ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా- పాప కోసం రెండు కుటుంబాల ఆరాటం, గొడవ- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఇవాళ తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మూవీ సింధు స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఓ పాప కోసం రెండు కుటుంబాలు ఆరాట పడటం, గొడవ పడటం వంటి అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. మరి స్వచ్ఛమైన తెలుగు కథతో తీసిన సింధు ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఓటీటీలో తెలుగు కంటెంట్ రోజు రోజుకీ బాగా విస్తరిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్, హారర్ నుంచి ఫ్యామిలీ డ్రామా వరకు ఎన్నో రకాల జోనర్లలో తెలుగు ఓటీటీ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే, ప్రతి ఆదివారం సరికొత్త కథతో ఓటీటీ మూవీ స్ట్రీమింగ్‌కు వస్తున్న విషయం తెలిసిందే.

తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
ఈ క్రమంలోనే ఇవాళ అంటే డిసెంబర్ 14న సరికొత్తగా తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రం ఒకటి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆ సినిమానే సింధు. ఒక పాప కోసం రెండు కుటుంబాలు పడే ఆరాటాన్ని, గొడవలను ఇందులో చూపించారు. అసలు ఆ పాప ఎవరు, ఏ కుటుంబానికి చెందినది అనేదే ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్‌గా తెలుస్తోంది.
సింధు నటీనటులు
సింధు సినిమాకు సతీష్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మధునందన్, లావణ్య రెడ్డి, సీవీఎల్ నరసింహ రావు, బేబీ భూమి ప్రధాన పాత్రలు పోషించారు. వీరితోపాటు ఆర్కే నాయుడు, కెఎల్‌కే మణి, గౌతమి దాస్, విజయ్ వర్మ, పీకే కమల్, రామ్ నాయుడు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
జాయ్ సోలోమన్ సంగీతం
అలాగే, సింధు సినిమాకు దేవరాజ్ పోతూరు, పవిత్ర పోతూరు నిర్మాతలుగా వ్యవహరించారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఆదిత్య రామ్ వర్మ ఉన్నారు. జాయ్ సోలోమన్ సంగీతం అందించిన ఈ సినిమాకు రవీంద్రనాథ్ టీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఎడిటర్‌గా అల్లూరి అనిల్ కుమార్ వర్మ వర్క్ చేశారు.
ఈటీవీ విన్ ఓటీటీలో
బెదార్కర్ కృష్ణవేణి కథ అందించిన సింధు ఓటీటీలోకి ఇవాళ వచ్చేసింది. అచ్చ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో సింధు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. రెండు కుటుంబాల మధ్య అద్భుతమైన భావోద్వేగంతో సాగేలా సింధు చిత్రాన్ని రూపొందించారు.
సింధు మూవీ కథ
సింధు కథలోకి వెళితే.. ఓ పాపను కూతురుకంటే అపురూపంగా ఓ జంట చూసుకుంటుంది. తమ జీవితాన్ని ఆ పాపకే అంకితం ఇచ్చినట్లుగా పెంచుతారు. ఈ సమయంలో ఆ పాప తన మనవరాలిలా ఉందని ఓ పెద్దాయన పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇస్తాడు. ఆ తర్వాత ఆ పాప ఎవరు అనేది థ్రిల్లింగ్ ఎలిమెంట్.
సింధు ఓటీటీ రిలీజ్
ఆ పాప కోసం రెండు కుటుంబాలు పడే గొడవ, ఆరాటం, ఎమోషన్స్‌తో సింధు సినిమా సాగినట్లుగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. కేవలం 34 నిమిషాల రన్‌టైమ్‌తో సాగే సరికొత్త ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామ చూడాలనుకునే వారు ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న సింధు సినిమాపై లుక్కేయొచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


