...
...
Next Story

నాకు మాత్రం హార్ట్‌బ్రేకే: ఐపీఎల్ ఫైనల్‌పై రాజమౌళి ట్వీట్ వైరల్.. అలా ఎందుకన్నాడో చూడండి

ఐపీఎల్ ఫైనల్ పై దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఫైనల్లో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ తలపడనుండటంపై జక్కన్న సోమవారం (జూన్ 2) మధ్యాహ్నం ఓ ట్వీట్ చేశాడు. తనకు హార్ట్ బ్రేక్ కాబోతోందని అతడు అనడం విశేషం.

Published on: Jun 2, 2025, 14:31:32 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఐపీఎల్‌కు మరో కొత్త విజేత రాబోతున్నారు. ఈసారి ఫైనల్లో ఇప్పటి వరకూ ట్రోఫీ గెలవని పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ తలపడనున్న విషయం తెలిసిందే. మంగళవారం (జూన్ 3) ఈ మెగా ఫైనల్ జరగనుంది. అయితే ఆదివారం (జూన్ 1) జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్ తర్వాత పంజాబ్ కింగ్స్ విజయం, ఫైనల్ పై ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

నాకు హార్ట్‌బ్రేకే

నాకు మాత్రం హార్ట్‌బ్రేకే: ఐపీఎల్ ఫైనల్‌పై రాజమౌళి ట్వీట్ వైరల్.. అలా ఎందుకన్నాడో చూడండి
నాకు మాత్రం హార్ట్‌బ్రేకే: ఐపీఎల్ ఫైనల్‌పై రాజమౌళి ట్వీట్ వైరల్.. అలా ఎందుకన్నాడో చూడండి

రాజమౌళి సోమవారం (జూన్ 2) చేసిన ట్వీట్ లో పంజాబ్ ను ఫైనల్ చేర్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. అయితే ఆ టీమ్ ఫైనల్లో తన మరో ఫేవరెట్ అయిన విరాట్ కోహ్లి ఆర్సీబీతో తలపడనుండటంతో ఇద్దరిలో ఎవరు గెలిచినా తనకు హార్ట్ బ్రేక్ తప్పదని జక్కన్న అన్నాడు.

“బుమ్రా, బౌల్ట్ యార్కర్లను అయ్యర్ థర్డ్ మ్యాన్ బౌండరీకి తరలించడం ఓ అద్భుతం. ఈ వ్యక్తి ఢిల్లీని ఫైనల్ కు తీసుకెళ్లాడు.. తర్వాత డ్రాప్ చేశారు.. కోల్‌కతాకు ట్రోఫీ అందించాడు.. అయినా డ్రాప్ చేశారు.. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ను 11 ఏళ్ల తర్వాత ఫైనల్ కు తీసుకెళ్లాడు.

ఈసారి కూడా అతడు ట్రోఫీ అందుకోవడానికి పూర్తిగా అర్హుడు. మరోవైపు కోహ్లి ఉన్నాడు. ప్రతి ఏటా అతడు నిలకడగా ఆడుతున్నాడు. వేల కొద్దీ రన్స్ చేస్తున్నాడు. ఇది అతనికి ఆఖరి పోరాటం.. అతడు కూడా దీనికి అర్హుడే. ఫలితం ఏదైనా హార్ట్ బ్రేకే కానుంది” అని రాజమౌళి ట్వీట్ చేశాడు.

శ్రేయస్.. అండర్ రేటెడ్ కెప్టెన్

శ్రేయస్ అయ్యర్ మోస్ట్ అండర్ రేటెడ్ కెప్టెన్ అని చెప్పొచ్చు. రాజమౌళి చెప్పినట్లు అతడు ప్రతి ఐపీఎల్ టీమ్ నూ తన భుజాలపై మోస్తూ అద్భుతమైన ఫలితాలు సాధించి పెడుతున్నాడు. కానీ చివరికి అతన్ని ఆయా టీమ్స్ అన్నీ వదిలించుకుంటూనే ఉన్నాయి. గతేడాది కేకేఆర్ కు ట్రోఫీ అందించినా.. అతన్ని కొనసాగించలేదు. ఈసారి పంజాబ్ కింగ్స్ ను ఏకంగా ఫైనల్ కు తీసుకెళ్లాడు. టోర్నీ మొత్తం నిలకడగా రాణించాడు. అతని కెప్టెన్సీ కూడా అద్భుతమనే చెప్పాలి.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe