నిర్మాతకు రూ. 4 కోట్లు తిరిగి ఇచ్చేసిన హీరో సిద్ధు జొన్నలగడ్డ.. అసలు జాక్ పారితోషికం ఎంతో తెలుసా?
స్టార్ బాయ్ సిద్ధు తన మంచి మనసు చాటుకున్నాడు. నష్టాల్లో ఉన్న నిర్మాతకు తన పారితోషికం నుంచి రూ. 4 కోట్లు తిరిగి ఇచ్చేశాడు. ఇటీవల థియేటర్లలో విడుదలైన జాక్ మూవీ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో నిర్మాతకు నష్టాలు వచ్చాయి. దాంతో జాక్ నిర్మాతలకు సిద్ధు జొన్నల గడ్డ తన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేశాడు.
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ టాలీవుడ్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. నటుడిగా, విలన్‌గా మెప్పించిన సిద్ధు జొన్నలగడ్డ లవ్ రొమాంటిక్ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. పలు ఓటీటీ సినిమాలతో యూత్‌ను బాగా అట్రాక్ట్ చేశాడు. ఇక డీజే టిల్లు మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు సిద్ధు జొన్నలగడ్డ.

100 కోట్లకుపైగా కలెక్షన్స్
ఆ తర్వాత టిల్లు స్క్వేర్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని తానేంటో నిరూపించుకున్నాడు. ఏకంగా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి వంద కోట్ల క్లబ్‌లో తన సినిమా నిలిచేలా చేశాడు సిద్ధు జొన్నలగడ్డ. దాంతో సిద్దు జొన్నలగడ్డ తర్వాతి సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగాయి.
పెరిగిన అంచనాలు
ఈ క్రమంలోనే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడని అనౌన్స్‌మెంట్ రాగానే ఆ అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ సినిమానే జాక్. అయితే, ఆ అంచనాలను జాక్మూవీ ఆశించిన స్థాయిలో అందుకోలేకపోయింది.
మంచి మనసుతో
కానీ, టాలీవుడ్‌లోని యువ కథానాయకుల్లో ఒకరైన సిద్ధు జొన్నలగడ్డ తన నటనతోనే కాకుండా తాజాగా తన మంచి మనసుతో కూడా అందరి గుండెల్లో చోటు సంపాదించాడు. ఈ ఏడాది ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన జాక్ సినిమా ఆశించిన ఫలితాలను రాబట్టకపోవడంతో నిర్మాతలకు భారీ నష్టం జరిగింది.
4 కోట్ల రెమ్యునరేన్ వెనక్కి
దీంతో తన వంతు బాధ్యతగా సిద్ధు జొన్నలగడ్డ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. తన పారితోషికం నుండి సగం అంటే 4 కోట్ల రూపాయలను నిర్మాతకు తిరిగి ఇచ్చి తన పెద్ద మనసును చాటుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఈ పని సినీ పరిశ్రమలో అరుదైన, ఆదర్శనీయమైన ఉదాహరణగా నిలిచింది అని పలువురు చెబుతున్నారు.
సిద్ధుపై ప్రశంసలు
సిద్ధు జొన్నలగడ్డ ఈ విధమైన బాధ్యతాయుతమైన, నీతిగల నిర్ణయంతో నెటిజన్లు, సినీ ప్రముఖులు, అభిమానులు అందరూ ఆశ్చర్యపోయి, అతని మంచితనాన్ని ఆకాశానికెత్తేస్తున్నారు. అలాగే, సోషల్ మీడియాలో సిద్దుపై ప్రశంసలు కురుస్తున్నాయి. "సిద్దు లాంటి నటులు నిర్మాతలకు అండగా నిలిస్తే, సినీ పరిశ్రమ మరింత విజయవంతమవుతుంది" అని అభిమానులు, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సిద్ధు జాక్ రెమ్యునరేషన్
సిద్దు జొన్నలగడ్డ చేసిన మంచి పనికి తనను కేవలం ఒక నటుడిగా కాక, ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా, సినీ పరిశ్రమకు ఆదర్శంగా నిలిపింది. ఇదిలా ఉంటే, ఈ నేపథ్యంలో జాక్ మూవీకి సిద్ధు జొన్నలగడ్డ తీసుకున్న మొత్తం రెమ్యునరేషన్ ఎంతనేది ఆసక్తిగా మారింది. నిర్మాతకు తన పారితోషికంలో సగం నాలుగు కోట్లు ఇచ్చాడంటే అసలు రెమ్యునరేషన్ రూ. 8 కోట్లు అని తెలుస్తోంది.
తెలుసు కదా మూవీ
కాగా, నెట్‌ఫ్లిక్స్‌లో జాక్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తర్వాత చేస్తున్న సినిమా తెలుసు కదా. ఈ మూవీ అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై కూడా అందరిలో ఆసక్తి నెలకొంది. మరి తెలుసు కదా మూవీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



