వినే యాంకర్ ఉంటే వేణుస్వామి కూడా ఇంత చెప్పాడంట.. ఫన్నీగా సంతాన ప్రాప్తిరస్తు ట్రైలర్
తెలుగులో మరో కామెడీ డ్రామా వస్తోంది. వచ్చే వారం థియేటర్లలోకి రానున్న సంతాన ప్రాప్తిరస్తు ట్రైలర్ ను గురువారం (నవంబర్ 6) రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చాలా ఫన్నీగా, అదే సమయంలో ఎమోషనల్ గానూ సాగింది.
చాందినీ చౌదరి, విక్రాంత్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ సంతాన ప్రాప్తిరస్తు. ఈ సినిమా నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో గురువారం (నవంబర్ 6) మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చాలా ఫన్నీగా సాగిపోయింది. తరుణ్ భాస్కర్, వెన్నెల కిశోర్, అభినవ్ గోమటంలాంటి వాళ్లు తమ కామెడీ టైమింగ్ తో అదరగొట్టారు.

సంతాన ప్రాస్తిరస్తు ట్రైలర్
తెలుగులో వస్తున్న మరో కామెడీ ఎమోషనల్ డ్రామా సంతాన ప్రాప్తిరస్తు. ఈ సినిమా నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. సంజీవ్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో చాందినీ చౌదరి, విక్రాంత్ లీడ్ రోల్స్ లో నటించారు. వెన్నెల కిశోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్ లాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు.
ఈ సినిమా ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. దేవర స్టోరీ ప్రకాష్ రాజ్ చెబితే వినలేదా.. వినే యాంకర్ ఉంటే వేణుస్వామి కూడా ఇంత చెప్పాడంట అనే డైలాగులతో అభినవ్ గోమటం ట్రైలర్ మొదట్లోనే అదరగొట్టాడు. సగానికిపైగా ఫన్నీగా సాగిపోయిన ట్రైలర్.. చివర్లో కాస్త భావోద్వేగానికి గురి చేసింది.
పెద్దలను కాదని, ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట పిల్లల కోసం పడే తాపత్రయాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటంతో ఆ జంటకు పిల్లలు పుట్టడం కష్టంగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో ఆ జంట ఏం చేసింది? ఆ తర్వాత ఏం జరిగింది అన్నది ఈ సంతాన ప్రాప్తిరస్తు మూవీలో చూడొచ్చు.
సంతాన ప్రాప్తిరస్తు మూవీ గురించి..
సంతాన ప్రాప్తిరస్తు మూవీని సంజీవ్ రెడ్డి డైరెక్ట్ చేయగా.. మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. కామెడీ, ఎమోషన్ కలగలిపి సాగిన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. లోబడ్జెట్ మూవీ అయినా కూడా తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, వెన్నెల కిశోర్ లాంటి నటులు ఉండటంతో సినిమాలో నవ్వులు
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


