Star Maa Serials: స్టార్ మాలోకి సరికొత్త సీరియల్.. మారిపోతున్న ఈ రెండు సీరియల్స్ టైమింగ్స్
Star Maa Serials: స్టార్ మాలోకి ఓ సరికొత్త సీరియల్ రాబోతోంది. దీంతోపాటు మరో రెండు సీరియల్స్ టైమింగ్స్ కూడా మారిపోనున్నాయి. ఆ కొత్త సీరియల్ ఏంటి? మారిపోతున్న మిగిలిన రెండు సీరియల్స్ ఏవి అన్నది ఇక్కడ చూడండి.
Star Maa Serials: తెలుగు టీవీ సీరియల్స్ లో టాప్ రేటింగ్స్ తో దూసుకెళ్లే స్టార్ మా ఛానెల్.. ఇప్పుడు మరో కొత్త సీరియల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సీరియల్ పేరు ‘ఏ దేవి వరమో నీవు’. వచ్చే సోమవారం అంటే జులై 6 నుంచి ఈ సీరియల్ ప్రారంభం కానుంది.

ఏ దేవి వరమో నీవు సీరియల్ విశేషాలు
స్టార్ మా ఛానెల్ చాలా రోజులుగా ఊరిస్తూ వస్తున్న సీరియల్ ఏ దేవి వరమో నీవు. పుట్టగానే తల్లికి దూరమైన ఓ కూతురు 25 ఏళ్ల తర్వాత మళ్లీ తన తల్లిని వెతుక్కుంటూ వెళ్తే ఏం జరుగుతుంది అన్న ఆసక్తికర కథతో ఈ సీరియల్ రాబోతోంది.
ఈ సరికొత్త సీరియల్ ను వచ్చే సోమవారం అంటే జులై 6 నుంచి రాత్రి 8.30 గంటలకు స్టార్ మా టెలికాస్ట్ చేయబోతోంది. సోమవారం నుంచి శనివారం వరకు ఈ సీరియల్ ప్రసారమవుతుంది.
ఏ దేవి వరమో నీవు స్టోరీ ఇదే
స్టార్ మా ఛానెల్ గత కొన్నాళ్లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న ప్రమోషనల్ వీడియోలు, ఇతర కంటెంట్ చూస్తే.. అంజలి అనే అమ్మాయి చుట్టూ ఈ కథ తిరగనుంది. ఆమె పుట్టినప్పటి నుంచే ఓ అనాథాశ్రమంలో పెరుగుతుంది. తనకు ఎవరూ లేరు అని అనుకున్న ఆమె.. అక్కడి వారితోనే బాగా కలిసిపోతుంది. అయితే పాతికేళ్ల తర్వాత ఆమెకు తన తల్లి ఉందన్న విషయం తెలుస్తుంది.
ఆమెను వెతుక్కుంటూ వెళ్తుంది. అయితే ఇన్నేళ్ల తర్వాత వచ్చిన తన కూతురిని ఆ తల్లి ఆదరిస్తుందా లేక ఆ తల్లి ప్రశాంతతను ఆ కూతురు చెడగొడుతుందా అన్నదే ఈ ఏ దేవి వరమో సీరియల్ కథ. ఈ సీరియల్ రాకతే ఇంతకాలం 45 నిమిషాల నిడివితో వస్తున్న గుండె నిండా గుడి గంటలు, పొదరిల్లు సీరియల్స్ మళ్లీ 30 నిమిషాలకు పరిమితం కానున్నాయి.
ఆ రెండు సీరియల్స్ టైమ్ మారింది
ఇక స్టార్ మాలోనే వస్తున్న మరో రెండు సీరియల్స్ టైమ్ కూడా మారింది. జులై 6 నుంచే ఈ మార్పు కూడా అమల్లోకి రానుంది. టాప్ సీరియల్స్ లో ఒకటైన ఇంటింటి రామాయణం వచ్చే సోమవారం నుంచి సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ కానుంది. ఇక మరో ఇంట్రెస్టింగ్ సీరియల్ నిండు మనసులు మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రసారం అవుతుందని స్టార్ మా వెల్లడించింది.
ఇప్పటికే టీఆర్పీ రేటింగ్స్ విషయంలో తెలుగులో టాప్ గేర్ లో దూసుకెళ్తున్న స్టార్ మా.. ఈ సరికొత్త సీరియల్ తోపాటు ఇప్పటికే ఉన్న సీరియల్స్ టైమ్ మార్పుతో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


