స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఓ గుడ్ న్యూస్, ఓ బ్యాడ్ న్యూస్ చెప్పిన మేకర్స్.. వీడియో రిలీజ్

స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్పెషల్ ఆప్స్ 2.0 మేకర్స్ ఓ గుడ్ న్యూస్, మరో బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఈ సిరీస్ లీడ్ రోల్ కే కే మేనన్ ఓ వీడియో ద్వారా ఈ రెండు న్యూస్ వెల్లడించాడు. మరి అవేంటో చూడండి.

Jul 8, 2025, 19:07:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జియోహాట్‌స్టార్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ స్పెషల్ ఆప్స్ (Special Ops). ఈ సిరీస్ ఇప్పుడు స్పెషల్ ఆప్స్ 2.0తో రాబోతోంది. అయితే ఈవారమే ఓటీటీలోకి రావాల్సి ఉన్నా.. రిలీజ్ డేట్ ను వారం పాటు వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఈ సిరీస్ లో హిమ్మత్ సింగ్ పాత్ర పోషించిన కే కే మేనన్ ఓ వీడియో ద్వారా వెల్లడించాడు.

స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఓ గుడ్ న్యూస్, ఓ బ్యాడ్ న్యూస్ చెప్పిన మేకర్స్.. వీడియో రిలీజ్
స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఓ గుడ్ న్యూస్, ఓ బ్యాడ్ న్యూస్ చెప్పిన మేకర్స్.. వీడియో రిలీజ్

స్పెషల్ ఆప్స్ 2.0 ఓటీటీ రిలీజ్

స్పెషల్ ఆప్స్ 2.0 వెబ్ సిరీస్ నిజానికి వచ్చే శుక్రవారం (జులై 11) జియోహాట్స్టార్ లో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఇప్పుడీ రిలీజ్ ను వాయిదా వేశారు. జులై 11 బదులుగా జులై 18 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. కొన్ని విషయాలు తమ చేతుల్లో ఉండవని, అందుకే రిలీజ్ వాయిదా వేయాల్సి వచ్చిందని ఈ సిరీస్ లీడ్ రోల్ కే కే మేనన్ చెప్పాడు. ఇది నిజంగా అభిమానులకు బ్యాడ్ న్యూసే.

అయితే అన్ని ఎపిసోడ్లను ఒకేసారి రిలీజ్ చేయనున్నట్లు కూడా ఈ సందర్భంగా అతడు వెల్లడించాడు. దీంతో ఒక రకంగా ఇది గుడ్ న్యూస్ అయింది. నిజానికి జియోహాట్‌స్టార్ ఓటీటీ తమ ఒరిజినల్స్ ను వారానికి ఓ ఎపిసోడ్ చొప్పున రిలీజ్ చేస్తూ వస్తోంది. ఈ మధ్యే వచ్చిన క్రిమినల్ జస్టిస్ సీజన్ 4ను కూడా ఇలాగే తీసుకొచ్చింది. కానీ స్పెషల్ ఆప్స్ 2.0 విషయంలో మాత్రం అన్ని ఎపిసోడ్లు ఒకేసారి తీసుకురానుండటం విశేషం.

స్పెషల్ ఆప్స్ 2.0 గురించి..

స్పెషల్ ఆప్స్ 2.0 వెబ్ సిరీస్ ట్రైలర్ ను గత నెల 16నే రిలీజ్ చేశారు. ఇందులో హిమ్మత్ సింగ్ అనే పవర్ ఫుల్ పాత్రతో కే కే మేనన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చూపించారు. ఈసారి సైబర్ వార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రపంచానికి ఏర్పడే ముప్పుతో హిమ్మత్ సింగ్ అండ్ టీమ్ ఫైట్ చేయబోతున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. డాక్టర్ భార్గవ్ అనే దేశంలోని టాప్ సైంటిస్ట్ కిడ్నాపింగ్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. అతన్ని కాపాడటానికి హిమ్మత్ సింగ్ అండ్ టీమ్ రంగంలోకి దిగుతుంది.

అయితే ఈసారి సైబర్ వార్ వాళ్లకు మరింత సవాలుగా మారుతుంది. సైబర్ వార్ గెలిచే వాళ్లదే ఈసారి విజయం అనే డైలాగ్ హిమ్మత్ సింగ్ నోటి నుంచి రావడం ఈ ట్రైలర్లో చూడొచ్చు. దేశంలో యూపీఐ డేటాబేస్ లక్ష్యంగా సైంటిస్ట్ కిడ్నాప్, తర్వాత కథ సాగబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగులోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. జులై 18 నుంచి జియోహాట్‌స్టార్ లో స్పెషల్ ఆప్స్ 2.0 స్ట్రీమింగ్ కాబోతోంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More