ఓటీటీలోకి సమంత హారర్ కామెడీ మూవీ శుభం.. సీరియళ్ల పిచ్చితో దెయ్యాలయ్యే భార్యలు.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా వ్యవహరించిన తొలి సినిమా శుభం ఓటీటీలోకి రానుంది.. హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన శుభం సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. సీరియళ్ల మీద పిచ్చితో దెయ్యాలయ్యే భార్యల కథాంశంగా తెరకెక్కిన శుభం ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఆ సంస్థ ఇవాళ అధికారికంగా ప్రకటించింది.

Jun 1, 2025, 10:44:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నిర్మాతగా మారి రూపొందించిన మొదటి సినిమా శుభం. తెలుగు హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన శుభం మూవీకి సినిమా బండి డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సమంత ఈ సినిమాను నిర్మించింది.

ఓటీటీలోకి సమంత హారర్ కామెడీ మూవీ శుభం.. సీరియళ్ల పిచ్చితో దెయ్యాలయ్యే భార్యలు.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
ఓటీటీలోకి సమంత హారర్ కామెడీ మూవీ శుభం.. సీరియళ్ల పిచ్చితో దెయ్యాలయ్యే భార్యలు.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

శుభంపై మంచి అంచనాలు

శుభం సినిమాలో హర్షిత్ రెడ్డి, చరణ్, శ్రీనివాస్ గవిరెడ్డి, శ్రియా కొంతం, షాలిని కొండేపూడి, శ్రావణి లక్ష్మీ ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే, సమంత కూడా ఓ కీ రోల్‌లో ప్రేక్షకులను అలరించారు. మాతగా సమంత శుభం సినిమాలో క్యామియో రోల్ చేసింది. శుభం టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కామెడీ హైలెట్ అంటూ

ఈ భారీ అంచనాల మధ్య మే 9న థియేటర్లలో శుభం మూవీ విడుదలైంది. అయితే, శుభం సినిమాకు మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ, సినిమాలో కామెడీ మాత్రం చాలా బాగుందని ప్రశంసలు వచ్చాయి. అలాగే, స్టోరీ పాయింట్ కూడా చాలా విభిన్నంగా ఉందని పలువురు రివ్యూవర్స్ తెలిపారు. కానీ, సెకండాఫ్‌లో సినిమా గాడి తప్పిందని, స్లోగా సాగిందని కాస్త నెగెటివిటీ వచ్చింది.

జూన్ 13 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్

ఇక శుభం సినిమాకు బాక్సాఫీస్ కలెక్షన్స్ అంతంత మాత్రంగానే వచ్చినట్లు పలు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇదిలా ఉంటే, శుభం ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానుంది. అందుకు మరికొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. జూన్ 13న శుభం ఓటీటీ రిలీజ్ కానుంది. అంటే, మే 9న థియేటర్లలో విడుదలైన శుభం నెల రోజులు దాటిన తర్వాతే ఓటీటీలోకి వచ్చేయనుంది.

జియో హాట్‌స్టార్‌లో శుభం

జియో హాట్‌స్టార్‌లో శుభం ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇవాళ (జూన్ 1) అధికారికంగా ప్రకటించింది. "జియో హాట్‌స్టార్‌లో జూన్ 13న కథ ఆరంబం. చచ్చిన చూడాల్సిందే" అంటూ ట్విటర్ వేదికగా సదరు ప్లాట్‌ఫామ్ శుభం ఓటీటీ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

సీరియల్స్‌కు అడిక్ట్ అయి

దీంతో శుభం ఓటీటీ స్ట్రీమింగ్ కోసం తెలుగు ఆడియెన్స్ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో మిస్ అయినవాళ్లు శుభం సినిమాను ఓటీటీలో వీక్షించేందుకు సిద్ధమయ్యారు. ఇక శుభం కథ విషయానికొస్తే.. ఒక ఊరిలో భార్యలందరూ సీరియల్స్‌కు బాగా అడిక్ట్ అవుతారు. అన్నివేళల్లో భర్తలను దేవుళ్లుగా భావించే భార్యలు సీరియల్స్ చూసే సమయంలో మాత్రం దెయ్యాలుగా మారిపోతారు.

మాత పరిష్కారం

ఆ టైమ్‌లో భర్తలను పట్టించుకోవడమే కాకుండా దాన్ని అడ్డుకున్న వారిపై అటాక్ కూడా చేస్తారు. అలా సీరియళ్ల మీద పిచ్చితో దెయ్యాలుగా మారిపోతారు భార్యలు. దీనికి పరిష్కారం కోసం ఓ మాత దగ్గరికి భర్తలంతా వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? దీనికి పరిష్కారం ఏంటీ? అనేదే శుభం కథ.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More