స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్: తెలుగులో టాప్ 10 సీరియల్స్ ఇవే.. టాప్‌లోనే కార్తీకదీపం
స్టార్ మా సీరియల్స్, జీ తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. ఈ ఏడాది 20వ వారానికి గాను ఈ రేటింగ్స్ రిలీజ్ చేశారు. గత కొన్ని వారాలుగా టాప్ 10లో 9 సీరియల్స్ స్టార్ మాకు చెందినవే ఉండటం విశేషం.
తెలుగు టీవీ సీరియల్స్ కు సంబంధించి 20వ వారానికి టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. గత వారంలాగే ఈ వారం కూడా రేటింగ్స్, టాప్ 10 సీరియల్స్ లో పెద్దగా మార్పులేమీ లేవు. 9 సీరియల్స్ స్టార్ మాకు చెందినవే ఉన్నాయి. జీ తెలుగు నుంచి కేవలం ఒకే ఒక్క సీరియల్ మాత్రమే టాప్ 10లో చోటు దక్కించుకుంది.

టాప్‌లో కార్తీకదీపమే
తెలుగు టీవీ సీరియల్స్ లో మరోసారి టాప్ ప్లేస్‌లో నిలిచిందికార్తీకదీపం 2. ఈ ఏడాది 20వ వారం కూడా ఆ సీరియల్ కే అత్యధిక రేటింగ్ నమోదైంది. తాజా రేటింగ్స్ లో ఈ సీరియల్ కు 12.02 టీఆర్పీ సాధించింది. ఇక రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఉంది. ఈ సీరియల్ కు 11.19 రేటింగ్ నమోదైంది.
ఇక మూడు, నాలుగు స్థానాల్లో గుండెనిండా గుడిగంటలు (10.38), ఇంటింటి రామాయణం (10.31) ఉన్నాయి. ఐదో స్థానంలో చిన్ని సీరియల్ 7.82 రేటింగ్ తో నిలిచింది. ఇక బ్రహ్మముడి సీరియల్ ఆరో స్థానంలోనే కొనసాగుతోంది. ఆ సీరియల్ కు 20వ వారం 7.09 రేటింగ్ వచ్చింది. ఏడో స్థానంలో ఉన్న నువ్వుంటే నా జతగా సీరియల్ 6.62 రేటింగ్ సాధించింది. 8వ స్థానంలో నిన్ను కోరి (6.08), 9వ స్థానంలో పలుకే బంగారమాయెనా (5.92) సీరియల్స్ ఉన్నాయి.
జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
ఇక జీ తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే 20వ వారం కూడా ఆ ఛానెల్ కు చెందిన ఒకే ఒక్క సీరియల్ టాప్ 10లో చోటు సంపాదించింది. అంతేకాదు ఒక్క సీరియల్ కూడా కనీసం 6 కంటే ఎక్కువ రేటింగ్ సాధించలేదు. ఆ ఛానెల్లో అత్యధింగా 5.80 రేటింగ్ తో మేఘసందేశం సీరియల్ టాప్ లో, ఓవరాల్‌గా 10వ స్థానంలో ఉంది. ఇక చామంతి సీరియల్ 5.62, జగద్ధాత్రి 5.59, లక్ష్మీనివాసం 5.02 రేటింగ్స్ సాధించాయి.
అయితే క్రమంగా తెలుగులో స్టార్ మా ఛానెల్ సీరియల్స్ ఆధిపత్యం సాధిస్తున్నాయి. జీ తెలుగు సీరియల్స్ వాటికి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోతున్నాయి. ఇక ఈటీవీ, జెమినిలాంటి ఛానెల్స్ మాత్రం సీరియల్స్ విషయంలో అసలు అడ్రెస్ లేకుండా పోయాయి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper













