Triptii Dimri: యానిమల్ బోల్డ్ సీన్స్ ట్రోలింగ్‌పై తృప్తి దిమ్రి షాకింగ్ కామెంట్స్.. మగవాళ్లకు లేని రూల్స్ మాకెందుకు?
Triptii Dimri Animal movie comments: స్పిరిట్ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న తృప్తి దిమ్రి షాకింగ్ కామెంట్లు చేసింది. యానిమల్ మూవీలో బోల్డ్ సీన్స్ చేసినందుకు వస్తున్న ట్రోల్స్ పై ఫైర్ అయింది. ఆమె చేసిన వ్యాఖ్యల గురించి ఇక్కడ చదివేయండి.
Triptii Dimri Animal movie comments: 'యానిమల్' మూవీతో ఓవర్‌నైట్ నేషనల్ క్రష్‌గా మారిన బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రి (Triptii Dimri) తనపై వస్తున్న విమర్శలపై ఎట్టకేలకు నోరు విప్పింది. ముఖ్యంగా ఆ సినిమాలో రణబీర్ కపూర్‌తో చేసిన బోల్డ్ సీన్స్, నెటిజన్ల ట్రోలింగ్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

తృప్తి దిమ్రి ఆవేదన
సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్‌లో వచ్చిన 'యానిమల్' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో 'జోయా రియాజ్' పాత్రలో నటించిన తృప్తి దిమ్రికి క్రేజ్ ఎంత వచ్చిందో, అంతే స్థాయిలో నెగెటివిటీ కూడా వచ్చింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ట్రోలింగ్‌పై ఆమె ఘాటుగా స్పందించింది.
మనసును గాయపరుస్తాయి
"ట్రోల్స్ నన్ను బాధించవని పైకి గంభీరంగా నటించగలను, కానీ ప్రాక్టికల్‌గా అది అబద్ధం. ఎక్కడో ఒకచోట ఆ నెగెటివ్ కామెంట్స్ మనసును గాయపరుస్తాయి" అంటూ తృప్తి తన బాధను పంచుకుంది. యానిమల్ మూవీలో తన క్యారెక్టర్ ను బేస్ చేసుకుని ట్రోల్స్ చేయడంపై ఆమె ఫైర్ అయింది.
మహిళలపైనే ఆ వివక్ష ఎందుకు?
ఇక్కడే తృప్తి దిమ్రి ఒక కీలకమైన పాయింట్‌ను లేవనెత్తింది. ఇది కేవలం బాలీవుడ్‌కే కాదు, టాలీవుడ్‌కు కూడా వర్తిస్తుంది.
"సినిమాల్లో ఒక స్టార్ హీరో లేదా పురుష నటుడు బోల్డ్ క్యారెక్టర్స్ చేసినప్పుడు, ఇంటిమేట్ సీన్స్‌లో నటించినప్పుడు ప్రేక్షకులు చప్పట్లు కొడతారు. కానీ ఒక మహిళా నటి అదే పని చేస్తే ఎందుకు అంత ఈజీగా జడ్జ్ చేస్తారు? సమాజంలో మహిళలపై ఈ ద్వంద్వ ప్రమాణాలు (Double Standards) ఎందుకు?" అని ఆమె నిలదీసింది.
హాట్ టాపిక్ గా
గ్లామర్ రోల్స్ లేదా బోల్డ్ సీన్స్ చేసినప్పుడు సౌత్ కమ్యూనిటీలో కూడా హీరోయిన్లపై ఇలాంటి ‘పబ్లిక్ టాక్’ (Public Talk) రావడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. తృప్తి లేవనెత్తిన ఈ ప్రశ్న ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఆమె కామెంట్లు వైరల్ గా మారాయి.
స్పిరిట్ షూటింగ్ లో
ప్రస్తుతం తృప్తి దిమ్రి బిజీగా మారిపోయింది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘స్పిరిట్’లో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది మార్చిలో స్పిరిట్ రిలీజ్ కానుంది.
నెట్‌ఫ్లిక్స్‌లోకి 'మా బెహన్'..
'యానిమల్' తర్వాత తృప్తి దిమ్రి కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె నటించిన లేటెస్ట్ బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ 'మా బెహన్' (Maa Behen) నేరుగా ఓటీటీలోకి అడుగుపెడుతోంది. నెట్‌ఫ్లిక్స్ లో జూన్ 4న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో తృప్తితో పాటు బాలీవుడ్ ఎవర్గ్రీన్ బ్యూటీ మాధురీ దీక్షిత్, రవి కిషన్ ముఖ్య పాత్రలు పోషించారు.
'యానిమల్' లాంటి మాస్ యాక్షన్ తర్వాత తృప్తి ఇలాంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌ను ఎంచుకోవడం ఆమె కెరీర్‌కు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి. ఒకవేళ మీరు క్రైమ్ కామెడీలను ఇష్టపడేవారైతే, ఈ వీకెండ్ ఓటీటీ వాచ్‌లిస్ట్‌లో దీనిని చేర్చుకోవచ్చు.
People Also Ask (FAQ)
ప్రశ్న: 'మా బెహన్' ఓటీటీలో ఎప్పుడు, ఎక్కడ రిలీజ్ అవుతోంది?
జవాబు: తృప్తి దిమ్రి, మాధురీ దీక్షిత్ నటించిన 'మా బెహన్' చిత్రం జూన్ 4 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ కానుంది.
ప్రశ్న: యానిమల్ సినిమాలో తృప్తి దిమ్రి క్యారెక్టర్ పేరు ఏంటి?
జవాబు: యానిమల్ సినిమాలో తృప్తి దిమ్రి రణబీర్ కపూర్ సరసన 'జోయా రియాజ్' అనే కీలకమైన సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటించింది.
ప్రశ్న: మా బెహన్ సినిమా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా?
జవాబు: ఇది ఒక బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్. ఇందులో కొన్ని చోట్ల అడల్ట్ హ్యూమర్, క్రైమ్ ఎలిమెంట్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి.. ట్రైలర్, పబ్లిక్ టాక్ (Public Talk) చూసిన తర్వాతే ఫ్యామిలీతో ప్లాన్ చేయడం మంచిది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


