...
...
Next Story

జూనియర్ మూవీలో హాట్ శ్రీలీల.. ఈ సినిమా కోసం ఆమె ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా? ఇంత డిమాండ్ చేసిందా?

యంగ్ అండ్ హాట్ శ్రీలీల మరో కొత్త సినిమాతో థియేటర్లకు రాబోతోంది. ఎనర్జిటిక్ యాక్టింగ్ తో జూనియర్ మూవీలో ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఈ మూవీ కోసం శ్రీలీల భారీ మొత్తం అందుకుందని తెలిసింది.

Published on: Jul 14, 2025, 09:52:12 IST
By ,
Prefer HTon Google
Advertisement

గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటీ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న జూనియర్ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. యాక్టింగ్ తో పాటు అందచందాలతో ఫ్యాన్స్ ను మరోసారి మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతుంది ఈ ముద్దుగుమ్మ. మరోసారి హాట్ షోతో అదరగొట్టబోతోంది. కిరీటీ, శ్రీలీల కాంబినేషన్లో వస్తున్న ఈ ఫిల్మ్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం శ్రీలీల ఎంత రెమ్యునరేషన్ తీసుకుందనేది హాట్ టాపిక్ గా మారింది.

భారీగానే డబ్బు

జూనియర్ మూవీ స్టిల్ లో కిరీటీ, శ్రీలీల (x/Vaaraahi Chalana Chitram)
జూనియర్ మూవీ స్టిల్ లో కిరీటీ, శ్రీలీల (x/Vaaraahi Chalana Chitram)

జూనియర్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది శ్రీలీల. ఈ మూవీ కోసం ఆమె భారీ మొత్తం తీసుకుందనే టాక్ వినిపిస్తోంది. ఏకంగా రూ.2.5 కోట్లు ఆమెకు చెల్లించారని తెలుస్తోంది. కిరీటీకి ఫస్ట్ మూవీ కావడంతో జూనియర్ సినిమా మొత్తం శ్రీలీల భుజాలపై మోసే ఛాన్స్ ఉంది. ఆమె గ్లామర్, యాక్టింగ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ కానున్నాయి. ఈ నేపథ్యంలో జూనియర్ సినిమా కోసం శ్రీలీల భారీగా డిమాండ్ చేసిందని సమాచారం.

పాపులారిటీ

సిజ్లింగ్ డ్యాన్స్ తో పాటు ఆకట్టుకునే యాక్టింగ్ తో సినీ ఇండస్ట్రీలో త్వరగానే పాపులర్ అయింది శ్రీలీల. అమెరికాలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ 2017లో తెలుగులో వచ్చిన చిత్రాంగద సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. 2019లో కన్నడ సినిమా కిస్ తో డెబ్యూ చేసింది. తెలుగులో పెళ్లి సందడి ఫిల్మ్ తో అడుగుపెట్టింది. ఆ తర్వాత ధమాకా, స్కంద, భగవంత్ కేసరి, గుంటూరు కారం తదితర సినిమాలతో స్టార్ డమ్ పెంచేసుకుంది. ఈ పాపులారిటీ కారణంగానే సినిమాలకు ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తోంది ఈ బ్యూటీ.

అయిదు సినిమాలు

శ్రీలీలకు వరుసగా ఫ్లాప్ లు ఎదురవుతున్నా ఆమె డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో అయిదు సినిమాలున్నాయి. జూనియర్ తో పాటు రవిజేత సినిమా మాస్ ధమాకాలో నటిస్తోంది శ్రీలీల. హిందీలో ఆషికి 3 చేస్తోంది. తమిళంలో పరాశక్తి, తెలుగులో పవన్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తోంది హాట్ బ్యూటీ. జూనియర్ సినిమా జూలై 18న రిలీజ్ కాబోతోంది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks