1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న స్టార్ మా సీరియల్.. మూడున్నరేళ్లుగా సాగుతూ..
స్టార్ మా సీరియల్ ఒకటి 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ఆ ఛానెల్ సోమవారం (జులై 7) వెల్లడించింది. మూడున్నరేళ్లుగా ఈ సీరియల్ కొనసాగుతూనే ఉండటం విశేషం. మరి దీని గురించిన విశేషాలేంటో చూద్దాం.
స్టార్ మా ఛానెల్ సీరియల్స్ అంటే తెలుగులో టాప్. టీఆర్పీ రేటింగ్స్ విషయంలో కొన్నేళ్లుగా ఈ ఛానెల్లో వచ్చే సీరియల్స్ కు తిరుగే లేదు. ఇప్పుడా ఛానెల్లో వచ్చే మల్లి నిండు జాబిలి సీరియల్ ఏకంగా 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకొని మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

మల్లి సీరియల్ @ 1000 ఎపిసోడ్లు
మల్లి సీరియల్ 1000 ఎపిసోడ్ల మైల్ స్టోన్ అందుకున్నట్లు స్టార్ మా ఛానెల్ సోమవారం (జులై 7) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఇది తమకో ఎమోషనల్ జర్నీ అని చెప్పింది. “1 నుంచి 1000 ఎపిసోడ్ల వరకు.. ప్రతి క్షణం మాకు ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాంటిదే. ఇది కేవలం షో కాదు.. ఓ ఫీలింగ్.
అన్‌స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ 1000 ఎపిసోడ్లను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మల్లి సీరియల్ సోమవారం నుచి శనివారం వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 3 గంటలకు కేవలం మీ స్టార్ మాలో” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. దీనికి మల్లి 1000 ఎపిసోడ్ల పోస్టర్ కూడా యాడ్ చేసింది.
మల్లి సీరియల్ గురించి..
మల్లి సీరియల్ సుమారు మూడున్నరేళ్ల కిందట స్టార్ మా ఛానెల్లో ప్రారంభమైంది. ఈ సీరియల్ తొలి ఎపిసోడ్ ఫిబ్రవరి 28, 2022లో టెలికాస్ట్ అయింది. ఇందులో శిరీష సౌగంధ్, భావన లాస్య, గౌరీ రాజ్, ఆర్యన ధిర్ కుమార్, రూపా రెడ్డి, దీపా జగదీశ్, నంద కిశోర్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. ఆర్కే మలినేని డైరెక్ట్ చేశాడు. సాయిబాబా ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. ఇది బెంగాలీ సీరియల్ ఇష్టి కుటుమ్ ఆధారంగా తెలుగులో వచ్చింది.
అరవింద్, మల్లి, మాలిని అనే మూడు పాత్రలు చుట్టే ప్రధానంగా తిరిగే సీరియల్ ఇది. ఈ సీరియల్ ప్రస్తుతం సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారం అవుతోంది. ఓ సీరియల్ 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకోవడం అరుదైన విషయమే. ఆ ఘనతను అందుకున్న మల్లి సీరియల్ ఇప్పటికీ ప్రేక్షకలను అలరిస్తూనే ఉంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



