రెండేళ్లలో 22 కిలోల బరువు తగ్గిన శర్వానంద్.. ఎలాగో చెప్పిన యంగ్ హీరో.. ఆ యాక్సిడెంటే మొత్తం మార్చేసింది

టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ తన బైకర్ మూవీ కోసం రెండేళ్లలో ఏకంగా 22 కిలోల బరువు తగ్గాడంటే నమ్మగలరా? ఈ సినిమా కోసం అతడు స్లిమ్ లుక్ లో కనిపించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఇది ఎలా సాధ్యమైందో అతడు చెప్పాడు.

Published on: Nov 7, 2025, 22:24:06 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శర్వానంద్‌ను ఈ మధ్య బైకర్ మూవీ ప్రమోషన్లలో చూసిన అభిమానులు షాక్ తిన్నారు. అతడేంటి ఇంత సన్నగా ఎలా అయ్యాడని ఆశ్చర్యపోయారు. అయితే తాజాగా హైదరాబాద్ టైమ్స్ ఇంటర్వ్యూలో అతడు తన వెయిట్ లాస్ జర్నీ గురించి షేర్ చేసుకున్నాడు. 8 నెలల పాటు తాను ఎంతలా కష్టపడిందీ చెప్పాడు. ఒక్క యాక్సిడెంట్ మొత్తం మార్చేసిందని అన్నాడు.

రెండేళ్లలో 22 కిలోల బరువు తగ్గిన శర్వానంద్.. ఎలాగో చెప్పిన యంగ్ హీరో.. ఆ యాక్సిడెంటే మొత్తం మార్చేసింది
రెండేళ్లలో 22 కిలోల బరువు తగ్గిన శర్వానంద్.. ఎలాగో చెప్పిన యంగ్ హీరో.. ఆ యాక్సిడెంటే మొత్తం మార్చేసింది

రెండేళ్లలో 22 కిలోలు

బైకర్ మూవీ కోసం శర్వానంద్ పూర్తి బక్కపల్చగా మారిపోయిన సంగతి తెలుసు కదా. అయితే రెండేళ్ల కిందట 92 కిలోల బరువున్న అతడు.. దీనికోసం ఏకంగా 22 కిలోలు తగ్గడం విశేషం. అయితే అది ఎలా సాధ్యమైందన్నది తాజా ఇంటర్వ్యూలో అతడు చెప్పాడు. దానికి ఒక యాక్సిడెంట్ ఎలా కారణమైందీ వివరించాడు. “ఆ ప్రమాదం మొత్తం మార్చేసింది. నెలల పాటు యాంటీబయోటిక్స్ పై ఉన్నాను. చాలా ఆకలిగా అనిపించేది.

దీంతో తింటూ వెళ్తే బరువు పెరుగుతూ వెళ్లాను. చాలా రోజుల పాటు ఎలా అయ్యానో గుర్తించలేదు” అని శర్వానంద్ చెప్పాడు. రెండేళ్ల కిందట బైకర్ మూవీ ఆఫర్ వచ్చినప్పుడు అందులో 18 ఏళ్ల కుర్రాడిలా కనిపించాల్సి రావడంతో తన వెయిట్ లాస్ జర్నీ మొదలుపెట్టాడు. దీనికోసం చాలా కఠినంగా శ్రమ పడాల్సి వచ్చిందని అన్నాడు.

8 నెలల పాటు అలాగే..

శర్వానంద్ ఈ సినిమా కోసమే కాదు వ్యక్తిగతంగా కూడా బరువు తగ్గాలన్న లక్ష్యంతో క్రమశిక్షణగా, నిలకడగా ఆ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ప్రతి రోజూ ఉదయాన్ని 4.30 గంటలకే లేచి, కేబీఆర్ పార్క్ చుట్టూ పరుగు ప్రారంభించాడు. ఆ తర్వాత జిమ్ లో గంటల తరబడి కసరత్తులు చేశాడు. సుమారు 8 నెలల పాటు తాను ఇదే రొటీన్ ఫాలో అయ్యానని, ఒక్క రోజు కూడా మిస్ చేయలేదని అతడు చెప్పాడు. ఈ రొటీన్ తనకు ఓపిక, ఫోకస్ నేర్పాయని తెలిపాడు.

కూతురి కోసం మరింతగా..

బైకర్ మూవీ కోసమే కాదు.. తనకు కూతురు పుట్టిన తర్వాత తన కుటుంబం కోసం కూడా ఆరోగ్యంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు అతడు చెప్పాడు. అంతేకాదు ప్రతి ఒక్కరూ తమ శరీరం బాగుండేలా చూసుకోవాలని, తాను ఆ పని చేయగలిగినప్పుడు ఎవరైనా చేయగలరని అన్నాడు. “ఇంతకుముందు ఓ పాత్ర కోసం ఫిట్‌గా ఉండాలని అనుకునే వాడిని. ఇప్పుడు నా కుటుంబం కోసం ఉండాలనుకుంటున్నాను” అని శర్వానంద్ స్పష్టం చేశాడు.

డైట్ కూడా ముఖ్యమే..

శర్వానంద్ వెయిట్ లాస్ జర్నీలో డైట్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. నిజానికి బరువు తగ్గడంలో ట్రైనింగ్ ది 30 శాతం అయితే.. తినే ఆహారానిదే 70 శాతం అని అతడు చెప్పాడు. ఆహారం విషయంలో తనను తాను చాలా కంట్రోల్ చేసుకున్నానని తెలిపాడు. దీంతో రెండేళ్లలోనే తాను 22 కిలోల బరువు తగ్గినట్లు చెప్పాడు. బైకర్ మూవీ కోసం అసలైన లుక్ ను తాను సొంతంగా సాధించాలని అనుకున్నానని శర్వా తెలిపాడు. బైకర్ మూవీ డిసెంబర్ 6న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆ తర్వాత నారీ నారీ నడుమ మురారీ, భోగి సినిమాలతోనూ అతడు బిజీగా ఉన్నాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More