...
...
Next Story

సుహాస్ ఓ భామ అయ్యో రామ ట్రైలర్ రిలీజ్.. నవ్వించే కామెడీతోపాటు ఎడిపించే ఎమోషన్.. అతిథి పాత్రల్లో ఇద్దరు డైరెక్టర్స్!

యంగ్ హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ ఓ భామ అయ్యోరామ ట్రైలర్‌ రిలీజ్ అయింది. ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం నవ్వించే కామెడీతోపాటు ఏడిపించే ఎమోషనల్ సీన్లతో సాగింది. అంతేకాకుండా ఇద్దరు డైరెక్టర్స్ అతిథి పాత్రల్లో కనిపించి అట్రాక్ట్ చేశారు. ఓ భామ అయ్యో రామ ట్రైలర్ వివరాల్లోకి వెళితే..!

Published on: Jul 06, 2025 11:48 AM IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

కాగా, మణికందన్‌ సినిమాటోగ్రఫీని అందించిన ఓ భామ అయ్యో రామ సినిమాకు రథన్‌ సమకూర్చారు. బ్రహ్మా కడలి ఆర్ట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

సుహాస్ ఓ భామ అయ్యో రామ ట్రైలర్ రిలీజ్.. నవ్వించే కామెడీతోపాటు ఎడిపించే ఎమోషన్.. అతిథి పాత్రల్లో ఇద్దరు డైరెక్టర్స్!
సుహాస్ ఓ భామ అయ్యో రామ ట్రైలర్ రిలీజ్.. నవ్వించే కామెడీతోపాటు ఎడిపించే ఎమోషన్.. అతిథి పాత్రల్లో ఇద్దరు డైరెక్టర్స్!

సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న హీరో సుహాస్ తాజాగా నటించిన రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'ఓ భామ అయ్యో రామ'. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ ఈ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది.

జులై 11న ఓ భామ అయ్యో రామ రిలీజ్

రామ్ గోధల దర్శకత్వం వహించిన ఈ సినిమాను వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల నిర్మిస్తున్నారు. జూలై 11న ఓ భామ అయ్యో రామ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. శనివారం (జులై 5) ఓ భామ అయ్యో రామ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

షూర్ షాట్ విజయం

ఈ సందర్భంగా నిర్మాత హరీష్ నల్ల మాట్లాడుతూ.. "ట్రైలర్‌ విడుదలైన కొద్ది సమయంలోనే మంచి స్పందన వస్తోంది. ట్రైలర్‌ చూసిన వారు ఈచిత్రం షూర్‌ షాట్‌ విజయం అంటుంటే ఆనందంగా ఉంది. క్యూట్‌ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రత సన్నివేశం ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తుంది" అని అన్నారు.

అత్యధిక బడ్జెట్‌తో

"జూలై 11న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. పూర్తి ఎంటర్‌టైనింగ్‌గా రాబోతున్న ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మీ హృదయాలను దోచుకుంటుంది. తప్పకుండా నిర్మాతగా ఓ మంచి సినిమాను ఇవ్వబోతున్నాం అనే నమ్మకం ఉంది" అని హరీష్ నల్ల పేర్కొన్నారు.

కామెడీ-ఎమోషనల్

ఇక ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌ను గమనిస్తే.. నవ్వించే కామెడీ సీన్లతోపాటు ఏడిపించే ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్‌, హీరో, హీరోయిన్స్‌ ఎనర్జీ, ఇలా ఈతరం ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల వారిని అలరించే ఫుల్‌ ప్యాకేజీగా ఈ చిత్రాన్ని రూపొందించారని అర్థమవుతోంది.

శ్మశానంలో హీరో హీరోయిన్

హీరోను హీరోయిన్ శ్మశానంలో కూర్చోబెట్టడం, పక్కనే చేతబడి ముగ్గు చూసి హీరో భయపడటం వంటి సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ చిత్రంలో ప్రముఖ డైరెక్టర్స్ హరీష్ శంకర్, మారుతి అతిథి పాత్రలో కనిపించి అలరించారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe