2024లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవటమే కాదు.. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. యూత్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది.
గద్దర్ అవార్డ్స్

అలాగే, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అందించిన గద్దర్ అవార్డ్స్‌లో జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది కమిటీ కుర్రోళ్లు. అంతేకాకుండా మూవీ డైరెక్టర్ యదు వంశీకి ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా కూడా గద్దర్ అవార్డ్ వచ్చింది.
తొలి ప్రయత్నంలోనే అందరినీ మెప్పించిన సక్సెస్‌ఫుల్ బ్యానర్ పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ నుంచి ఇప్పుడు రెండో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందనున్న రెండో సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
సోలో హీరోగా ఎంట్రీ
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ప్రతిభావంతుడైన యువ కథానాయకుడు సంగీత్ శోభన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. సంగీత్ శోభన్ సోలో హీరోగా నటించనున్న తొలి సినిమా ఇదే. ఇదివరకే మెగా డాటర్ నిహారిక కొణిదెల రూపొందించిన వెబ్ ప్రాజెక్ట్స్‌లో హీరో సంగీత్ శోభన్, డైరెక్టర్ మానస శర్మ భాగమయ్యారు.
ఈ చిత్రంలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్‌గా నయన్ సారిక నటిస్తుంది. ఆయ్, క వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఈమె పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిర్మించిన జీ5 ఓటీటీ హలో వరల్డ్, సోనీ లివ్ బెంచ్ లైఫ్ ఓటీటీ సిరీస్‌లలో అలరించింది.
ఇదివరకు వెబ్ సిరీస్‌లో
నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, సుఖ్వీందర్ సింగ్, అరుణ భిక్షు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. జీ5 ఓటీటీతో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి మానస శర్మ రచయితగా.. సోనీ లివ్ రూపొందించిన ‘బెంచ్ లైఫ్’కి దర్శకురాలిగా పని చేశారు.
తాజాగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ న్యూ మూవీతో మానస శర్మ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్నారు. ఇక సంగీత్ శోభన్ విషయానికి వస్తే ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’లో ప్రధాన పాత్ర చేసిన విషయం తెలిసిందే. సంగీత్ శోభన్-నిహారిక కొణిదెల కాంబోలో వస్తున్న ఈ చిత్రానికి మానస శర్మ కథను అందించగా మహేష్ ఉప్పల కో రైటర్‌గా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు.
{{/usCountry}}తాజాగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ న్యూ మూవీతో మానస శర్మ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్నారు. ఇక సంగీత్ శోభన్ విషయానికి వస్తే ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’లో ప్రధాన పాత్ర చేసిన విషయం తెలిసిందే. సంగీత్ శోభన్-నిహారిక కొణిదెల కాంబోలో వస్తున్న ఈ చిత్రానికి మానస శర్మ కథను అందించగా మహేష్ ఉప్పల కో రైటర్‌గా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు.
{{/usCountry}}