యూట్యూబ్‌లో ఉన్న మూవీ ఇప్పుడు ఓటీటీలోకి.. మాట మార్చిన స్టార్ హీరో.. స్ట్రీమింగ్ తేదీ ఇదే.. పది నెలల తర్వాత..

sitaare zameen par ott release: యూట్యూబ్‌లో రెంట్ విధానంలో ఇన్నాళ్లూ అందుబాటులో ఉన్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. అసలు ఈ మూవీ ఎప్పటికీ ఓటీటీలోకి రాదన్న స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఇప్పుడు మాట మార్చి సోనీ లివ్ ఓటీటీలోకి తీసుకురానున్నాడు.

Published on: Mar 23, 2026, 16:38:06 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నటించిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా 'సితారే జమీన్ పర్' ఎట్టకేలకు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. చాలా రోజుల పాటు థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా రన్ అయిన ఈ సినిమా, డిజిటల్ రిలీజ్ విషయంలో కూడా ఒక సరికొత్త ప్రయోగానికి తెరతీసింది. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ ఈ సినిమాను ఏప్రిల్ 3 నుంచి తమ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. గతేడాది జూన్ 20న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు దాదాపు పది నెలల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. ఫైనల్‌గా ఇప్పుడు సబ్‌స్క్రిప్షన్ బేస్డ్ ఓటీటీలో అందుబాటులోకి వస్తోంది.

యూట్యూబ్‌లో ఉన్న మూవీ ఇప్పుడు ఓటీటీలోకి.. మాట మార్చిన స్టార్ హీరో.. స్ట్రీమింగ్ తేదీ ఇదే.. పది నెలల తర్వాత..
యూట్యూబ్‌లో ఉన్న మూవీ ఇప్పుడు ఓటీటీలోకి.. మాట మార్చిన స్టార్ హీరో.. స్ట్రీమింగ్ తేదీ ఇదే.. పది నెలల తర్వాత..

సితారే జమీన్ పర్ ఓటీటీ వివరాలు

ఆమిర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్ సినిమా ఓటీటీ డిస్ట్రిబ్యూషన్ విషయంలో అతడు చేసిన ఒక ప్రయోగం ఇండస్ట్రీలో పెద్ద చర్చే లేవనెత్తింది. థియేటర్ల వ్యవస్థను కాపాడాలనే ఉద్దేశ్యంతో.. అతడు మొదట రెగ్యులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను కాదని 'ట్రాన్సాక్షనల్ వీడియో ఆన్ డిమాండ్' పద్ధతిని ఫాలో అయ్యాడు.

ఆగస్టు 1న 'ఆమిర్ ఖాన్ టాకీస్' యూట్యూబ్ ఛానెల్‌లో కేవలం రూ.100 చెల్లించి ఈ సినిమాను అద్దెకు చూసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇది తన ప్రైవేట్ సినిమా చైన్ అని, థియేటర్ బిజినెస్‌ను బతికించడానికే ఈ ప్రయోగం చేస్తున్నానని అప్పట్లో ఆమిర్ ఖాన్ చెప్పాడు.

కానీ ఆ తర్వాత తను తీసుకున్న నో-ఓటీటీ నిర్ణయాన్ని మార్చుకుని, ఇప్పుడు సోనీ లివ్‌తో ఈ లైసెన్స్ డీల్ కుదుర్చుకున్నాడు. ఒక బాలీవుడ్ సూపర్ స్టార్ నటించిన ఇంత పెద్ద థియేట్రికల్ సినిమా నేరుగా సోనీ లివ్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా లాంచ్ అవ్వడం ఆ ప్లాట్‌ఫామ్‌కు కూడా ఒక పెద్ద మైలురాయి లాంటిది.

సితారే జమీన్ పర్ మూవీ విశేషాలు

2018లో స్పానిష్ భాషలో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన క్యాంపియోన్స్ సినిమాకు ఇది అఫీషియల్ రీమేక్. శుభ్ మంగళ్ సావధాన్ ఫేమ్ ఆర్.ఎస్. ప్రసన్న ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. బాగా ఇగో, కోపం ఉన్న ఒక అసిస్టెంట్ బాస్కెట్‌బాల్ కోచ్ గుల్షన్ అరోరా (ఆమిర్ ఖాన్) చుట్టూ ఈ కథ సాగుతుంది.

తన బాస్‌తో గొడవ పడటం, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ అవ్వడంతో అతనికి కోర్టు 90 రోజుల పాటు కమ్యూనిటీ సర్వీస్ చేయాలని శిక్ష విధిస్తుంది. నరాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న పది మంది పెద్దవాళ్లతో ఉన్న ఒక బాస్కెట్‌బాల్ టీమ్‌కు అతను కోచ్‌గా వెళ్లాల్సి వస్తుంది.

2007లో ఆమిర్ ఖాన్ తీసిన మాస్టర్ పీస్ 'తారే జమీన్ పర్' సినిమాకు ఇది ఒక స్పిరిచ్యువల్ సీక్వెల్ లాంటిది. అయితే అందులో పిల్లల్లో ఉండే డిస్లెక్సియా గురించి చెబితే, ఇందులో మాత్రం పెద్దవాళ్లలో ఉండే న్యూరోడైవర్సిటీ, అలాగే వాళ్లను సొసైటీలో ఎలా కలుపుకుపోవాలి అనే విషయాలను చూపించారు.

జెనీలియా దేశ్‌ముఖ్ ఈ సినిమాలో సునీత అనే మెయిన్ రోల్ చేసింది. స్క్రీన్ మీద ఆమె ఆమిర్ ఖాన్ భార్యగా కనిపిస్తుంది. వీళ్లతో పాటు గుర్పాల్ సింగ్, బ్రిజేంద్ర కాలా, డాలీ అహ్లువాలియా ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

అలాగే ఆరూష్ దత్తా (సత్బీర్), గోపి కృష్ణ వర్మ (గుడ్డు), సంవిత్ దేశాయ్ (కరీమ్), వేదాంత్ శర్మ (బంటు), ఆయుష్ భన్సాలీ (లోటస్), ఆశిష్ పెండ్సే (సునీల్), రిషి షహానీ (శర్మాజీ), రిషభ్ జైన్ (రాజు), నమన్ మిశ్రా (హరగోవింద్), సిమ్రాన్ మంగేష్కర్ (గోలు) లాంటి పది మంది నిజమైన న్యూరోడైవర్స్ యాక్టర్స్ ఈ సినిమాలో కీలక పాత్రలు చేయడం విశేషం.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More