OTT Thriller: పిచ్చెక్కించే ట్విస్టులు.. అంతుబట్టని టైమ్.. ఓటీటీలోకి తెలుగులో వస్తున్న మలయాళ మైండ్ బెండింగ్ థ్రిల్లర్

OTT Thriller: మలయాళంలో వచ్చిన లైమ్ లూప్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ సంభవం అధ్యాయం ఒన్ను తెలుగులోనూ ఓటీటీలోకి వస్తోంది. మైండ్ బెండింగ్ ట్విస్టులతో సాగే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ తెలుగు ప్రేక్షకుల్లోనూ ఎంతో ఆసక్తి రేపుతోంది.

Published on: Apr 10, 2026, 15:31:17 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Thriller: మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే విభిన్నమైన థ్రిల్లర్ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్ ఉంటుంది. ఇటీవల థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ ‘సంభవం: అధ్యాయం ఒన్ను’ (Sambhavam Adhyayam Onnu) ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమైంది. మార్చి 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరించబోతోంది.

OTT Thriller: పిచ్చెక్కించే ట్విస్టులు.. అంతుబట్టని టైమ్.. ఓటీటీలోకి తెలుగులో వస్తున్న మలయాళ మైండ్ బెండింగ్ థ్రిల్లర్
OTT Thriller: పిచ్చెక్కించే ట్విస్టులు.. అంతుబట్టని టైమ్.. ఓటీటీలోకి తెలుగులో వస్తున్న మలయాళ మైండ్ బెండింగ్ థ్రిల్లర్

విషు పండగ కానుకగా స్ట్రీమింగ్

మలయాళీలకు అత్యంత ఇష్టమైన 'విషు' పండుగను పురస్కరించుకుని.. ఈ సంభవం అధ్యాయం ఒన్ను మూవీని ఏప్రిల్ 15న ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ ఉత్కంఠభరిత టైమ్ లూప్ థ్రిల్లర్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ (JioHotstar) లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్ అయిన వారికి, ఈ జానర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.

తెలుగులోనూ అందుబాటులోకి..

ఈ సినిమా కేవలం మలయాళ భాషకే పరిమితం కాకుండా, పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్లాన్ చేశారు. ఏప్రిల్ 15 నుంచి మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంటుందని ఆ ఓటీటీ వెల్లడించింది. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఈ మిస్టరీని ఆస్వాదించవచ్చు.

సంభవం అధ్యాయం ఒన్ను స్టోరీ ఏంటంటే?

'సంభవం: అధ్యాయం ఒన్ను' ఒక ఆసక్తికరమైన టైమ్ లూప్ థ్రిల్లర్. ఒకే సంఘటన చుట్టూ తిరిగే కాలచక్రాన్ని, అందులోని మిస్టరీని ఛేదించే క్రమంలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. కేరళ, తమిళనాడు సరిహద్దులోని అడవిలో మిస్సింగ్ కేసులు నమోదవుతుంటాయి. కనిపించకుండా పోయిన తమ సహచరుడి కోసం అక్కడికి వెళ్లిన పోలీసులకు వింత అనుభవం ఎదురవుతుంది. ఓ టైమ్ లూప్ లో చిక్కుకొని, తమను తామే వేర్వేరు వెర్షన్లలో చూసుకొని షాకవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ అడివిలోకి వెళ్లిన వారు ఎందుకు లూప్ లో చిక్కుకుపోతారన్నదే ఈ మూవీ మిగిలిన స్టోరీ.

తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ అద్భుతమైన స్క్రీన్ ప్లే, మేకింగ్ విలువలతో ఈ సినిమా థియేటర్లలో రిలీజైనప్పుడే మంచి టాక్ సొంతం చేసుకుంది. మలయాళ సినిమాల మార్కు రియలిజం, గ్రిప్పింగ్ నరేషన్ ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. మీరు గనుక మిస్టరీ థ్రిల్లర్ సినిమాల ప్రేమికులైతే మీ వాచ్ లిస్ట్‌లో ‘సంభవం: అధ్యాయం ఒన్ను’ని చేర్చుకోవడం మర్చిపోకండి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. ‘సంభవం: అధ్యాయం ఒన్ను’ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడు?

ఈ సినిమా ఏప్రిల్ 15, 2026 నుంచి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వస్తుంది.

2. ‘సంభవం: అధ్యాయం ఒన్ను’ సినిమా ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది?

ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ (JioHotstar) లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

3. ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉంటుందా?

అవును. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More