Star Maa New Serial: స్టార్ మాలోకి టాలీవుడ్ సీనియర్ నటుడు నటిస్తున్న సరికొత్త సీరియల్.. డేట్, టైమ్ ఇదే

Star Maa New Serial: స్టార్ మాలోకి మరో సరికొత్త సీరియల్ రాబోతోంది. ఈ సీరియల్ పేరు గోదావరి. తాజాగా మంగళవారం (మే 5) ఈ సీరియల్ ప్రోమోను రిలీజ్ చేస్తూ.. సీరియల్ టెలికాస్ట్ అయ్యే తేదీని ఆ ఛానెల్ వెల్లడించింది.

Published on: May 6, 2026, 05:43:13 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Star Maa New Serial: తెలుగు టీవీ సీరియల్స్ లో సాటిలేని స్టార్ మా ఛానెల్లోకి మరో కొత్త సీరియల్ రాబోతోంది. చాలా రోజులుగా దీని గురించి టీజ్ చేస్తూ వస్తున్న ఆ ఛానెల్ ఇప్పుడు ప్రారంభమయ్యే తేదీని వెల్లడించింది. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజా రవీంద్ర నలుగురు కూతుళ్లకు తండ్రి పాత్రలో నటిస్తున్న ఈ సీరియల్ పేరు గోదావరి. కోనసీమ అందాలను చూపిస్తూ సాగనుంది.

Star Maa New Serial: స్టార్ మాలోకి టాలీవుడ్ సీనియర్ నటుడు నటిస్తున్న సరికొత్త సీరియల్.. డేట్, టైమ్ ఇదే
Star Maa New Serial: స్టార్ మాలోకి టాలీవుడ్ సీనియర్ నటుడు నటిస్తున్న సరికొత్త సీరియల్.. డేట్, టైమ్ ఇదే

గోదావరి సీరియల్ టైమింగ్స్

స్టార్ మాలోకి అడుగుపెడుతున్న ఈ కొత్త సీరియల్ గోదావరి వచ్చే సోమవారం అంటే మే 11 నుంచి టెలికాస్ట్ కానుంది. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6.30 గంటలకు ఈ కొత్త సీరియల్ వస్తుంది. ఇప్పటి వరకూ ఆ సమయంలో నిండు మనసులు వస్తుండగా.. ఇప్పుడు గోదావరి పలకరించబోతోంది.

“తండ్రి లేని ఈ అక్కాచెల్లెల్ల జీవితం.. కన్నీళ్లను చిరునవ్వులుగా మార్చుకుంటూ, ఆశలతో ముందుకు సాగిన స్ఫూర్తిదాయక ప్రయాణం.. గోదావరి గ్రాండ్ లాంచ్ మిస్ కావద్దు. మే 11 నుంచి ప్రారంభం.. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు సాయంత్రం 6.30 గంటలకు” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.

గోదావరి ప్రోమో

గోదావరి సీరియల్ లో టాలీవుడ్ సీనియర్ నటుడు రాజా రవీంద్ర నటిస్తున్నాడు. నలుగురు కూతుళ్లకు తండ్రిగా అతడు కనిపించనున్నాడు. అయితే అతని పాత్ర ఎక్కువ రోజులు సాగేలా కనిపించడం లేదు. తండ్రి కన్నుమూసిన తర్వాత ఆ నలుగురు కూతుళ్లలో ఒకరు ఎలా ఆ కుటుంబ భారాన్ని మోయనున్నారన్నది తాజా ప్రోమోలో చూపించారు.

ప్రోమో మొదట్లోనే గోదావరి, కోనసీమ అందాలను చూపిస్తూ ప్రారంభమైంది. ఆ తర్వాత లీడ్ రోల్స్ ఎంట్రీ, ప్రేమ, కుటుంబంలోని వ్యక్తుల మధ్య సంఘర్షణతో సాగిపోయింది. నిజానికి కొన్నాళ్ల కిందటే ఈ సీరియల్ ను స్టార్ మా అనౌన్స్ చేయగా.. తాజాగా టెలికాస్ట్ తేదీని వెల్లడించింది.

గోదావరి సీరియల్ విశేషాలు

తండ్రి లేని నలుగురు కూతుళ్ల చుట్టూ తిరిగే కథే ఈ గోదావరి. ఆ కుటుంబానికి జాహ్నవి అనే రెండో కూతురే పెద్ద దిక్కుగా ఉంటుంది. గతంలో రిలీజ్ చేసిన ప్రోమోలో ఆ తండ్రే తన నలుగురు కూతుళ్లను పరిచయం చేస్తున్నట్లుగా చూపించారు.

మొదట అమెరికా సంబంధం అంటే చాలు పెళ్లికి రెడీ అయిపోయే మొదటి కూతురిని, తర్వాత జీవితంలో ఏం చేయాలో తెలియని మూడో కూతురిని చూపిస్తారు. ఆ తర్వాత కుటుంబ భారాన్ని మోస్తున్న రెండో కూతురు జాహ్నవిని పరిచయం చేశారు. చివరిగా అనారోగ్యంతో బాధపడుతున్న తన నాలుగో కూతురిని ఆ తండ్రి చూపిస్తాడు. కానీ నిజానికి ఆ తండ్రే వాళ్ల జీవితాల్లో లేడని ప్రోమో చివర్లో చెప్పడం ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తుంది.

ఈ సీరియల్లో రాజా రవీంద్రతోపాటు అనుమిత దత్త, గంటా మౌనిక, మధురిమ, సంధ్య వరలక్ష్మిలాంటి వాళ్లు నటించారు. ఇది విజయ్ టీవీలో వచ్చే మహానది సీరియల్ కు తెలుగు రీమేక్. ఇప్పటికే ఈ తమిళ సీరియల్ కు కన్నడ, మలయాళ రీమేక్స్ టెలికాస్ట్ అవుతుండగా.. తెలుగులో గోదావరి పేరుతో స్టార్ మా తీసుకువస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More