స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్.. దుమ్మురేపుతున్న కార్తీకదీపం.. రెండో స్థానం కోసం మూడు సీరియల్స్ పోటాపోటీ
స్టార్ మా సీరియల్స్ తోపాటు ఇతర తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. 25వ వారానికి రిలీజైన ఈ రేటింగ్స్ లో కార్తీకదీపం 2 దుమ్ము రేపుతోంది. ఇక రెండో స్థానం కోసం మూడు సీరియల్స్ హోరాహోరీగా తలపడుతున్నాయి.
స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ 25వ వారం టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. వీటిలో ఎప్పటిలాగే కార్తీకదీపం 2 సీరియల్ దూసుకెళ్తోంది. ఇది దేనికీ అందనంత ఎత్తులో ఉంది. ఇక రెండో స్థానం కోసం ఇల్లు ఇల్లాలు పిల్లలు, గుండె నిండా గుడి గంటలు, ఇంటింటి రామాయణం మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టాప్ 10లో మూడు జీ తెలుగు సీరియల్స్ స్థానం సంపాదించాయి.

టాప్ 7.. అన్నీ స్టార్ మా సీరియల్సే
స్టార్ మా సీరియల్స్ కొన్నేళ్లుగా టీఆర్పీ రేటింగ్స్ విషయంలో ఇతర ఛానెల్స్ కు అందనంత ఎత్తులో ఉంటున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా ఆ ఛానెల్ కు చెందిన సీరియల్స్ మంచి రేటింగ్స్ సాధించాయి. తొలి స్థానంలో కార్తీకదీపం 2 సీరియల్ కొనసాగుతోంది. ఈవారం ఈ సీరియల్ కు ఏకంగా 13.91 రేటింగ్ రావడం విశేషం. ఇతర ఏ సీరియల్ కూ అందనంత ఎత్తులో ఉండటం విశేషం. ఇక రెండో స్థానం కోసమే అసలైన పోటీ నెలకొంది.
ప్రస్తుతం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ 12.25 రేటింగ్ తో రెండో స్థానంలో ఉంది. అయితే దీనికి మరో రెండు సీరియల్స్ నుంచి ముప్పు పొంచి ఉంది. ఇంటింటి రామాయణం 12.25తో మూడో స్థానంలో, గుండె నిండా గుడి గంటలు 12.11తో నాలుగో స్థానంలో నిలిచాయి. ఇక ఆ తర్వాత చిన్ని సీరియల్ 8.31, నువ్వుంటే నా జతగా 8.11, బ్రహ్మముడి 7.72 రేటింగ్స్ తో వరుసగా ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
టాప్ 10లో మూడు జీ తెలుగు సీరియల్స్
ఇక తెలుగు టాప్ 10 సీరియల్స్ జాబితాలో మూడు జీ తెలుగు ఛానెల్ సీరియల్స్ ఉన్నాయి. వీటిలో జగద్ధాత్రి 7.69 రేటింగ్ తో ఆ ఛానెల్లో టాప్ లో ఉంది. ఇక ఓవరాల్ గా 8వ స్థానం సంపాదించింది. ఆ తర్వాత చామంతి సీరియల్ 7.48, మేఘ సందేశం 7.41 రేటింగ్స్ సాధించాయి. ఇవి 9, 10వ స్థానంలో ఉన్నాయి. లక్ష్మీ నివాసం 6.33, అమ్మాయిగారు 5.27 రేటింగ్స్ సాధించాయి.
చాలా కాలంగా స్టార్ మా సీరియల్స్ కు జీ తెలుగు సీరియల్స్ అసలు పోటీ ఇవ్వలేకపోతున్నాయి. ఈ ఛానెల్ కు చెందిన ఒక్క సీరియల్ కూడా కనీసం 8 రేటింగ్ అందుకోలేకపోతున్నాయి. అయితే గతంతో పోలిస్తే ఈ 25వ వారం మాత్రం కాస్త మెరుగైన రేటింగ్సే సాధించాయని చెప్పొచ్చు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



