స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్.. టాప్ 10లో నుంచి రెండు సీరియల్స్ ఔట్.. 21వ వారం సత్తా చాటిన జీ తెలుగు
స్టార్ మాతోపాటు జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. 21వ వారం రేటింగ్స్ టాప్ 10లో మార్పులు చోటు చేసుకున్నాయి. టాప్ 10లోకి మూడు జీ తెలుగు సీరియల్స్ దూసుకొచ్చాయి. బ్రహ్మముడి 8వ స్థానానికి పడిపోయింది.
తెలుగు టీవీ సీరియల్స్ 21వ వారం టీఆర్పీ రేటింగ్స్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. కొంతకాలంగా వెనుకబడిన జీ తెలుగు సీరియల్స్ మరోసారి సత్తా చాటాయి. స్టార్ మాకు చెందిన రెండు సీరియల్స్ టాప్ 10లో నుంచి వెళ్లిపోగా.. వాటి స్థానంలో జీ తెలుగుకు సంబంధించిన సీరియల్స్ వచ్చాయి. మరి టాప్ 10లో ఏయే సీరియల్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం.

బ్రహ్మముడి 8వ స్థానానికి..
స్టార్ మా సీరియల్స్ 21వ వారం కూడా సత్తా చాటినా.. టాప్ 10లో మాత్రం రెండు సీరియల్స్ ను కోల్పోయింది. గత రెండు మూడు వారాలుగా 9 సీరియల్స్ ఈ ఛానెల్ కు చెందినవే ఉండేవి. కానీ తాజాగా రేటింగ్స్ నుంచి నిన్ను కోరి, పలుకే బంగారమాయెనా టాప్ 10 నుంచి వెళ్లిపోయాయి. కార్తీకదీపం సీరియల్ 12.26 రేటింగ్ తో తొలి స్థానంలో కొనసాగుతోంది. ఇక ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ 11.79 రేటింగ్ తో రెండో స్థానంలో ఉంది.
మూడు, నాలుగు స్థానాల కోసం గట్టి పోటీ నెలకొంది. గుండెనిండా గుడిగంటలు సీరియల్ 10.47 రేటింగ్ తో మూడో స్థానంలో ఉండగా.. ఇంటింటి రామాయణం 10.46తో నాలుగో స్థానంలో ఉంది. ఇక చిన్ని సీరియల్ 8.23తో ఐదో స్థానంలో కొనసాగుతోంది. నువ్వుంటే నాజతగా మరోసారి బ్రహ్మముడిని వెనక్కి నెట్టి 7.17తో ఆరో స్థానంలోకి వచ్చింది. బ్రహ్మముడి 6.94 రేటింగ్ తో 8వ స్థానంలో ఉంది.
జీ తెలుగు సీరియల్స్ ఇలా..
ఇక జీ తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే.. చాలా కాలం తర్వాత ఆ ఛానెల్ నుంచి ఓ సీరియల్ 7 రేటింగ్ దాటింది. మేఘ సందేశం 7.16తో ఓవరాల్ గా 7వ స్థానంలో ఉంది. ఇక చామంతి 6.86, జగద్ధాత్రి 6.85 రేటింగ్స్ తో 9, 10 స్థానాల్లో ఉన్నాయి. లక్ష్మీ నివాసం 6.04, అమ్మాయిగారు 5.20 రేటింగ్స్ సాధించాయి.
నిజానికి గత వారం వరకు జీ తెలుగు నుంచి ఒకే ఒక్క సీరియల్ మాత్రమే టాప్ 10లో ఉండేది. కానీ తాజాగా 21వ వారం రేటింగ్స్ లో మొత్తంగా మూడు సీరియల్స్ టాప్ 10లోకి వచ్చాయి. జీ తెలుగు సీరియల్స్ రేటింగ్స్ పెరగడంతోపాటు స్టార్ మా ఛానెల్ రేటింగ్స్ పడిపోవడం కూడా ఈ మార్పులకు కారణమైంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



