ఓటీటీ ట్రెండింగ్‌లో దంచికొడుతోన్న 200 కోట్ల ఫ్లాప్ సినిమా- థియేటర్లలో డిజాస్టర్- ఐఎమ్‌డీబీలో చెత్త రేటింగ్!

ఓటీటీలో ఓ సినిమా దంచికొడుతోంది. మొన్నటి వరకు టాప్ 1 ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోయిన ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ వచ్చేసరికి టాప్ 2లోకి వెళ్లిపోయింది. ఓటీటీ రిలీజ్‌కు వచ్చిన రెండో రోజు నుంచి టాప్ 1లో ట్రెండింగ్‌లో ఉన్న ఆ 200 కోట్ల సినిమా, దాని ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: May 31, 2025, 05:30:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీ రెస్పాన్స్‌కు థియేటర్ల టాక్‌కు భిన్నంగా సినిమాల ఫలితాలు ఉంటాయి. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. థియేటర్లలో డిజాస్టర్స్‌గా నిలిచిన ఎన్నో సినిమాలు ఓటీటీలో మాత్రం దుమ్ములేపుతుంటాయి. అలాగే, కొన్నిసార్లు మాత్రం బాక్సాఫీస్ కలెక్షన్స్‌తో అదరగొట్టిన మూవీస్ సైతం ఓటీటీలో మిశ్రమ స్పందన తెచ్చుకుంటాయి.

ఓటీటీ ట్రెండింగ్‌లో దంచికొడుతోన్న 200 కోట్ల ఫ్లాప్ సినిమా- థియేటర్లలో డిజాస్టర్- ఐఎమ్‌డీబీలో చెత్త రేటింగ్!
ఓటీటీ ట్రెండింగ్‌లో దంచికొడుతోన్న 200 కోట్ల ఫ్లాప్ సినిమా- థియేటర్లలో డిజాస్టర్- ఐఎమ్‌డీబీలో చెత్త రేటింగ్!

రెండు విభిన్న ఫలితాలు

ఏ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో ఇటీవల కాలంలో చెప్పలేకుండా ఉంది. ఇదిలా ఉంటే, రీసెంట్‌గా ఓ సినిమా కూడా ఇలాంటి రెండు విభిన్నమైన ఫలితాలను చవిచూసింది. రూ. 200 కోట్ల బడ్జెట్ పెట్టిన తీసిన ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడిపోయింది. కానీ, ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాక మాత్రం దంచికొడుతోంది.

చాలా కాలం గ్యాప్ తర్వాత

ఆ సినిమా మరేదో కాదు సికందర్. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తొలిసారి జోడి కట్టిన సినిమా ఇది. అలాగే, ఇందులో బ్యూటిఫుల్ కాజల్ అగర్వాల్ మరో హీరోయిన్‌గా నటించడం విశేషం. చాలా కాలం గ్యాప్ తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహించిన సినిమా సికందర్.

పెట్టిన బడ్జెట్ కూడా

ఇలా ఎన్నో విశేషాలు ఉన్న సికందర్ భారీ అంచనాలతో థియేటర్లలో మార్చి 30న విడుదలైంది. అయితే, పూర్తిగా నెగెటివ్ టాక్ తెచ్చుకుని సికందర్ డిజాస్టర్‌గా మిగిలింది. రొటీన్ కథ, యాక్షన్, సీన్స్‌తో బాలీవుడ్ ప్రేక్షకులకు బోర్ కొట్టించింది. రూ. 200 కోట్లతో తీసిన సికందర్‌ సినిమాకు బడ్జెట్ అంత కూడా కలెక్షన్స్ రాలేదని సమాచారం.

6 శాతమే ఫ్రెష్ కంటెంట్

అలాగే, ఐఎమ్డీబీ నుంచి పదికి 4లో అత్యంత చెత్త రేటింగ్‌ను సికందర్ మూవీ నమోదు చేసుకుంది. ఇక ఫ్రెష్ కంటెంట్‌పై సర్టిఫికేట్ ఇచ్చే రొట్టెన్ టోమాటోస్ కేవలం 6 శాతం మాత్రమే తాజా కంటెంట్ అని డిక్లేర్ చేసింది. ఇలాంటి నెగెటివ్ టాక్ ఉన్న సికందర్ నెట్‌ఫ్లిక్స్‌లో మే 25న ఓటీటీ రిలీజ్ అయింది.

మొదట ఓటీటీ టాప్ 1లో

హిందీ, అరబిక్ (సిరియా), జులు వంటి 3 భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో సికందర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ రిలీజ్ అయిన రెండో రోజు నుంచే సికందర్ ఓటీటీ టాప్ 1 ట్రెండింగ్‌లో దంచికొట్టింది. మొన్నటి (మే 29) వరకు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ టాప్ 1 స్థానంలో సికందర్ నిలిచి సత్తా చాటింది.

ఇప్పుడు టాప్ 2లో సికందర్

కానీ, నిన్నటి (మే 30) నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ టాప్ 1 నుంచి టాప్ 2 స్థానంలోకి వెనక్కి వెళ్లింది సికందర్. దానికి కారణం నాని హిట్ 3 మూవీ ఓటీటీ టాప్ 1 స్థానంలో ట్రెండింగ్ అవడమే. హిట్ 3 మూవీతో నెట్ఫ్లిక్స్ టాప్ 2 ప్లేస్‌లో సికందర్ మూవీ దంచికొడుతోంది. థియేటర్ టాక్ ఎలా ఉన్న నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రం యాక్షన్ థ్రిల్లర్ మూవీ సికందర్ ఓటీటీ ట్రెండింగ్‌లో సత్తా చాటుతోంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More