Sign in

నిహారిక కొణిదెలతో మ్యాడ్ హీరో న్యూ మూవీ.. సోలో హీరోగా తొలి సినిమా.. లేడీ డైరెక్టర్ డెబ్యూ ఎంట్రీ!

మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరో సంగీత్ శోభన్ మెగా డాటర్ నిహారిక కొణిదెలతో కలిసి న్యూ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకు రచయిత, బెంచ్ లైఫ్ ఓటీటీ సిరీస్ డైరెక్టర్ మానస శర్మ దర్శకత్వం వహించారు. మూవీకి డైరెక్టర్‌గా ఆమె డెబ్యూ ఎంట్రీ ఇస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..!

Published on: Jun 27, 2025, 10:40:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2024లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవటమే కాదు.. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. యూత్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది.

మ్యాడ్ హీరోతో నిహారిక కొణిదెల న్యూ మూవీ.. సోలో హీరోగా తొలి సినిమా.. లేడీ డైరెక్టర్ డెబ్యూ ఎంట్రీ!
మ్యాడ్ హీరోతో నిహారిక కొణిదెల న్యూ మూవీ.. సోలో హీరోగా తొలి సినిమా.. లేడీ డైరెక్టర్ డెబ్యూ ఎంట్రీ!

గద్దర్ అవార్డ్స్

అలాగే, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అందించిన గద్దర్ అవార్డ్స్‌లో జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది కమిటీ కుర్రోళ్లు. అంతేకాకుండా మూవీ డైరెక్టర్ యదు వంశీకి ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా కూడా గద్దర్ అవార్డ్ వచ్చింది.

తొలి ప్రయత్నంలోనే అందరినీ మెప్పించిన సక్సెస్‌ఫుల్ బ్యానర్ పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్‌ నుంచి ఇప్పుడు రెండో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందనున్న రెండో సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

సోలో హీరోగా ఎంట్రీ

మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ప్రతిభావంతుడైన యువ కథానాయకుడు సంగీత్ శోభన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. సంగీత్ శోభన్ సోలో హీరోగా నటించనున్న తొలి సినిమా ఇదే. ఇదివరకే మెగా డాటర్ నిహారిక కొణిదెల రూపొందించిన వెబ్ ప్రాజెక్ట్స్‌లో హీరో సంగీత్ శోభన్, డైరెక్టర్ మానస శర్మ భాగమయ్యారు.

ఈ చిత్రంలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్‌గా నయన్ సారిక నటిస్తుంది. ఆయ్, క వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఈమె పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిర్మించిన జీ5 ఓటీటీ హలో వరల్డ్, సోనీ లివ్ బెంచ్ లైఫ్ ఓటీటీ సిరీస్‌లలో అలరించింది.

ఇదివరకు వెబ్ సిరీస్‌లో

నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, సుఖ్వీందర్ సింగ్, అరుణ భిక్షు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. జీ5 ఓటీటీతో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి మానస శర్మ రచయితగా.. సోనీ లివ్ రూపొందించిన ‘బెంచ్ లైఫ్’కి దర్శకురాలిగా పని చేశారు.

తాజాగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ న్యూ మూవీతో మానస శర్మ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్నారు. ఇక సంగీత్ శోభన్ విషయానికి వస్తే ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’లో ప్రధాన పాత్ర చేసిన విషయం తెలిసిందే. సంగీత్ శోభన్-నిహారిక కొణిదెల కాంబోలో వస్తున్న ఈ చిత్రానికి మానస శర్మ కథను అందించగా మహేష్ ఉప్పల కో రైటర్‌గా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More