...
...
Next Story

సైన్స్‌కు సమాధానం దొరకనప్పుడు మూఢనమ్మకం అంటుంది- ఆది సాయి కుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల టీజర్ అదుర్స్- విజువల్స్ హైలెట్!

ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన న్యూ తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ శంబాల. ఏ మిస్టిక్ వరల్డ్ అనేది క్యాప్షన్. యుగంధన్ ముని దర్శకత్వం వహించిన శంబాల టీజర్ జూన్ 7న రిలీజ్ అయింది. హారర్ ఎలిమెంట్స్‌తో శంబాల టీజర్ అదిరిపోయేలా ఉంది. టీజర్‌లోని విజువల్స్ అయితే హైలెట్‌గా నిలిచాయి.

Published on: Jun 08, 2025 09:18 AM IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

రిలీజ్ డేట్

సైన్స్‌కు సమాధానం దొరకనప్పుడు మూఢనమ్మకం అంటుంది- ఆది సాయి కుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల టీజర్ అదుర్స్- విజువల్స్ హైలెట్!
సైన్స్‌కు సమాధానం దొరకనప్పుడు మూఢనమ్మకం అంటుంది- ఆది సాయి కుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల టీజర్ అదుర్స్- విజువల్స్ హైలెట్!

ఇక ఈ టీజర్‌తో శంబాల మూవీ మీద ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే శంబాల రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు మేకర్స్.

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ నటించిన న్యూ తెలుగు సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ. ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు.

శంబాల నటీనటులు

శంబాల సినిమాలో ఆది సాయి కుమార్‌తోపాటు అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్, ఇంద్రనీల్ వర్మ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటి వరకు ఈ ‘శంబాల’ నుంచి వచ్చిన పోస్టర్‌లు, పాత్రల్ని రివీల్ చేస్తున్న తీరు అందరిలోనూ ఆసక్తిని పెంచేసిన సంగతి తెలిసిందే.

మేకింగ్ వీడియోతో

రీసెంట్‌గానే ‘శంబాల’ మేకింగ్ వీడియోని కూడా రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. జూన్ 7న శంబాల టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ మూవీపై మరింతగా అంచానాలను పెంచేసింది.

అంతుపట్టని రహస్యాలెన్నో

శంబాల టీజర్ విషయానికొస్తే ‘ఈ విశ్వంలో అంతుపట్టని రహస్యాలెన్నో ఉన్నాయి.. సైన్స్‌కి సమాధానం దొరకనప్పుడు మూఢ నమ్మకం అంటుంది.. అదే సమాధానం దొరికితే అదే తన గొప్పదనం అంటుంది’ అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభం అవుతుంది.

పంచ భూతాలని శాసిస్తోందంటే

శంబాల టీజర్‌లో ప్రవీణ్ కే బంగారి అందించిన విజువల్స్ హైలెట్‌గా నిలిచాయి. ఒక సరికొత్త ఎక్స్‌పీరియన్స్ కలిగేలా ఆ విజువల్స్ అదిరిపోయాయి. ఇక శ్రీచరణ్ పాకాల ఇచ్చిన బీజీఎమ్ కూడా నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. పాన్ ఇండియన్ మూవీకి సరిపడా సబ్జెక్ట్, కంటెంట్ ఉందని ఈ టీజర్‌ చెప్పకనే చెప్పేస్తోంది.

అతీంద్రియ శక్తి గల ఉల్క

టీజర్‌లో అంతరిక్షం నుంచి ఏదో ఒక అతీంద్రయ శక్తి ఉన్న ఉల్క, రాయి లాంటిది ఓ గ్రామంలో పడటం.. దాని ప్రభావంతో ఊర్లోని జనాలు చనిపోవడం, వింతగా ప్రవర్తించడం జరుగుతుంటుంది. దాన్ని ఛేదించేందుకు హీరో రావడం.. ఓ ఊరితో పోరాటం చేయడం వంటి ఆసక్తికరమైన అంశాలతో శంబాలను తెరకెక్కిస్తున్నారని టీజర్ చూస్తే అర్థం అవుతోంది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe