తను నమ్మిన సిద్ధాంతానికి ఇంచ్ కూడా పక్కకు జరగరు.. మేము పూర్తిగా అపోజిట్.. మరో దర్శకుడిపై రాజమౌళి కామెంట్స్
డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మరో దర్శకుడిని ప్రశంసలతో ముంచెత్తారు. జూన్ 15న జరిగిన కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ శేఖర్ కమ్ములపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. శేఖర్ కమ్ముల నమ్మిన సిద్ధాంతాల గురించి, తనకన్న జూనియర్ అనుకున్న వ్యక్తి సీనియర్ అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు.
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, తమిళ అగ్ర హీరో ధనుష్ ముగ్గురు క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 15న గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.

ఏది అడ్డు వచ్చినా
కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. శేఖర్ కమ్ముల చాలా సాఫ్ట్‌గా హంబుల్‌గా ఉంటారు. ఆయనను చూసిన వెంటనే మనకి అలానే అనిపిస్తుంది. కానీ, ఆయన చాలా దృఢ నిశ్చయం కలిగిన మనిషి. తను నమ్మిన సిద్ధాంతానికి ఏది అడ్డు వచ్చినా ఒక్క ఇంచ్ కూడా పక్కకు జరగరు. ఆ క్వాలిటీని నేను చాలా ఎడ్మైర్ చేస్తాను" అని అన్నారు.
"శేఖర్ ఆయన నమ్మిన సిద్ధాంతాల మీద సినిమాలు తీస్తారు. నేను నమ్మిన సిద్ధాంతాలకి నేను చేసే సినిమాలకి సంబంధం ఉండదు. మేము కంప్లీట్ అపోజిట్ పోల్స్. ఆయన అంటే నాకు అపారమైన గౌరవం" అని మరో దర్శకుడిపై అని రాజమౌళి ప్రశంసలు కురిపించారు.
నాకంటే సీనియర్
"ఆయన (శేఖర్ కమ్ముల) ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు అయిందంటే నాకు నమ్మ బుద్ధి కావడం లేదు. ఆయన నాకు జూనియర్ అనుకున్నాను. కానీ, నాకంటే వన్ ఇయర్ సీనియర్ తను. ఈ 25 సంవత్సరాల్లో అలాగే ఉన్నాడు. తను నమ్మిన సిద్ధాంతాలతోనే సినిమాలు తీశాడు. ఆయన అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను" అని జక్కన్న చెప్పుకొచ్చాడు.
"నాగార్జున గారు, శేఖర్ కమ్ముల, టైటిల్ కుబేర.. ఈ అనౌన్స్‌మెంట్ వచ్చిన వెంటనే ఫెంటాస్టిక్‌గా అనిపించింది. ధనుష్ కూడా ఇందులో ఉన్నారని తెలిసిన తర్వాత అద్భుతమైన కాంబినేషన్ అనిపించింది. ట్రాన్స్ అఫ్ కుబేర రిలీజ్ అయిన తర్వాత మైండ్ బ్లోయింగ్ అనిపించింది" అని దర్శకుడు రాజమౌళి పేర్కొన్నారు.
సస్పెన్స్ సినిమాలాగా
"ఒక రిచ్ ప్రపంచంలో నాగార్జున గారు, పూర్ ప్రపంచంలో ధనుష్ గారు.. సినిమా కథ గురించి ఏం చెప్పకుండా ఈ రెండు క్యారెక్టర్స్‌ని చూపించడం చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. శేఖర్ కమ్ముల గారు తన సినిమాని ట్రైలర్‌లోనే చెప్పేస్తారు. కానీ, కుబేర విషయానికి వస్తే నాకు ఒక సస్పెన్స్ సినిమా లాగా అనిపిస్తుంది" అని రాజమౌళి తెలిపారు.
"నాగార్జున గారిని ధనుష్ గారిని ఎలా కలిపాడు? వాళ్ల మధ్య డ్రామా ఏంటి? అనేది చాలా క్యూరియాసిటీగా అనిపిస్తుంది. దీని కోసం ఈగర్‌గా ఎదురుచూస్తున్నాను. కుబేర ట్రైలర్ ఆసక్తిని మరింత పెంచింది. మైండ్ బ్లోయింగ్ విజువల్స్. ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా ఉంది. ప్రతీది టాప్ క్లాస్‌లో ఉన్నాయి. దేవి శ్రీ ఇచ్చిన నాది నాది సాంగ్, కుబేర థీమ్ ఇవన్నీ ఫెంటాస్టిక్‌గా ఉన్నాయి. జూన్ 20న డోంట్ మిస్ కుబేర" అని రాజమౌళి తన స్పీచ్ ముగించారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



