మెగా వ‌ర్సెస్ నందమూరి.. ఒకేరోజు ఓజీ, అఖండ 2 రిలీజ్.. సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ రియాక్ష‌న్స్ వైర‌ల్‌

బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే సమరం రాబోతోంది. మరోసారి మెగా వర్సెస్ నందమూరి ఫైట్ కు రంగం సిద్ధమైంది. పవన్ కల్యాణ్ మూవీ ఓజీ.. నందమూరి బాల‌కృష్ణ‌ సినిమా అఖండ 2 ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి. ఈ మహా క్లాష్ పై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రియాక్షన్స్ వైరల్ గా మారాయి. 

Published on: Jun 10, 2025, 08:27:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాక్సాఫీస్ దగ్గర మరోసారి మెగా వర్సెస్ నందమూరి పోరుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే చాలా సార్లు మెగా హీరోలు, నందమూరి హీరోలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డారు. కానీ ఈ సారి సమరం మరింత ప్రత్యేకం కానుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ ‘ఓజీ’, నందమూరి బాల‌కృష్ణ‌ సినిమా ‘అఖండ 2 తాండవం’ ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి. ఈ బాక్సాఫీస్ ఫైట్ ఇప్పటి నుంచే హాట్ టాపిక్ గా మారింది.

ఓజీ వర్సెస్ అఖండ 2 (x)
ఓజీ వర్సెస్ అఖండ 2 (x)

దసరా రోజు

పవన్ కల్యాణ్ ఓజీ, బాల‌కృష్ణ‌ అఖండ 2 సినిమాలు 2025 దసరా రోజు రిలీజ్ కాబోతున్నాయి. సెప్టెంబర్ 25న ఈ మూవీస్ థియేటర్లకు రాబోతున్నాయి. ఓజీ రిలీజ్ డేట్ ను మే 25న మేకర్స్ రివీల్ చేశారు. సెప్టెంబర్ 25న థియేటర్లకు ఓజీ వచ్చేస్తున్నాడని ప్రకటించేశారు. తాజాగా అఖండ 2 నుంచి పవర్ ఫుల్ టీజర్ రిలీజ్ చేసిన ఆ మూవీ మేకర్స్ కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు. సెప్టెంబర్ 25నే అఖండ 2ను థియేటర్లకు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.

అప్పుడు అన్నయ్యతో

మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ థియేటర్ వార్ కొన్నాళ్లుగా సాగుతోంది. ఈ ఇద్దరి సినిమాలు చాలా సార్లు ఒకే రోజున, ఒకే పండుగకు రిలీజ్ అయ్యాయి. రీసెంట్ గా వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి 2023 సంక్రాంతికి పోటీపడ్డాయి. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్, బాల‌కృష్ణ‌ బాక్సాఫీస్ వార్ మాత్రం ఫస్ట్ టైమ్ అని చెప్పొచ్చు.

ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్యే

పొలిటికల్ గా చూసుకున్నా పవన్ కల్యాణ్, బాల‌కృష్ణ‌ మధ్య సినిమా వార్ అంటే స్పెషల్ గా నిలుస్తుంది. ఎందుకంటే పవన్ కల్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు బాల‌కృష్ణ‌ హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. దీంతో హిందూపురం ఎమ్మెల్యే వర్సెస్ పిఠాపురం ఎమ్మెల్యే అనే వార్ సోషల్ మీడియాలో సాగుతోంది.

సీక్వెల్ గా

బాక్సాఫీస్ ను షేక్ చేసిన అఖండ మూవీకి సీక్వెల్ గా ఇప్పుడు అఖండ 2 తాండవం మూవీని రెడీ చేస్తున్నారు. బోయపాటి శ్రీను, బాల‌కృష్ణ‌ కాంబినేషన్ కు ఉండే క్రేజే వేరు. మరోసారి వీళ్లు బాక్సాఫీస్ ను ఊచకోత కోసేందుకు వస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఈ మూవీని రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. మరోవైపు ఫ్యాన్స్ ఎప్పటి నుంచి ఓజీ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సుజిత్ డైరెక్టర్. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పై డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More