Sandeep Reddy Vanga: టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', ‘యానిమల్’ చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. సమాజంలో ఏదైనా ఘోరం లేదా నేరం జరిగిన ప్రతిసారీ సినిమాలను, ముఖ్యంగా తన చిత్రాలలోని వైలెంట్‌ను వేలెత్తి చూపించే వారిపై ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

సమాజంలో ఎవరైనా ఒక భయంకరమైన నేరానికి పాల్పడినప్పుడు, మొదట చూపించాల్సింది ఆ ఘోరానికి గురైన బాధితుల పట్ల సానుభూతి అని ఆయన స్పష్టం చేశారు. ఆ సమస్య వెనుక ఉన్న అసలు కారణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలే తప్ప, ప్రచార ఆర్భాటం కోసం సినిమాలను బలిపశువుగా మార్చడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. సామాజిక సంస్కర్తలుగా నటిస్తున్న ఫెయిల్డ్ యాక్టర్లు, పరాన్నజీవులంటూ తన ఎక్స్ అకౌంట్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.
“ఫెయిల్డ్ యాక్టర్స్, పరాన్నజీవులారా.. నేర్చుకోండి!”
సందీప్ రెడ్డి వంగా తన పోస్ట్‌లో ప్రత్యక్షంగా కొందరు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటూ విమర్శలు గుప్పించారు.
“ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తున్నది ఏంటంటే.. మీలోని ఆందోళన బాధితుల కోసం లేదా వారి కుటుంబాల కోసం ఎంతమాత్రం కాదు. ఒక భయంకరమైన విషాదాన్ని, దారుణాన్ని ఆసరాగా చేసుకుని వేరొకరిపై మీకున్న వ్యక్తిగత కక్షలను తీర్చుకోవడానికి దానిని ఒక సాకుగా వాడుకుంటున్నారు” అని సందీప్ రాసుకొచ్చారు.
సందీప్ అక్కడితో ఆగలేదు. ఏం చేతగాని ఫెయిలైన నటులు, మరొకరిపై ఆధారపడే పరాన్న జీవులే ఇలాంటివి చేస్తున్నారని అనడం గమనార్హం. “వేరొకరు కష్టపడి చేసిన పనిపై దాడి చేసే అవకాశం రాగానే, హఠాత్తుగా తమను తాము సామాజిక సంస్కర్తలుగా ప్రకటించుకునే కొంతమంది పనీ-పాటా లేని ఫెయిల్యూర్ నటీనటులు, కొందరు దర్శకులు, నిర్మాతలు, పరాన్నజీవులను ఉద్దేశించి నేను ఈ మాటలు చెబుతున్నాను. ఒక విషాదానికి కావాల్సింది సానుభూతి మాత్రమే.. మీ అవకాశవాదం కాదు. ముందు ఆ తేడా తెలుసుకోండి” అంటూ ఘాటుగా ముగించారు.
కల్ట్ డైరెక్టర్ వర్సెస్ సోషల్ మీడియా ట్రోలింగ్
సందీప్ రెడ్డి వంగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కొల్లగొడుతున్నప్పటికీ, ఆయన చిత్రాలలోని హింస, పాత్రల ప్రవర్తనపై తరచూ ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు, సోషల్ మీడియా విభాగం నుంచి విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.
{{/usCountry}}సందీప్ రెడ్డి వంగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కొల్లగొడుతున్నప్పటికీ, ఆయన చిత్రాలలోని హింస, పాత్రల ప్రవర్తనపై తరచూ ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు, సోషల్ మీడియా విభాగం నుంచి విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.
{{/usCountry}}అయితే ప్రతిసారీ తనదైన పదునైన శైలిలోనే సమాధానమిచ్చే సందీప్.. ఈసారి ఏకంగా నేరాల వెనుక సినిమాల ప్రమేయం ఉందనే నెపం మోపే వారి అసలు రంగును బయటపెట్టారు.
ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ డ్రామా 'స్పిరిట్' (Spirit) పనుల్లో బిజీగా ఉన్న సందీప్ రెడ్డి వంగా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌తో పాటు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.