స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్.. టాప్ 10లో రెండే జీ తెలుగు సీరియల్స్.. తిరుగులేని కార్తీకదీపం

స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. టాప్ 10లో 8 స్టార్ మా సీరియల్సే ఉండగా.. జీ తెలుగుకు చెందిన కేవలం రెండే సీరియల్స్ చోటు దక్కించుకున్నాయి. ఇక కార్తీకదీపం 2 సీరియల్ కు తిరుగులేకుండా పోతోంది.

Jun 12, 2025, 14:14:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు టీవీ సీరియల్స్ 22వ వారానికి సంబంధించిన టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. ఈసారి కూడా స్టార్ మా సీరియల్స్ తమ ఆధిపత్యాన్ని కొనసాగించాయి. గత వారం టాప్ 10లో నుంచి ఒక సీరియల్ ను కోల్పోయిన ఆ ఛానెల్.. ఈ వారం మళ్లీ దానిని తిరిగి పొందింది. ఇక జీ తెలుగు నుంచి కేవలం రెండు సీరియల్సే టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి.

స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్.. టాప్ 10లో కేవలం రెండే జీ తెలుగు సీరియల్స్.. అందనంత ఎత్తులో కార్తీకదీపం
స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్.. టాప్ 10లో కేవలం రెండే జీ తెలుగు సీరియల్స్.. అందనంత ఎత్తులో కార్తీకదీపం

స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

స్టార్ మా సీరియల్స్ 22వ వారం కూడా సత్తా చాటాయి. ఆ ఛానెల్లో వచ్చే కార్తీకదీపం ఎవరికీ అందనంత ఎత్తుకు దూసుకెళ్తోంది. తాజా రేటింగ్స్ లో 12.75తో కార్తీకదీపం తొలి స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఇక రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు 11.71తో నిలిచింది.

మూడో స్థానంలో ఉన్న ఇంటింటి రామాయణం ఈ వారం తన రేటింగ్ చాలా మెరుగుపరచుకుంది. తాజాగా ఈ సీరియల్ కు 11.26 రేటింగ్ వచ్చింది. గుండె నిండా గుడి గంటలు సీరియల్ నాలుగో స్థానానికి పడిపోయింది. ఆ సీరియల్ కు 22వ వారం.. 10.60 రేటింగ్ మాత్రమే వచ్చింది.

ఇక ఐదో స్థానంలో ఉన్న చిన్ని సీరియల్ వీటికి చాలా దూరంలోనే ఆగిపోయింది. తాజాగా ఆ సీరియల్ కు కేవలం 7.60 రేటింగ్ మాత్రమే వచ్చింది. నువ్వుంటే నా జతగా సీరియల్ 7.43తో ఆరోస్థానంలో, బ్రహ్మముడి 7.23తో ఏడో స్థానంలో ఉన్నాయి. పలుకే బంగారమాయెనా సీరియల్ 6.42తో 9వ స్థానంలో ఉంది.

జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

ఇక జీ తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే 21వ వారం ఆ ఛానెల్ కు చెందిన మూడు సీరియల్స్ టాప్ 10లో ఉండేవి. కానీ ఈవారం ఒక సీరియల్ టాప్ 10లో నుంచి వెళ్లిపోయింది. అంతేకాదు ఒక్క సీరియల్ కూడా 7 రేటింగ్ ను టచ్ చేయలేకపోయింది.

అత్యధికంగా జగద్ధాత్రి మాత్రమే 6.73 రేటింగ్ తో టాప్ లో, ఓవరాల్ గా 8వ స్థానంలో ఉంది. ఇక చామంతి సీరియల్ 6.37తో 10వ స్థానంలో ఉంది. మేఘసందేశం 6.32, లక్ష్మీ నివాసం 5.45 రేటింగ్స్ సాధించాయి. అమ్మాయిగారు 5.08తో ఉంది.

తెలుగు టీవీ సీరియల్స్ లో కొన్నేళ్లుగా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న స్టార్ మా.. రేటింగ్స్ విషయంలో దూకుడు కొనసాగిస్తూనే ఉంది. జీ తెలుగు సీరియల్స్ మాత్రం వాటికి పోటీ ఇవ్వలేకపోతున్నాయి.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More