శివుడి రూపంలో సూపర్ స్టార్ కృష్ణ.. దండం పెట్టుకున్న మహేశ్ బాబు.. సోషల్ మీడియాలో వైరల్

మే 31న టాలీవుడ్‌ లెజండరీ సూపర్ స్టార్‌ కృష్ణ జయంతి. ఈ సందర్భంగా జటాధర మూవీ టీమ్ నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా సుధీర్ బాబు జటాధర మూవీ టీమ్ శివుడి రూపంలో ఉన్న సూపర్ స్టార్ కృష్ణ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌కు హీరో మహేశ్ బాబు దండం పెట్టుకునేట్లుగా ఉన్న ఎమోజీ వైరల్ అవుతోంది.

Jun 1, 2025, 11:34:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ హీరోయిన్

ఈ సినిమాలో సుధీర్ బాబుతోపాటు బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్క‌ర్‌, ర‌వి ప్ర‌కాష్‌, ఇంద్ర కృష్ణ‌, న‌వీన్ నేని, శుభ‌లేఖ సుధాక‌ర్‌, రాజీవ్ క‌న‌కాల‌, ఝాన్సీ నటిస్తున్నారు. జటాధర చిత్రాన్ని ప్రేర‌ణ అరోరా, శివ‌న్ నారంగ్‌, అరుణ అగ‌ర్వాల్ నిర్మిస్తున్నారు.

శివుడి రూపంలో సూపర్ స్టార్ కృష్ణ.. దండం పెట్టుకున్న మహేశ్ బాబు.. సోషల్ మీడియాలో వైరల్
శివుడి రూపంలో సూపర్ స్టార్ కృష్ణ.. దండం పెట్టుకున్న మహేశ్ బాబు.. సోషల్ మీడియాలో వైరల్

మే 31 లెజెండరీ సూప‌ర్‌ స్టార్ కృష్ణ జ‌యంతి. ఈ సంద‌ర్భంగా ‘జ‌టాధ‌ర’ చిత్ర యూనిట్ ఈ ఐకానిక్ యాక్ట‌ర్‌కు హృద‌య‌పూర్వ‌కంగా నివాళులు అర్పించింది. సూపర్ స్టార్ కృష్ణ తిరుగులేని చ‌రిష్మా, లార్జ‌ర్ దేన్ లైఫ్ స్క్రీన్ ప్రెజ‌న్స్ టీమ్‌కి స్ఫూర్తినందిస్తూ వారికి సృజ‌నాత్మ‌క‌తంగా ముందుకు వెళ్ల‌టానికి తోడ్పాడునందిస్తోందని చిత్రబృందం తెలిపింది.

మార్గదర్శకత్వంగా

తెలుగు వెండితెర‌పై దేవుడికి, తుపానుగా, సినిమా ప్ర‌పంచంలో శాశ్వ‌త‌మైన ప్ర‌భావితాన్ని చూపించిన శ‌క్తిగా లెజెండరీ యాక్ట‌ర్‌ సూప‌ర్‌ స్టార్ కృష్ణను ‘జటాధర’ చిత్ర‌ యూనిట్ స్మ‌రించుకుంది. త‌మ క‌థ‌ల‌ను ఈ ప్ర‌పంచానికి అందించ‌టానికి కృషి చేస్తోన్న ఈ జ‌ట్టుకు ఆయ‌న చూపిన దారి మార్గ‌ద‌ర్శ‌క‌త్వంగా నిలుస్తోందని చెప్పుకొచ్చింది.

కింగ్ ఆఫ్ చరిష్మా

‘హ్యాపీ బర్త్‌డే టు ది కింగ్ ఆఫ్ చరిష్మా’ అంటూ సినీ ప‌రిశ్ర‌మ‌పై ఆ లెజెండరీ న‌టుడి చిర‌స్మ‌ర‌ణీయ ప్ర‌భావాన్ని శ్లాఘించింది. ఈ సందర్భంగా మహా శివుడి రూపంలో సూపర్ స్టార్ కృష్ణ పోస్టర్‌ను జటాధర మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ ఎంతగానో ఆకట్టుకునేలా ఉంది. సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్ బాబు అభిమానులకు ఈ పోస్టర్ ఉత్సాహాన్ని అందిస్తోంది.

వెండితెర దేవుడు కృష్ణ

అలాగే, సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా అల్లుడు, హీరో సుధీర్ బాబు ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో నోట్ రాసుకొచ్చాడు. "ఆయన (కృష్ణ) సూపర్ స్టార్ మాత్రమే కాదు. ఆయన ఒక తుఫాన్, వెండితెర దేవుడు, ఒక శక్తి. ఆయన జయంతి సందర్భంగా జటాధర మూవీ టీమ్ కృష్ణ గారికి సెల్యూట్ చేస్తోంది. సూపర్ స్టార్ శివ రామ కృష్ణ మూర్తి గారిలోని అగ్ని మా కథలకు ఇంకా ఇంధనంగా ఉపయోగపడుతుంది" అని సుధీర్ బాబు లాంగ్ నోట్ రాసుకొస్తూ శివుడి రూపంలో ఉన్న కృష్ణ ఫొటోను షేర్ చేశాడు.

మహేశ్ బాబు నమస్కారం

ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌కు పలు విధాలుగా కామెంట్స్ వస్తున్నాయి. శివుడి రూపంలో ఉన్న సూపర్ స్టార్ కృష్ణకు ఆయన కుమారుడు మహేశ్ బాబు దండం పెట్టుకున్నట్లు ఎమోజీని కామెంట్ చేశాడు ఓ అభిమాని. శ్రీమంతుడు సినిమాలో మహేశ్ బాబు దేవుడికి దండం పెట్టుకునే గిఫ్ వీడియోను కామెంట్‌ చేశాడు ఫ్యాన్. ఇది కూడా అందరిని ఆకట్టుకుంటోంది.

హారర్ థ్రిల్లర్‌గా జటాధర

ఇదెలా ఉంటే, ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోన్న ‘జ‌టాధర’ సినిమా షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ సినీ ప్ర‌యాణంలో మైల్‌స్టోన్ మూవీగా నిలిచిపోనుందని వారు ఆశిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా సూప‌ర్ నేచుర‌ల్ హారర్ థ్రిల్ల‌ర్ ‘జ‌టాధర’ను తెలుగు, హిందీ భాష‌ల్లో రూపొందిస్తున్నారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More