సమంతపై లాభాల వర్షం.. శుభం ఓటీటీ హక్కులకు రికార్డు ధర.. ఎంత సంపాదించిందో తెలుసా?

సమంతపై లాభాల వర్షం కురిసింది. ఆమె నిర్మించిన తొలి సినిమా శుభం థియేటర్లలోనే కాదు.. ఓటీటీ హక్కుల రూపంలోనూ భారీగానే వెనకేసుకుంది. ఈ సినిమా వచ్చే వారం ఓటీటీలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే.

Published on: Jun 03, 2025 2:09 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హారర్ కామెడీ మూవీ శుభం బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయింది. కేవలం రూ.2.5 కోట్ల బడ్జెట్ తో సమంత రూపొందించిన ఈ మూవీ.. ఏకంగా రూ.7 కోట్ల వరకూ వసూలు చేసింది. ఇక ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కోసం సిద్ధమవుతోంది. జూన్ 13న జియోహాట్‌స్టార్ ఓటీటీ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్న విషయం తెలిసిందే. అయితే డిజిటల్ హక్కుల కోసం ఆ ఓటీటీ భారీగానే చెల్లించిందట.

సమంతపై లాభాల వర్షం.. శుభం ఓటీటీ హక్కులకు రికార్డు ధర.. ఎంత సంపాదించిందో తెలుసా?
సమంతపై లాభాల వర్షం.. శుభం ఓటీటీ హక్కులకు రికార్డు ధర.. ఎంత సంపాదించిందో తెలుసా?

శుభం డిజిటల్ హక్కుల ధర ఇలా..

శుభం మూవీ మే 9న థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. అదే సమయంలో శ్రీవిష్ణు సింగిల్ మూవీ కూడా రావడంతో సమ్మర్ హిట్ గా నిలిచింది. శుభం సినిమా కాస్త మెల్లగా పుంజుకుంది. దీంతో మొదట జీ5 ఓటీటీతో కుదిరిన ఒప్పందం రద్దయింది. ఆ తర్వాత జియోహాట్‌స్టార్ ఓటీటీ ఏకంగా రూ.3 కోట్లకు ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.

కేవలం రూ.2.5 కోట్లతో రూపొందిన ఈ సినిమాకు ఇది చాాలా పెద్ద మొత్తమే. అంతకుముందే బాక్సాఫీస్ దగ్గర రూ.7 కోట్లు కూడా వసూలవడంతో తన తొలి సినిమాతోనే సమంత భారీగానే సంపాదించేసింది. ఈ సినిమాను జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు జియోహాట్స్టార్ ఓటీటీ ఈ మధ్యే వెల్లడించింది.

శుభం మూవీ గురించి..

ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేసిన శుభం మూవీలో పెద్ద స్టార్లు ఎవరూ లేరు. లో బడ్జెట్ తో రూపొందిన ఓ చిన్న సినిమా. ఏళ్లపాటు సాగే సీరియల్స్ పై సెటైరికల్ గా రూపొందించిన హారర్ కామెడీ మూవీ ఇది. సింపుల్ పాయింట్‌తో చివ‌రి వ‌ర‌కు ఎంట‌ర్‌టైన్ చేశాడు డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ కండ్రేగుల‌.

సీరియ‌ల్ అంటేనే ఏళ్ల‌కు ఏళ్లు సాగ‌డం కామ‌న్‌. ఓ టీవీ సీరియ‌ల్‌ను రెగ్యుల‌ర్‌గా ఫాలో అవుతూ.. అది పూర్తికాకుండానే చ‌నిపోయిన వాళ్లు ఆత్మ‌లై తిరిగి వ‌చ్చి సీరియ‌ల్‌ను చూస్తే ఏంట‌న్న‌దే శుభం సినిమా క‌థ‌. ఈ గ‌మ్మ‌త్తైన క‌థ‌ను మూడు యువ జంట‌ల జీవితాల‌తో అంతే ఫ‌న్నీగా తెరపై చూపించారు ద‌ర్శ‌కుడు.

టీవీ సీరియ‌ల్స్‌లో ఎక్కువ‌గా క‌నిపించే స్త్రీల అణిచివేత‌, పురుషాధిక్య‌త లాంటి సున్నిత‌మైన అంశాల‌ను వివాదాల‌కు తావు లేకుండా వినోదాత్మ‌కంగా డీల్ చేసిన విధానం బాగుంది. ఇందులో సమంత కూడా గెస్ట్ రోల్ చేసింది. సినిమాను నిర్మించడమే కాదు బాగానే ప్రమోట్ చేసింది. దీంతో బాక్సాఫీస్ సక్సెస్ సాధించడమే కాదు.. భారీ ఓటీటీ డీల్ కూడా సొంతం చేసుకోగలిగింది.

News/Entertainment/సమంతపై లాభాల వర్షం.. శుభం ఓటీటీ హక్కులకు రికార్డు ధర.. ఎంత సంపాదించిందో తెలుసా?
News/Entertainment/సమంతపై లాభాల వర్షం.. శుభం ఓటీటీ హక్కులకు రికార్డు ధర.. ఎంత సంపాదించిందో తెలుసా?