలు తమ కెరీర్‌లో ఎలా సర్దుకుపోతారో, త్యాగాలు చేస్తారో, క్షమాపణలు చెబుతారో అంటూ సమంత సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికైనా ఇది ఆపాలని సమంత పేర్కొంది.

Published on: Mar 27, 2026, 08:52:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తాజాగా సినీ పరిశ్రమలో మహిళల ఆర్టిస్ట్ ల పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమంత సంచలన వ్యాఖ్యలు చేసింది.

సమంత రూత్ ప్రభు
సమంత రూత్ ప్రభు

సమంత కామెంట్లు

ఈ సందర్భంగా సినిమా రంగంలో మహిళల గురించి సమంత సంచలన కామెంట్లు చేసింది. తమ గుర్తింపు కోసం ప్రతిదానికీ అమ్మాయిలు రెట్టింపు కష్టపడాల్సి వస్తోందని సమంత తన ఆవేదనను వ్యక్తం చేసింది. మహిళలు తమ కెరీర్ కోసం పడే ఇబ్బందులను ఆమె పూసగుచ్చినట్లు వివరించింది.

వెనక్కి తగ్గుతూ

మన చుట్టూ ఉన్నవారు సౌకర్యవంతంగా ఉండటం కోసం మహిళలు తమ షెడ్యూళ్లను, అభిప్రాయాలను ఎప్పుడూ సర్దుబాటు చేసుకుంటారని సమంత రూత్ ప్రభు పేర్కొంది. తమ ఆశయాలను వదులుకుంటూ మహిళలు ఎప్పుడూ వెనక్కి తగ్గుతారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

త్యాగాలను గుర్తించని స్థితి

మహిళలు తమను తాము త్యాగం చేసుకుంటున్నామనే విషయాన్ని కూడా గుర్తించలేనంతగా సర్దుకుపోతున్నారని సమంత తెలిపింది. తమ వ్యక్తిత్వాన్ని చంపుకొని ఇతరుల కోసం బతకడం ఒక అలవాటుగా మారిపోయిందని ఆమె అభిప్రాయపడింది.

ఇక ఆపాలి

పురుషుల కంటే మహిళలు పది రెట్లు ఎక్కువగా క్షమాపణలు చెబుతారని సమంత ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ఇలా అనవసరంగా ప్రతిదానికీ క్షమాపణలు చెప్పడం ఇకనైనా ఆపాలని ఆమె గట్టిగా పిలుపునిచ్చింది.

గుర్తింపు మన హక్కు

మహిళలు తాము కష్టపడి సంపాదించుకున్న స్థానానికి వారు పూర్తి అర్హులని సమంత ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఎవరైనా ప్రశంసించినప్పుడు దాన్ని అహంకారంగా చూడకుండా, సంతోషంగా స్వీకరించాలని ఆమె మహిళలకు సూచించింది.

ఆ రోజు రావాలి

భవిష్యత్తులో సినిమాలను కేవలం 'మహిళా-ప్రధాన (ఫీమేల్ లీడ్ రోల్)' చిత్రాలు అని పిలవడం ఆపేసే రోజు రావాలని సమంత కలగంటుంది. కేవలం ఎవరి భార్యగానో లేదా హీరో ధైర్యం పెంచేలా మాత్రమే మహిళల పాత్రలు ఉండకూడదని సమంత స్పష్టం చేసింది.

షూటింగ్ సెట్స్‌లో భద్రత అనేది ఒక చర్చాంశంలా కాకుండా, పరిశ్రమకు ఒక బలమైన పునాదిలా ఉండాలని సమంత పేర్కొంది. ప్రతి మహిళా నటి సెట్‌లో క్షేమంగా ఉన్నామనే భావనతో పని చేయాలని తెలిపింది. ఆ వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పింది.

మా ఇంటి బంగారం అప్‌డేట్

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే, ఆమె ప్రస్తుతం 'మా ఇంటి బంగారం' షూటింగ్‌లో బిజీగా ఉంది. నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మే 15, 2026న ఈ సినిమా రిలీజ్ కానుంది.

దీనితో పాటు రాజ్ & డీకే దర్శకత్వంలో 'రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్' అనే భారీ ప్రాజెక్టులో కూడా సమంత నటిస్తోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More