Saptagiri: మారుతి ఫోన్ చేసి సారీ చెప్పమన్నారు.. రాజా సాబ్ గురించి అలా అన్నందుకు క్షమించండి: కమెడియన్ సప్తగిరి
Saptagiri: ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మూవీని ఓ చిన్న సినిమా అని కామెంట్ చేసిన కమెడియన్ సప్తగిరి క్షమాపణ చెప్పాడు. డైెరెక్టర్ మారుతి ఫోన్ చేసి మరీ సారీ చెప్పమని అడిగినట్లు అతడు తాజాగా వెల్లడించాడు.
Saptagiri: టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ సప్తగిరి తెలుసు కదా? అతడు ఈ మధ్య పురుష: అనే మూవీ ప్రమోషన్లలో భాగంగా ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ ఓ చిన్న సినిమా అనే నోరు జారాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఇప్పుడు క్షమాపణ చెప్పాడు.

అది అలా వచ్చేసింది అంతే.. నిజంగా సారీ..
కమెడియన్ సప్తగిరి నటించిన లేటెస్ట్ మూవీ ‘పురుష:’. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడాడు. ఈ సందర్భంగా యాంకర్ మాట్లాడుతూ.. ఇంతకీ రాజా సాబ్ చిన్న సినిమానా పెద్ద సినిమానా అని అడగడంతో సప్తగిరి ముందు నవ్వాడు. నన్ను పట్టుకున్నావా అక్కా అని తనదైన స్టైల్లో అన్నాడు.
ఆ తర్వాత మాట్లాడుతూ.. ఈ మధ్య కొన్ని చిన్న బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నానని చెబుతూ కొన్ని సినిమాలు పేర్లు చెప్పాను. అందులో రాజా సాబ్ ను కలిపేశాను. రియల్లీ సారీ.. క్షమించండి అని అన్నాడు.
మారుతి ఫోన్ చేశారు
అప్పుడే యాంకర్ జోక్యం చేసుకుంటూ మారుతి గారు ఫోన్ చేశారా అని ప్రశ్నించింది. దీనికి సప్తగిరి స్పందిస్తూ.. “చేశారు.. సారీ చెప్పు తమ్ముడు అని అన్నారు. అప్పుడే అన్నకు సారీ చెప్పాను. ఇప్పుడు మీడియా ముఖంగా కూడా సారీ అడుగుతున్నాను. రాజా సాబ్ చిన్న బడ్జెట్ సినిమా అన్నందుకు క్షమించండి” అని సప్తగిరి మరోసారి క్షమాపణ కోరాడు.
అసలు ఏం జరిగిందంటే?
సప్తగిరి నటిస్తున్న ఇదే పురుష: మూవీ ప్రమోషన్లలో భాగంగా సప్తగిరి కొన్ని రోజుల కిందట మీడియాతో మాట్లాడాడు. ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు అన్న ప్రశ్నకు అతడు బదులిస్తూ.. నేను ఈ మధ్య సరస్వతి, రాజా సాబ్ కొక్కొరోకోలాంటి చిన్న సినిమాల్లో నటించాను. చిన్న సినిమాలు కాబట్టి జనాలకు పెద్దగా నేను కనిపించలేదు.. పెద్ద సినిమాల్లో నటిస్తే వాళ్లు గుర్తు పెట్టుకుంటారు అని అన్నాడు.
ఈ కామెంట్స్ కాస్తా తీవ్ర దుమారం రేపాయి. ప్రభాస్ ఫ్యాన్స్ అతన్ని ట్రోల్ చేశారు. రాజా సాబ్ ను చిన్న సినిమా, తక్కువ బడ్జెట్ సినిమా అంటావా అంటూ సప్తగిరితో ఆడుకున్నారు. ఏకంగా డైరెక్టర్ మారుతి కూడా రంగంలోకి దిగడంతో సప్తగిరి చివరికి క్షమాపణ చెప్పి ఈ వివాదానికి ముగింపు పలికాడు.
ది రాజా సాబ్ ఫెయిల్యూర్
నిజానికి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన హారర్ కామెడీ మూవీ ది రాజా సాబ్ బాక్సాఫీస్ దగ్గర మాత్రం పెద్ద ఫెయిల్యూర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మూవీ జనాలకు అస్సలు ఎక్కలేదు. దీంతో నిర్మాతలకు భారీ నష్టాలు ఎదురయ్యాయి. తర్వాత జియోహాట్‌స్టార్ ఓటీటీలో రికార్డులు తిరగరాసే వ్యూస్ సంపాదించినా.. థియేటర్లలో మాత్రం తీవ్ర నిరాశనే మిగిల్చింది. ప్రభాస్ కెరీర్లో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిపోయింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


