Spider Man Leak: ఆరు రోజుల్లోనే బిలియన్ డాలర్ల వసూళ్ల స్పైడర్ మ్యాన్.. ఆన్‌లైన్‌లో లీక్.. నెటిజన్ల రియాక్షన్ ఇలా

Spider Man Leak: బాక్సాఫీస్ దగ్గర రికార్డుల సునామీ క్రియేట్ చేస్తున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అప్పుడే ఆన్‌లైన్ లో లీకవడం కలకలం సృష్టిస్తోంది. దీనిపై స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు.

Published on: Aug 5, 2026, 21:57:45 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Spider Man Leak: ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రికార్డు కలెక్షన్లతో సంచలనం సృష్టిస్తున్న 'స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే' (Spider-Man: Brand New Day) చిత్రానికి పెద్ద షాక్ తగిలింది. బాక్సాఫీస్ దగ్గర కేవలం 6 రోజుల్లోనే 1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.9,500 కోట్లకు పైగా) మార్కును దాటేసిన ఈ మార్వెల్ బ్లాక్‌బస్టర్ సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయింది. పైరసీ కాపీ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో మార్వెల్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Spider Man Leak: బిలియన్ డాలర్ల స్పైడర్ మ్యాన్.. అప్పుడే ఆన్‌లైన్‌లో లీక్.. నెటిజన్ల రియాక్షన్ ఇలా (Screengrab from YouTube/Sony Pictures Entertainment)
Spider Man Leak: బిలియన్ డాలర్ల స్పైడర్ మ్యాన్.. అప్పుడే ఆన్‌లైన్‌లో లీక్.. నెటిజన్ల రియాక్షన్ ఇలా (Screengrab from YouTube/Sony Pictures Entertainment)

4 గంటల్లో 8 లక్షల వ్యూస్.. లీక్ చేసిన వ్యక్తిపై ఫైర్

ఈ పైరసీ వీడియో సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ కావడమే కాకుండా కేవలం 4 గంటల్లోనే దాదాపు 8 లక్షల వ్యూస్ దక్కించుకుంది. అయితే పైరసీని ప్రోత్సహించే వారిపై సాధారణ నెటిజన్లు, స్పైడర్‌మ్యాన్ డైహార్డ్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

"ఇది కాపీరైట్ చట్టాల ఉల్లంఘన.. లీక్ చేసిన వారిపై కఠినమైన లీగల్ యాక్షన్ తీసుకోవాలి" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వెంటనే ఆ వీడియోను డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాల్సిన బిగ్ స్క్రీన్ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇలాంటి లో-క్వాలిటీ ఫోన్ వీడియోల్లో చూసి వేస్ట్ చేసుకోవద్దని కోరుతున్నారు.

లీక్ అయిన వీడియోలో షాకింగ్ ట్విస్ట్

ఇక లీక్ అయిన వీడియో నిడివిని గమనిస్తే అది కేవలం 2 గంటల 16 నిమిషాలు మాత్రమే ఉంది. కానీ ఒరిజినల్ 'స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే' సినిమా థియేట్రికల్ రన్‌టైమ్ 2 గంటల 40 నిమిషాలు కావడం విశేషం.

దీంతో లీక్ అయిన వీడియో అసలైన కంప్లీట్ మూవీ కాదని, చాలా ముఖ్యమైన సీన్లు కట్ అయిన ఎడిటెడ్ వర్షన్ అని నెటిజన్లు క్లారిటీ ఇస్తున్నారు. లీక్ చేసిన వ్యక్తి సగం సగం ఫుటేజ్‌తో హల్‌చల్ చేస్తున్నాడని మార్వెల్ లవర్స్ చెబుతున్నారు.

'అవెంజర్స్ ఎండ్‌గేమ్' రికార్డులపై దాడి

లీక్ వివాదం పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా క్రియేట్ చేస్తున్న సునామీ మామూలుగా లేదు. కేవలం 6 రోజుల్లోనే 1 బిలియన్ డాలర్ల బెంచ్‌మార్క్ క్రాస్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు హిస్టరీలో 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' (5 రోజుల్లో 1 బిలియన్ డాలర్లు) మాత్రమే దీనికంటే వేగంగా ఈ మార్కును అందుకుంది.

యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ వీకెండ్ ఏకంగా 360 మిలియన్ డాలర్లు వసూలు చేసి 'అవెంజర్స్ ఎండ్‌గేమ్' (357.1 మిలియన్ డాలర్లు) ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టింది. సోమవారం నాటి కలెక్షన్లలో 46 మిలియన్ డాలర్లు సాధించి 'బ్లాక్ పాంథర్' రికార్డును కూడా తుడిచిపెట్టేసింది.

ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.360 కోట్ల గ్రాస్ విధ్వంసం

ఇండియన్ మార్కెట్‌లో కూడా టామ్ హాలాండ్ (Tom Holland), జెండాయా (Zendaya) క్రేజ్ నెక్స్ట్ లెవెల్‌లో పనిచేసింది. ఇండియాలో తొలిరోజే గురువారం నాడు రూ.60.60 కోట్ల భారీ నెట్ కలెక్షన్‌తో ఖాతా తెరిచింది.

శుక్రవారం రూ.49.35 కోట్లు, శనివారం రూ.70.25 కోట్లు, ఆదివారం రూ.77.75 కోట్ల వసూళ్లతో వీకెండ్‌లో సునామీ సృష్టించింది. సోమ, మంగళవారాల్లో కూడా స్థిరంగా రూ.23.80 కోట్లు, రూ.21.50 కోట్లు రాబట్టింది. మొత్తంగా 6 రోజుల్లో ఇండియాలో రూ.303.25 కోట్ల నెట్ (రూ.362.61 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురిచేసింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More